ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్య రంగంలో రూ. 12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల ఆవిష్కరణ, ప్రారంభం, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికే మా ప్రాధాన్యం, ఈ రంగంలో నేడు ప్రారంభించిన కార్యక్రమాలు

ప్రజలకు అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లోనే సదుపాయాలు...

ఈ రోజు 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం నిర్వహించుకోవడం మనందరికీ సంతోషకరమైన విషయం

ఆరోగ్య విధానం కోసం అయిదు మూల స్తంభాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

దేశంలోని 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులందరికీ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స

వారందరికీ ఆయుష్మాన్ వయ వందన కార్డులు అందిస్తాం
ప్రాణాంతక వ్యాధుల నివారణకు ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ ప్రచారం


ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించడం ద్వారా

మన ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆదా చేస్తోంది: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 29 OCT 2024 3:09PM by PIB Hyderabad

ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా... ఈరోజు న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య రంగానికి సంబంధించి దాదాపు రూ.12,850 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్నింటిని ప్రారంభించగామరికొన్నింటిని ఆవిష్కరించారుఅలాగే కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి మాట్లాడుతూ... ధ‌న్వంత‌రి జ‌యంతిదంతేరస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్ష‌లు తెలిపారుఈ పండుగ వేళ దాదాపుగా ప్రతి కుటుంబం ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేస్తుందనీఅందుకు దేశంలోని వ్యాపార యజమానులందరికీ  ఆయన శుభాకాంక్షలు తెలియజేశారుఅలాగే దీపావళి పండుగ కోసం అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.

అయోధ్యలోని శ్రీరాముని ఆలయం వేలాది దీపాల వెలుగులతో ప్రకాశిస్తూ ఈ వేడుకలను అపూర్వమైనవిగా మార్చిన క్రమంలో ఈ దీపావళిని చరిత్రాత్మకమైనదిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. "ఈ సంవత్సరం దీపావళికి రాముడు మరోసారి తన ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే చివరకు ఈ నిరీక్షణ 14 సంవత్సరాలకు కాదు500 సంవత్సరాల తర్వాత ముగిసింది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది దంతేరస్ పండుగ శ్రేయస్సుఆరోగ్యాల సమ్మేళనంగానే కాకుండా భారతదేశ సంస్కృతిజీవన తత్వానికి ప్రతీకగా ఉండడం యాదృచ్ఛికం కాదని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారురుషులుసాధువులూ ఆరోగ్యాన్ని మహోన్నత సంపదగా పరిగణిస్తారనీఈ పురాతన భావన యోగా రూపంలో ప్రపంచ వ్యాప్తంగా ఆమోదం పొందుతోందని ప్రధాని తెలిపారుఈ రోజు 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారుఆయుర్వేదం పట్ల పెరుగుతున్న ఆదరణకూపురాతన కాలం నుంచి ప్రపంచానికి ఆయుర్వేదం ద్వారా భారత్ అందించిన సహకారానికీ ఇది నిదర్శనమని అన్నారు.

ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక వైద్యంతో సమ్మిళితం చేయడం ద్వారా గడిచిన దశాబ్దంలో దేశ ఆరోగ్య రంగంలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ఈ అధ్యాయానికి అఖిల భారత ఆయుర్వేద సంస్థ కేంద్ర స్థానంగా ఉందన్నారుఏడేళ్ల కిందట ఆయుర్వేద దినోత్సవం రోజున ఈ సంస్థ మొదటి దశను జాతికి అంకితం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాననీఅలాగే ధన్వంతరి స్వామి ఆశీస్సులతో ఈ రోజు రెండో దశను సైతం ప్రారంభించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారుఆయుర్వేదంవైద్య విజ్ఞాన రంగాల్లో అధునాతన పరిశోధనఅధ్యయనాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళితం చేసిన పంచకర్మ వంటి ప్రాచీన పద్ధతులను ఈ సంస్థలో చూడవచ్చని ఆయన పేర్కొన్నారుఈ పురోగతి పట్ల దేశ ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

