ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                06 NOV 2024 1:57PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికాల మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా సహకారాన్ని పునరుద్ధరించేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.
‘‘ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. గతంలో మీరు అధికారంలో ఉన్న సమయంలో సాధించిన విజయాల ఆధారంగా, భారత్-అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా సహకారాన్ని పునరుద్ధరించేందుకు ఎదురుచూస్తున్నాను. మన ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం కలసి పని చేద్దాం.’’ అని శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.
 
 
 
***
MJPS/SR
                
                
                
                
                
                (Release ID: 2071112)
                Visitor Counter : 95
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali-TR 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam