హోం మంత్రిత్వ శాఖ
సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి- రాష్ట్రీయ ఏక్తాదివస్ నాటి ఐక్యతా పరుగు ఈసారి అక్టోబరు 29న
దీపావళి ఉన్నందున ఈసారి ఐక్యతా పరుగును అక్టోబరు 29 మంగళవారం
నిర్వహిస్తామని మన్ కి బాత్ కార్యక్రమంలో వెల్లడించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
దేశ ఐక్యతా మంత్రాన్ని అందిపుచ్చుకుంటూ పెద్ద సంఖ్యలో దేశ ప్రజలు పాల్గొనాలనీ,
ఫిట్ నెస్ మంత్రానికి ఎల్లెడలా ప్రచారం కల్పించాలంటూ పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
రాష్ట్రీయ ఏక్తాదివస్ సందర్భంగా సర్ధార్ వల్లభాయి పటేల్ కి నివాళిగా అనేక కార్యక్రమాలు...
అక్టోబరు 31న జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞ
Posted On:
27 OCT 2024 9:04PM by PIB Hyderabad
సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి రోజున రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా అక్టోబరు 29న ఐక్యతా పరుగును నిర్వహిస్తున్నట్లుగా ఆకాశవాణి... మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి వెల్లడించారు. అక్టోబరు 31 దీపావళి రోజునే సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి కూడా వచ్చిందని ఆయన తెలిపారు. ప్రతి యేటా అక్టోబరు 31న రాష్ట్రీయ ఏక్తాదివస్ సందర్భంగా ఐక్యతా పరుగును నిర్వహించడం ఆనవాయితీ అనీ, అయితే, దీపావళి కూడా అదే రోజున వచ్చినందున ఈసారి ఐక్యతా పరుగును అక్టోబరు 29వ తేదీ మంగళవారం నాడు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశ ప్రజలు పెద్ద ఎత్తున ఈ పరుగు కార్యక్రమంలో పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. ఐక్యతా పరుగు మంత్రాన్ని అందిపుచ్చుకోవాలనీ, దీనిని అన్ని ప్రాంతాలకూ తీసుకుపోవాలనీ సూచించారు.
రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమాలన్నీ సర్దార్ వల్లభాయి పటేల్ కు అర్పించే నివాళిగా ఉంటాయి. జాతీయ ఐక్యతా దినోత్సవ ప్రతిజ్ఞను అక్టోబరు 31న నిర్వహిస్తారు.
(Release ID: 2068806)
Visitor Counter : 43