ఒక దేశ పురోగతి నేరుగా ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంటుందని పేర్కొన్న ప్రధానమంత్రి... ప్రజల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారుఆరోగ్య విధానం కోసం ఉద్దేశించిన అయిదు మూల స్తంభాలను ఆయన వివరించారునివారణాత్మక ఆరోగ్య సంరక్షణరోగాలను ముందుగానే గుర్తించడంచికిత్సమందులు ఉచితంగాతక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండంచిన్న పట్టణాల్లోనూ వైద్యులు అందుబాటులో ఉండడంచివరిగా ఆరోగ్య సేవల్లో సాంకేతికతను విస్తరించడం వంటి వాటిని అయిదు మూలస్తంభాలుగా అభివర్ణించారుభారత్ ఆరోగ్య రంగాన్ని సంపూర్ణాత్మక ఆరోగ్యంగా చూస్తోంది అని పేర్కొన్న ప్రధానమంత్రి... నేటి ప్రాజెక్టులు ఈ అయిదు మూల స్తంభాలను గురించి మనకు తెలియజేస్తాయన్నారు13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవంశంకుస్థాపన సందర్భంగాఆయుష్ హెల్త్ స్కీమ్ కింద ఎక్సెలెన్స్ సెంటర్ల ఏర్పాటుడ్రోన్ల వినియోగంతో ఆరోగ్య సేవల విస్తరణరిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో హెలికాప్టర్ సేవలున్యూఢిల్లీబిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌లలో నూతన మౌలిక సదుపాయాలుదేశంలోని మరో అయిదు ఇతర ఎయిమ్స్‌లలో సేవల విస్తరణవైద్య కళాశాలల స్థాపననర్సింగ్ కళాశాలలకు భూమి పూజఆరోగ్య రంగానికి సంబంధించిన ఇతర ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. కార్మికుల చికిత్స కోసం అనేక ఆసుపత్రులను నెలకొల్పడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి... ఇది కార్మికుల చికిత్సా కేంద్రంగా మారుతుందన్నారు. అధునాతన ఔషధాలుఅధిక నాణ్యత గల స్టెంట్లువైద్య పరికరాల తయారీలో కీలకం కానున్న ఫార్మా యూనిట్ల ప్రారంభంతో దేశం మరింత అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

మనలో చాలా మంది అనారోగ్యం అంటే మొత్తం కుటుంబంపై మెరుపు దాడిగా భావించే నేపథ్యం నుంచి వచ్చినవారమేననీముఖ్యంగా పేద కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటేకుటుంబంలో ప్రతి సభ్యునిపై దాని ప్రభావం ఉంటుందని ప్రధానమంత్రి పేర్కొన్నారువైద్యం కోసం ప్రజలు తమ ఇళ్లుభూములునగలుఅన్నింటినీ అమ్ముకునే కాలం ఉండేదనీపేద ప్రజలు వారి కుటుంబ ఆరోగ్యంఇతర ప్రాధాన్యాల మధ్య ఏదైనా ఒకటే ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆదాయానికి మించిన ఖర్చులను భరించలేని పరిస్థితి ఉండేదన్నారుపేదల నిరాశను దూరం చేసేందుకుమా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందనీపేదల ఆసుపత్రి ఖర్చులో రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారుదేశంలోని దాదాపు కోట్ల మంది పేద‌లు ఆయుష్మాన్ పథకం ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించ‌కుండా చికిత్స అందుకుని ల‌బ్ది పొందార‌ని ప్ర‌ధానమంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారుదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ పథకం లబ్ధిదారులను తాను కలుసుకున్నప్పుడుఈ పథకంతో అనుబంధం గల వైద్యులుపారామెడికల్ సిబ్బంది సహా ప్రతి వ్యక్తీ దీనిని ఒక వరంగా భావించడం సంతృప్తినిచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

