ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గయానాలో భారత సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి: ప్రధాన మంత్రి


భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద విశేష కృషి ప్రశంసనీయం: విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 NOV 2024 3:06AM by PIB Hyderabad

భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద విశేష కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు.

“గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి. సాంస్కృతిక సంబంధాలను, ప్రజా సంబంధాలను పెంపొందించడంలో ముందున్న సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించే అవకాశం నాకు కలిగింది. ఈ పాఠశాలతో సంబంధమున్న వారందరికీ నా అభినందనలు. భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద కృషి ప్రశంసనీయం’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన పేర్కొన్నారు. 

 

 

***


MJPS/SR


(रिलीज़ आईडी: 2075854) आगंतुक पटल : 61
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam