జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆరో జాతీయ స్థాయి జల పురస్కారాలు, 2024 ప్రక్రియను మొదలుపెట్టిన జల్ శక్తి శాఖ


దరఖాస్తుల దాఖలుకు ఆఖరి తేదీ డిసెంబరు 31, 2024

తొమ్మిది శ్రేణులలో పురస్కారాలను ప్రదానం చేస్తారు

Posted On: 24 OCT 2024 12:27PM by PIB Hyderabad

జాతీయ జల పురస్కారాలు (ఎన్‌డబ్ల్యుఏ)2024 సంబంధిత ప్రక్రియ ను జల్ శక్తి శాఖ లోని జల వనరులునదుల వికాసంఇంకా గంగా నది శుద్ధి విభాగం (డీవోడబ్ల్యుఆర్ఆర్‌డీ & జీఆర్) రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌ లో మొదలు పెట్టింది.  ఈ పురస్కారాలలో పాల్గొనడానికి దరఖాస్తులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (www.awards.gov.in) ద్వారా మాత్రమే స్వీకరించనున్నారు.  ఈ పురస్కారాలను గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రజలు ఈ పోర్టల్‌ను గానిలేదా ఈ విభాగం తాలూకు వెబ్ సైట్ (www.jalshakti-dowr.gov.inను గాని సందర్శించవచ్చు.  దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఈ ఏడాది డిసెంబరు 31.

 

 

పురస్కారాలకు అర్హత ఇదీ:

 

జల సంరక్షణకుజల నిర్వహణకు సంబంధించిన రంగంలో మార్గదర్శకప్రాయ కార్యాలను అమలుపరచే ఏ రాష్ట్రం అయినా, లేదా ఏ జిల్లా అయినాఏ గ్రామ పంచాయతీ అయినాఏ పట్టణ ప్రాంత స్థానిక సంస్థ అయినాఏ పాఠశాల లేదా ఏ కళాశాల అయినా  సంస్థ (పాఠశాల/కళాశాల కాకుండా ఇతరేతర  సంస్థ) అయినాఏ పరిశ్రమ అయినాఏ పౌర సంఘం అయినా గాని లేదా ఏ జల వినియోగదారు సంఘం అయినా గాని దరఖాస్తును దాఖలు చేయడానికి అర్హత కలిగినవే.

 

 

ట్రాఫిప్రశంసపత్రం:

ఉత్తమ రాష్ట్రం’, ‘ఉత్తమ జిల్లా’ శ్రేణులలో విజేతలుగా నిలిస్తే ఒక ట్రాఫితోనుప్రశంస పత్రంతో సత్కరించనున్నారు.  మిగతా శ్రేణులైన  ‘ఉత్తమ గ్రామ పంచాయతీ’, ‘ఉత్తమ పట్టణ ప్రాంత స్థానిక సంస్థ’, ‘ఉత్తమ పాఠశాల/కళాశాల’, ‘ఉత్తమ సంస్థ (పాఠశాల/కళాశాల కాకుండా ఇతరేతర సంస్థ), ‘ఉత్తమ పరిశ్రమ’, ‘ఉత్తమ పౌర సంఘం’, ఇంకా ‘ఉత్తమ జల వినియోగదారు సంఘంల విజేతలను ట్రాఫిప్రశంస పత్రంతోనే కాకుండా నగదు బహుమతితో కూడా సత్కరించనున్నారు.  ఒకటో స్థానంలో నిలిచిన విజేతలకు రూ. 2 లక్షలురెండో స్థానంలో నిలిచిన విజేతలకు రూ. 1.5 లక్షలుమూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ. ఒక లక్ష నగదు బహుమతులను ఇవ్వనున్నారు.

 

 

ఎంపికకు అనుసరించే ప్రక్రియ:

జాతీయ జల పురస్కారాల కోసం అందిన అన్ని దరఖాస్తులను జల్ శక్తి మంత్రిత్వ శాఖలోని జల వనరులునదుల వికాసంఇంకా గంగా నది శుద్ధి విభాగం (డీవోడబ్ల్యుఆర్ఆర్‌డీ & జీఆర్)కు చెందిన పరిశీలక సంఘం పరిశీలిస్తుంది.  బహుమతుల కోసం తాత్కాలికంగా ఎంపిక చేసిన దరఖాస్తులను విశ్రాంత కార్యదర్శి స్థాయి అధికారి నాయకత్వం వహించే ఒక న్యాయ సభ్య సంఘానికి సమర్పిస్తారు.  ఆ తరువాత  జల వనరులునదుల వికాసంఇంకా గంగా శుద్ధి విభాగం (డీవోడబ్ల్యుఆర్ఆర్‌డీ & జీఆర్) లోని  సంస్థలు.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కేంద్ర భూగర్భ జల మండలి (సీజీడబ్ల్యూబీ)లు క్షేత్ర స్థాయిలో ఆ దరఖాస్తు వివరాల వాస్తవికతను సరిచూస్తాయి.  ఈ అంచె ముగిసిన తరువాత అవి ఇచ్చే నివేదికల ఆధారంగా దరఖాస్తులను జ్యూరీ కమిటీ మదింపు చేసివిజేతల పేరులను సిఫారసు చేస్తుంది.  కమిటీ సిఫారసులను ఆమోదం కోసం కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రికి సమర్పిస్తారు.  విజేతలను తగిన తేదీన ప్రకటిస్తారు. తదనంతరం పురస్కారాల వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పురస్కారాలను విజేతలకు రాష్ట్రపతి చేతుల మీదుగా గాని లేదా ఉప రాష్ట్రపతి చేతుల మీదుగా గాని అందజేయనున్నారు.