ఆయుష్మాన్ పథక విస్తరణపై సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ మోదీ... ప్రతి వృద్ధుడు దాని కోసం ఎదురు చూస్తున్నారనీమూడోసారి అధికారంలోకి రాగానే 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరినీ ఆయుష్మాన్ పరిధిలోకి తీసుకువస్తామన్న ఎన్నికల హామీ నెరవేరుతోందని అన్నారుదేశంలోని 70 ఏళ్లు పైబడిన ప్రతి వృద్ధుడికీ ఆయుష్మాన్ వయ వందన కార్డు ద్వారా ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తామని తెలిపారుఈ కార్డు సార్వత్రికమైనదనిపేదమధ్యతరగతిఉన్నత వర్గాలు అనే తేడా లేకుండాఎలాంటి ఆదాయ పరిమితి లేకుండా దీనిని అందిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయడం గొప్ప విజయమనీవృద్ధుల కోసం అందించే ఆయుష్మాన్ వయ వందన కార్డుతోఅనేక కుటుంబాల్లో ఆదాయానికి మించిన ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుఈ పథకం ప్రారంభమైన క్రమంలో దేశ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారుఢిల్లీపశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయడం లేదని ఆయన తెలిపారు.

పేదమధ్యతరగతి కుటుంబాల చికిత్స ఖర్చు తగ్గించడం పట్ల ప్రభుత్వ ప్రాధాన్యాన్ని పునరుద్ఘాటిస్తూ80 శాతం తగ్గింపు ధరతో ఔషధాలు అందుబాటులో ఉంచుతూదేశవ్యాప్తంగా 14 వేల పిఎమ్ జన్ ఔషధి కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారుపేదమధ్యతరగతి ప్రజలకు చవక ధరలకు మందులు అందుబాటులోకి రావడంతో రూ.30 వేల కోట్లు ఆదా చేయగలిగామన్నారుస్టెంట్లుమోకాలి ఇంప్లాంట్లు వంటి పరికరాల ధరలను తగ్గించామనీతద్వారా సామాన్యులకు రూ. 80 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని నివారించగలిగామన్నారుప్రాణాంతక వ్యాధులను అరికట్టడంతో పాటు గర్భిణులునవజాత శిశువుల ప్రాణాలను కాపాడేందుకు గల ఉచిత డయాలసిస్ పథకంమిషన్ ఇంద్రధనుష్ ప్రచారం గురించి కూడా ఆయన ప్రస్తావించారుదేశంలోని పేదమధ్యతరగతి ప్రజలు ఖరీదైన వైద్య చికిత్సల భారం నుంచి పూర్తిగా విముక్తి పొందే వరకూ తాను విశ్రమించబోనని ప్రధాని హామీ ఇచ్చారు.

