ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)

Posted On: 20 NOV 2024 9:55PM by PIB Hyderabad

క్రమ సంఖ్య

సంతకం చేసిన ఒప్పందాలు

అవగాహనా ఒప్పందం పరిధి

1.

హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం

ముడి చమురు వెలికితీయడం, సహజవాయువు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, హైడ్రోకార్బన్ విలువ ఆధారిత వ్యవస్థలో నైపుణ్యాలను పంచుకోవడం తదితర అంశాల్లో సహకారం.

2.

వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఒప్పందం

ఉమ్మడి కార్యకలాపాలు, శాస్త్రీయ సామగ్రి, సమాచారం పంచుకోవడం, సిబ్బంది వినిమయం ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం

3.

సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (2024-27)

రంగస్థలం, సంగీతం, లలిత కళలు, సాహిత్యం, గ్రంథాలయం, వస్తుప్రదర్శనశాల వ్యవహారాల్లో సహకారంతో పాటు సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్-గయానా మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.

 

4.

భారత ఫార్మకోపియాను గుర్తించేలా భారత ఫార్మకోపియా కమిషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గయానా ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్శ శాఖ మధ్య ఒప్పందం

ఇరు పక్షాల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఔషధాల నియంత్రణలో సన్నిహిత సహకార అభివృద్ధి, సమాచార మార్పిడి ప్రాధాన్యతను గుర్తించడం

 

5.

జన ఔషధి పథకం (పీఎంబీజేపీ) అమలుకు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థ, గయానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం.

పీఎంబీజేపీ పథకం ద్వారా కరీబియన్ సమూహ దేశాలకు సరసమైన ధరలకే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల ద్వారా ఔషధాల సరఫరా

6.

వైద్య ఉత్పత్తుల రంగంలో సహకారానికి సీడీఎస్‌సీవో, గయానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య అవగాహనా ఒప్పందం.

ఔషధాలు, జీవ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలతో సహా ఫార్మాసూటికల్ రంగంలో వైద్య ఉత్పత్తుల నియంత్రణ దిశగా చర్చలు, సహకార వ్యవస్థల ఏర్పాటు చేయడమే లక్ష్యం

7.

జనాభా ఆధారంగా డిజిటల్ పరివర్తన దిశగా విజయవంతమైన సాంకేతిక పరిష్కారాలను పంచుకునేలా ఇండియా స్టాక్ అవగాహన ఒప్పందం

  1. సామర్థ్య నిర్మాణం, శిక్షణా కార్యక్రమాలు, అలంబిస్తున్న ఉత్తమ పద్ధతులు పంచుకోవడం, అధికారులు, నిపుణుల వినిమయం, పైలట్, డెమో పరిష్కారాలను అభివృద్ధి చేయడం ద్వారా సాంకేతిక పరివర్తనా రంగంలో సహకారాన్ని ఏర్పాటు చేయడం

8.

యూపీఐ తరహా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్, గయానా విదేశీ వ్యవహారాల శాఖ మధ్య అవగాహనా ఒప్పందం

 

 

గయానాలో యూపీఐ తరహా రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థను పరస్పరం అమలు చేయాల్సిన అవకాశాన్ని అర్థం చేసుకోవడమే ఈ ఎంఓయూ లక్ష్యం.

 

9.

ప్రసార భారతి, నేషనల్ కమ్యూనికషన్స్ నెట్వర్క్, గయానా మధ్య ప్రసార రంగంలో సహకార భాగస్వామ్య ఒప్పందం

సాంస్కృతిక, విద్య, సైన్స్, వినోదం, క్రీడలు, వార్తల రంగాల్లో ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాల్లో కార్యక్రమాల పరస్పర మార్పిడి

10.

ఎన్‌డీఐ (జాతీయ రక్షణ సంస్థ, గయానా), ఆర్ఆర్‌యూ (రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, గుజరాత్) మధ్య అవగాహనా ఒప్పందం.

రెండు సంస్థల మధ్య జాతీయ భద్రత, రక్షణ అధ్యయనాల్లో పరిశోధన, విద్య, శిక్షణను మెరుగుపరచడానికి సహకార భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడమే ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం.

 

***


(Release ID: 2075397) Visitor Counter : 6