పురస్కారాల వివరాలు ఇవీ:

 

వరుస సంఖ్య

పురస్కారం శ్రేణి

అర్హత కలిగిన సంస్థ

పురస్కారం

పురస్కారాల సంఖ్య/నగదు బహుమతి

1.

 

ఉత్తమ రాష్ట్రం

 

రాష్ట్ర ప్రభుత్వంకేంద్ర పాలిత ప్రాంతం

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

2.

ఉత్తమ జిల్లా

జిల్లా పరిపాలన యంత్రాంగం/

డీఎమ్/డీసీ

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 (ఉత్తరదక్షిణపశ్చిమతూర్పు, ఈశాన్య ప్రాంతాలు అనే అయిదు జోన్‌ల నుండి ఒక్కో పురస్కారం)

3.

ఉత్తమ గ్రామ పంచాయతీ

గ్రామ పంచాయతీ

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

4.

ఉత్తమ పట్టణ ప్రాంత స్థానిక సంస్థ

పట్టణ ప్రాంత స్థానిక సంస్థ

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

5.

ఉత్తమ పాఠశాల లేదా కళాశాల

పాఠశాల/కళాశాల

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

6.

ఉత్తమ సంస్థ

(పాఠశాల/కళాశాల కాకుండా ఇతరేతర సంస్థలు)

సంస్థలు/ఆర్‌ డబ్ల్యూఏ లుధార్మిక సంస్థలు

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

3       పురస్కారాలు

(i) సంస్థలకు 2 అవార్డులు  (ప్రథమ పురస్కారంరూ. 2 లక్షలుద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు)

(ii) క్యాంపస్ కాకుండా ఇతర సంస్థలకు ఒక అవార్డు (పురస్కారంరూ. లక్షలు)

7.

ఉత్తమ పరిశ్రమ

చిన్న/మధ్యతరహా/భారీ పరిశ్రమ

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

8.

ఉత్తమ పౌర సంఘం

నమోదు పూర్తి అయిన ఎన్‌ జీవోలు పౌర సంఘాలు

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

9.

ఉత్తమ జల వినియోగదారు సంఘం

జల వినియోగదారు సంఘాలు

నగదు పురస్కారాలు &

ట్రాఫి తో పాటు ప్రశంస పత్రం

పురస్కారాలు

 

ప్రథమ పురస్కారం:    రూ. 2 లక్షలు

ద్వితీయ పురస్కారంరూ. 1.5 లక్షలు

తృతీయ పురస్కారం:    రూ. ఒక లక్ష

 

 

జల సమృద్ధ భారతదేశాన్ని ఆవిష్కరించాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేయడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాలుజిల్లాలువ్యక్తులు, సంస్థలు తదితర వర్గాలు చేస్తున్న మార్గదర్శకప్రాయ కార్యాలను గుర్తించిమరి వాటిని ప్రోత్సహించడానికి జాతీయ జల పురస్కారాలు (ఎన్‌డబ్ల్యూఏ)ను ప్రవేశపెట్టారు.  నీటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రజలకు అవగాహనను కలిగించడంతో పాటు నీటి వినియోగంలో అత్యుత్తమ పద్ధతులను వారు అనుసరించేటట్లుగా వారికి ప్రేరణను ఇవ్వాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.  వివిధ శ్రేణులలో పురస్కారాలను గెలుచుకొన్నవారికి ఒక ప్రశంసపత్రాన్నిట్రాఫిని, నగదు బహుమతిని ఇవ్వనున్నారు.  నీటి లభ్యతలో భూగర్భ జల భూమికకు తోడు భూమి మీది జలం  పాత్ర ప్రముఖమైంది కావడం తోదేశంలో జల వనరుల నిర్వహణ దిశలో ఒక సమగ్ర దృక్పథాన్ని అనుసరించేటట్లుగా సంబంధిత వర్గాలను ప్రోత్సహించాలన్నది జాతీయ జల పురస్కారాల లక్ష్యంగా ఉంది.  ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో జాతీయ జల పురస్కారాల ప్రథమ సంచికను జల వనరులునదుల వికాసంఇంకా గంగా నది శుద్ధి విభాగం 2018లో పరిచయం చేసింది.  ఒకటో జాతీయ జల పురస్కారాలు2018లో భాగంగా 14 శ్రేణులలో 82 విజేతలకు పురస్కారాలను ఇచ్చారు.  రెండో జాతీయ జల పురస్కారాలు2019లో భాగంగా 16 కేటగిరీలలో 98 విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు.  మూడో జాతీయ జల పురస్కారాలు2020లో 11 కేటగిరీలలో 57 విజేతలకు పురస్కారాలను అందజేశారు.  నాలుగో జాతీయ జల పురస్కారాలు2022లో 11 శ్రేణులలో 41 విజేతలకు పురస్కారాలను ఇచ్చారు.  అయిదో జాతీయ జల పురస్కారాలు2023లో భాగంగా 9 శ్రేణులలో 38 విజేతలకు పురస్కారాలను ఇచ్చారు.  కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2021వ సంవత్సరానికి  జాతీయ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించ లేదు.

 

***




(Release ID: 2068305) Visitor Counter : 16