అనారోగ్యాల వల్ల కలిగే నష్టాలనుఇబ్బందులను తగ్గించడంలో సకాలంలో రోగనిర్ధారణ కీలకమైనదని ప్రధానమంత్రి స్పష్టం చేశారుసాధ్యమైనంత త్వరగా రోగ నిర్ధారణ చేసిచికిత్సలను సత్వరమే అందించేందుకు దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారుఈ ఆరోగ్య మందిరాల వల్ల కోట్లాది మంది ప్రజలు క్యాన్సర్రక్తపోటుమధుమేహం వంటి వాటి విషయంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను సులభంగా చేయించుకుంటున్నట్లు చెప్పారుసకాలంలో రోగనిర్ధారణ చేయడం ద్వారా సత్వరమే చికిత్స అందించే వీలుంటుందనీదీంతో రోగులకు ఖర్చులు తగ్గుతాయన్నారు30 కోట్ల మందికి పైగా ప్రజలు ఆన్‌లైన్‌లో వైద్యులను సంప్రదించిన ఈ-సంజీవని పథకం కింద ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికిప్రజాధనం ఆదా చేయడానికి ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించుకుంటోందని ప్రధానమంత్రి వివరించారు. "ఉచితంగాసంబంధిత వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్యం కోసం చేసే ఖర్చులు గణనీయంగా తగ్గాయిఅని ఆయన పేర్కొన్నారుఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను జోడిస్తూ యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు శ్రీ మోదీ ప్రకటించారు. "మహమ్మారి సమయంలో మన కో-విన్ ప్లాట్‌ఫామ్ సాధించిన విజయాన్ని ప్రపంచం చూసింది. యూపిఐ చెల్లింపు వ్యవస్థ విజయం ప్రపంచంలో ఒక ప్రధాన విజయగాథగా నిలిచిందిఅని ఆయన అన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఆరోగ్య రంగంలో ఈ విజయాన్ని పునరావృతం చేయడమే ఇప్పుడు మన ముందున్న లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 ఈ దశాబ్ద కాలానికి ముందు గత ఆరు నుంచి ఏడు దశాబ్దాల్లో సాధించిన పరిమిత విజయాలతో పోల్చితేగడిచిన దశాబ్దంలో ఆరోగ్య సంరక్షణ రంగంలో మనం అపూర్వమైన పురోగతిని సాధించామని ప్రధానమంత్రి తెలిపారు. “గత 10 ఏళ్ల కాలంలోరికార్డు సంఖ్యలో కొత్త ఎయిమ్స్, వైద్య కళాశాలల్ని స్థాపించడం మనం చూశాంఅని ఆయన పేర్కొన్నారు. నేటి సందర్భాన్ని ప్రస్తావిస్తూకర్ణాటకఉత్తరప్రదేశ్మధ్యప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌లలో ఆసుపత్రులను ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారుకర్ణాటకలోని నర్సాపూర్బొమ్మసంద్రమధ్యప్రదేశ్‌లోని పితంపూర్ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంహర్యానాలోని ఫరీదాబాద్‌లలో కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. "అదనంగాఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో కొత్త ఈఎస్ఐసీ ఆసుపత్రి పనులు ప్రారంభమయ్యాయిఇండోర్‌లోనూ కొత్త ఆసుపత్రి ప్రారంభమైందిఅని ఆయన తెలిపారుపెరుగుతున్న ఆసుపత్రుల సంఖ్య వైద్య సీట్లలో దామాషా పెరుగుదలను సూచిస్తోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారుడాక్టర్ కావాలనే పేద పిల్లల కల ఇక చెదిరిపోదనీభారతదేశంలో తగినన్ని సీట్లు లేకపోవడం వల్ల మధ్యతరగతి విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరం ఉండదనీ ఆయన స్పష్టం చేశారుగడిచిన 10 ఏళ్ల కాలంలో కొత్తగా దాదాపు లక్ష ఎంబీబీఎస్ఎమ్‌డీ సీట్లు పెరిగాయని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారురాబోయే అయిదేళ్లలో మరో 75 వేల సీట్లను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

7.5 లక్షల మంది ఆయుష్ వైద్యులు ఇప్పటికే దేశ ఆరోగ్య సంరక్షణ కోసం తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొన్నారుఈ సంఖ్యను మరింత పెంచాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మెడికల్వెల్‌నెస్ టూరిజం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారుభారతదేశంవిదేశాల్లో ప్రివెంటివ్ కార్డియాలజీఆయుర్వేద ఆర్థోపెడిక్స్ఆయుర్వేద పునరావాస కేంద్రాల వంటి రంగాలను విస్తరించేందుకు యువతఆయుష్ వైద్యులు సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. “ఆయుష్ వైద్యుల కోసం అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయిమన యువత ఈ అవకాశాల ద్వారా అభివృద్ధి చెందడమే కాకుండా మానవాళికి గొప్ప సేవను కూడా అందిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.

