సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner

‘భారతీయ ఫీచర్ ఫిలిం ఉత్తమ డెబ్యూ డైరెక్టర్’ విభాగంలో పోటీకి అధికారికంగా ఎంపికైన చిత్రాలను ప్రకటించిన ఇఫి 2024

55వ ఇఫిలో భారతీయ దర్శకులు రూపొందిచిన 5 డెబ్యూ చిత్రాల మధ్య పోటీ

దేశంలో నూతన, యువ ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో, 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫి) ‘బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్’ అనే కొత్త విభాగంలో అవార్డును అందజేస్తారు. దేశవ్యాప్తంగా వినూత్న ఆలోచనలు, భిన్నమైన కథన రీతులు, వినూత్న చిత్ర శైలిని ప్రతిబింబించిన అయిదు ఉత్తమ తొలి చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తారు.  ఈ నెల 20 నుంచి 28 తేదీ మధ్య జరిగే ఇఫి ఉత్సవాల్లో భారతీయ ఫీచర్ ఫిలిం ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి విభాగంలో పోటీ పడేందుకు అధికారికంగా ఎంపిక చేసిన చిత్రాల వివరాలను ప్రకటించారు.

భారత ఫీచర్ ఫిలిం విభాగంలో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: అధికారికంగా ఎంపిక చేసిన చిత్రాలు

 

క్రమ సంఖ్య

సినిమా శీర్షిక

దర్శకుడు

భాష

1

బూంగ్

లక్ష్మీప్రియా దేవి

మణిపురి

2

ఘరత్ ఘన్‌పాటీ

నవజ్యోత్ బందీవాడేకర్

మరాఠీ

3

మిక్కా బన్నాడా హక్కి (బర్డ్ ఆఫ్ ఎ డిఫరెంట్ ఫెదర్)

మనోహర కె

కన్నడ

4

రజాకార్ (సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్)

యాట సత్యనారాయణ

తెలుగు

5

తన్నుప్ (ది కోల్డ్)

రాగేష్ నారాయణన్

మలయాళం



ఈ జాబితాలోని ప్రతి చలనచిత్రం భిన్నమైన కథన శైలిని, ప్రాంతీయ కోణాలను స్పృశిస్తూ భారత సంస్కృతి, భాషా వైవిధ్యాన్ని భిన్నత్వాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కాయి.

ముగింపు ఉత్సవంలో పురస్కార ప్రదానం

ఎంపికైన చిత్రాలను గోవాలో జరిగే 55వ ఇఫిలో జ్యూరీ వీక్షించి, భారతీయ ఫీచర్ ఫిలిం ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగంలో విజేతను ఎంపిక చేస్తుంది.  వారి వివరాలను ఈ నెల 28న జరిగే ముగింపు ఉత్సవంలో ప్రకటిస్తారు.

భారతదేశంలోని చలనచిత్ర, కళాసంఘాలకు చెందిన ప్రముఖులతో కూడిన ప్రివ్యూ కమిటీ అర్హత గల 117 ఎంట్రీల నుంచి ఈ అయిదు సినిమాలను ఎంపిక చేసింది.

నూతన భారతీయ ప్రతిభకు పట్టం

సినిమా రంగంలో సరికొత్త ఆలోచనలను, సృజనాత్మకతను ప్రోత్సహించి సంప్రదాయ కథన సరిహద్దులను చెరిపేసే ఉద్దేశంతో భారత డెబ్యూ చిత్రాలపై ఈ ఏడాది ఇఫి దృష్టి సారించింది. ఈ చిత్రాలను గౌరవించడం ద్వారా భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రసంశలు దక్కేలా చేయడంతో పాటు, వర్థమాన చిత్ర దర్శకులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఫీచర్ చిత్రాల విభాగంలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏపీఎఫ్) గుర్తింపు  పొందిన 14 సినిమా ఉత్సవాల్లో ఒకటిగా ఇఫి గుర్తింపు పొందింది. ఇది భారతీయ చిత్ర రూపకర్తలకు అంతర్జాతీయ గుర్తింపు అందించే ప్రధాన వేదిక.

మరింత సమాచారం కోసం: https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2054935 
55వ ఇఫి లో చలన చిత్రాల ప్రదర్శన షెడ్యూలుకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.iffigoa.org వెబ్ సైట్ ను సందర్శించండి.

 

***

iffi reel

(Release ID: 2070739) Visitor Counter : 70