21వ శతాబ్దంలో వైద్యరంగం వేగవంతమైన పురోగతినీగతంలో నయం చేయలేని వ్యాధుల చికిత్స విషయంలో నేడు సాధించిన పురోగతినీ ప్రధాని మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. "ప్రపంచం చికిత్సతో పాటు శ్రేయస్సుకూ ప్రాధాన్యమిస్తున్న క్రమంలోఈ రంగంలో మన దేశం వేల సంవత్సరాల జ్ఞానాన్ని కలిగి ఉందిఅని ఆయన పేర్కొన్నారుఆయుర్వేద సూత్రాలను ఉపయోగించి వ్యక్తులకు ఆదర్శవంతమైన జీవనశైలివ్యాధుల ముప్పు విశ్లేషణలను రూపొందించే లక్ష్యంతో ప్రకృతి పరిరక్షణ అభియాన్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారుఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని నవీకరించడంతో పాటుమొత్తం ప్రపంచానికి సరికొత్త దృక్పథాన్ని అందించగలదని ఆయన స్పష్టం చేశారు.

 

అశ్వగంధపసుపునల్ల మిరియాలు వంటి సంప్రదాయ మూలికలను అధిక-ప్రభావవంతమైన శాస్త్రీయ అధ్యయనాల ద్వారా ధ్రువీకరించాల్సిన అవసరముందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. "మన సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ప్రయోగశాలల్లో ధ్రువీకరిస్తే ఈ మూలికల విలువ పెరగడంతో పాటు గణనీయమైన మార్కెట్‌ కూడా ఏర్పడుతుందిఅని ఆయన వ్యాఖ్యానించారు. అశ్వగంధకు పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తూ... ఈ దశాబ్దం చివరి నాటికి దీని మార్కెట్ విలువ 2.5 బిలియన్ డాలర్లకు చేరుకోగలదనే అంచనాలను ఆయన ప్రస్తావించారు.

ఆయుష్ విజయం ఆరోగ్య రంగాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థనూ ప్రభావితం చేస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆయుష్ తయారీ రంగం 2014లో బిలియన్ డాలర్ల నుంచి దాదాపు 24 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఇది కేవలం 10 ఏళ్లలో రెట్లు పెరిగిందని తెలిపారుభారతదేశంలో ఇప్పుడు 900 లకు పైగా ఆయుష్ అంకుర సంస్థలు పనిచేస్తూయువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన తెలిపారుప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోందని పేర్కొన్న ప్రధానమంత్రిస్థానిక మూలికలుసూపర్‌ఫుడ్‌లను ప్రపంచస్థాయి సరుకులుగా మార్చడం ద్వారా భారతీయ రైతులకు ప్రయోజనం కలిగిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టం చేశారుగంగానది తీరం వెంబడి సేంద్రియ వ్యవసాయంమూలికల సాగును ప్రోత్సహించే నమామి గంగే ప్రాజెక్ట్ వంటి కార్యక్రమాలను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

ఆరోగ్యంశ్రేయస్సు పట్ల భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తూభారత జాతీయ స్వభావానికిసామాజిక స్వరూపానికి ఇది ఆత్మ వంటిదని శ్రీ మోదీ అన్నారుగత 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం 'బ్ కా సాత్బ్ కా వికాస్విధానంతో దేశ విధానాలను సమ్మిళితం చేసిందని ఆయన ఉద్ఘాటించారు. "రాబోయే 25 ఏళ్లలోఈ ప్రయత్నాలు అభివృద్ధి చెందినఆరోగ్యకరమైన భారతదేశానికి బలమైన పునాది వేస్తాయి" అని పేర్కొంటూ శ్రీ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమరసాయనాలుఎరువుల శాఖ మంత్రి శ్రీ జే పీ నడ్డాకార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ప్రధాన పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎమ్-జెఎవై)ని విస్తరిస్తూ70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత వైద్యం అందించే పథకాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారుఇది వారి ఆదాయంతో సంబంధం లేకుండా వృద్ధులందరికీ ఆరోగ్య కవరేజీని అందించడంలో సహాయపడుతుంది.

దేశవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం కోసం ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారుఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక వసతులను మెరుగురచడం కోసం ప్రధానమంత్రి పలు ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రారంభించిశంకుస్థాపనలు చేశారు.

దేశంలో మొదటి అఖిల భారత ఆయుర్వేద సంస్థ రెండో దశను ప్రధానమంత్రి ప్రారంభించారుఇందులో పంచకర్మ ఆసుపత్రిఔషధాల తయారీకి ఆయుర్వేద ఫార్మసీస్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్సెంట్రల్ లైబ్రరీఐటీఅంకురసంస్థల ఇంక్యుబేషన్ సెంటర్, 500 సీట్లు గల ఆడిటోరియం ఉన్నాయిమధ్యప్రదేశ్‌లోని మందసౌర్నీముచ్సియోనిలలో మూడు వైద్య కళాశాలలను కూడా ఆయన ప్రారంభించారుఇంకాహిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిబీహార్‌లోని పాట్నాఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్మధ్యప్రదేశ్‌లోని భోపాల్అస్సాంలోని గౌహతిన్యూఢిల్లీలోని వివిధ ఎయిమ్స్‌లలో సౌకర్యాలుసేవల విస్తరణ పనులను ఆయన ప్రారంభించారుఇందులో జన ఔషధీ కేంద్రాలు కూడా ఉన్నాయిఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగాన్నిఒడిశాలోని బార్‌గఢ్‌లో క్రిటికల్ కేర్ విభాగాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.

మధ్యప్రదేశ్‌లోని శివపురిరత్లాంఖాండ్వారాజ్‌గఢ్మందసౌర్‌లలో అయిదు నర్సింగ్ కళాశాలలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పిఎమ్-ఎబిహెచ్ఐఎమ్కింద హిమాచల్ ప్రదేశ్కర్ణాటకమణిపూర్తమిళనాడురాజస్థాన్‌లలో 21 క్రిటికల్ కేర్ విభాగాలనున్యూఢిల్లీహిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ ఎయిమ్స్‌లలో అనేక సౌకర్యాలుసేవల విస్తరణ పనులను ఆయన ప్రారంభించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈఎస్ఐసీ ఆసుపత్రిని ప్రధానమంత్రి ప్రారంభించారుహర్యానాలోని ఫరీదాబాద్కర్ణాటకలోని బొమ్మసంద్రనర్సాపూర్మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ఆంధ్రప్రదేశ్‌లోని అచ్యుతాపురంలో ఈఎస్ఐసీ ఆసుపత్రులకు ఆయన శంకుస్థాపన చేశారుఈ ప్రాజెక్టులు దాదాపు 55 లక్షల మంది ఈఎస్‌ఐ లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందిస్తాయి.

అన్ని సేవలనీ అందించే వ్యవస్థలను మెరుగుపరచడం కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని విస్తరించడాన్ని ప్రధానమంత్రి బలంగా సమర్థిస్తారుఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సర్వీస్ డెలివరీని మెరుగుపరచడం కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగించడానికి వీలుగా 11 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో డ్రోన్ సేవలను ప్రధానమంత్రి ప్రారంభించారుఉత్తరాఖండ్‌లోని రిషికేశ్తెలంగాణలోని బీబీనగర్అస్సాంలోని గౌహతిమధ్యప్రదేశ్‌లోని భోపాల్రాజస్థాన్‌లోని జోధ్‌పూర్బీహార్‌లోని పాట్నాహిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌లలోమణిపూర్‌లోని ఇంఫాల్‌లో గల రిమ్స్‌లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. అలాగే రిషికేశ్ ఎయిమ్స్ నుంచి అత్యవసర హెలికాప్టర్ వైద్య సేవలను సైతం ఆయన ప్రారంభించారు. ఇది అత్యంత వేగంగా వైద్య సేవలను అందించడంలో సహాయపడుతుంది.

యూ-విన్ పోర్టల్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారుటీకా ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయడం ద్వారా గర్భిణులు, శిశువులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందిటీకా ద్వారా నివారించగల 12 వ్యాధుల నుంచి రక్షణ కోసందీని ద్వారా గర్భిణులుపిల్లల (పుట్టుక నుంచి 16 సంవత్సరాల వరకుప్రాణాలను రక్షించే టీకాలు సకాలంలో అందించవచ్చుఇంకాఅనుబంధఆరోగ్య సంరక్షణ నిపుణులుసంస్థల కోసం ఒక పోర్టల్‌ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారుఇది ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ నిపుణులుసంస్థల కేంద్రీకృత డేటాబేస్‌గా పని చేస్తుంది.

దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడం కోసం పరిశోధనఅభివృద్ధి, పరీక్షల కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అనేక కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభించారుఒడిశాలోని భువనేశ్వర్‌ గోతపట్నలో సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీని కూడా ఆయన ప్రారంభించారు.

ఒడిశాలోని ఖోర్ధాఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో యోగానేచురోపతిలో రెండు సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లకు ఆయన శంకుస్థాపన చేశారువైద్య పరికరాల కోసం గుజరాత్‌లోని ఎన్ఐపీఈఆర్ అహ్మదాబాద్‌లోబల్క్ డ్రగ్స్ కోసం తెలంగాణలోని ఎన్ఐపీఈఆర్ హైదరాబాద్‌లోఫైటోఫార్మాస్యూటికల్స్ కోసం అస్సాంలోని ఎన్ఐపీఈఆర్ గౌహతిలోయాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ డ్రగ్ ఆవిష్కరణఅభివృద్ధి కోసం పంజాబ్‌లోని ఎన్ఐపీఈఆర్ మొహాలీలో నాలుగు ఎక్స్‌లెన్స్ సెంటర్‌లకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.

బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మధుమేహంజీవక్రియ సంబంధ రుగ్మతల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ఐఐటీ ఢిల్లీలో అధునాతన సాంకేతిక పరిష్కారాలుఅంకురసంస్థలకు మద్దతురసౌషధీల కోసం నెట్ జీరో సుస్థిర పరిష్కారాల కోసం సుస్థిరమైన ఆయుష్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్లక్నోలోని సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోఆయుర్వేదంలో ప్రాథమికట్రాన్స్‌లేషనల్ పరిశోధన కోసం సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో ఆయుర్వేదంసిస్టమ్స్ మెడిసిన్‌పై ఎక్సెలెన్స్ సెంటర్ వంటి నాలుగు ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కేంద్రాలను ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసంగుజరాత్‌లోని వాపితెలంగాణలోని హైదరాబాద్కర్ణాటకలోని బెంగళూరుఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడహిమాచల్ ప్రదేశ్‌లోని నలాగఢ్‌లో వైద్య పరికరాలుబల్క్ డ్రగ్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐపథకం కింద అయిదు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారుఈ విభాగాలు ముఖ్యమైన బల్క్ డ్రగ్స్‌తో పాటు బాడీ ఇంప్లాంట్లుక్రిటికల్ కేర్ పరికరాల వంటి అత్యాధునిక వైద్య పరికరాలను తయారు చేస్తాయి.

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహనను పెంపొందించే లక్ష్యంతో "దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్అనే దేశవ్యాప్త ప్రచారాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారుప్రతి రాష్ట్రంకేంద్రపాలిత ప్రాంతం కోసం వాతావరణ మార్పులుమానవ ఆరోగ్యంపై రాష్ట్ర నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రారంభించారు. ఇది వాతావరణాన్ని తట్టుకునే ఆరోగ్య సంరక్షణ సేవలను అభివృద్ధి చేయడానికి అనుసరణ వ్యూహాలను రూపొందించనుంది.

 

 

 

***

MJPS/SR/TS




(Release ID: 2069440) Visitor Counter : 16