సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
55వ ఐఎఫ్ఎఫ్ఐ: ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్న చిత్రాల జాబితా ప్రకటన
ఇండియన్ పనోరమాలో ప్రదర్శించే ప్రారంభ చలన చిత్రంగా ఎంపికైన ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’
ప్రారంభ నాన్-ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైన లదాఖీ భాషా చిత్రం ‘ఘర్ జైసా కుచ్’
ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్న 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌లు
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా - ఐఎఫ్ఎఫ్ఐ 55వ ఎడిషన్‌లో ప్రదర్శించనున్న 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల జాబితాను ఐఎఫ్ఎఫ్ఏ ప్రధాన విభాగం అయిన ఇండియన్ పనోరమా ప్రకటించింది. 384 సమకాలీన భారతీయ చలనచిత్రాల నుంచి ప్రధాన స్రవంతికి చెందిన 5 చిత్రాలు సహా మొత్తం 25 చలన చిత్రాలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. శ్రీ రణదీప్ హుడా దర్శకత్వం వహించిన “స్వాతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ)” చిత్రాన్ని ఇండియన్ పనోరమా 2024 ప్రారంభ చిత్రంగా జ్యూరీ ఎంపిక చేసింది.
అదనంగా, 262 చిత్రాల జాబితా నుంచి ఎంపిక చేసిన 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను కూడా ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్నారు. ప్రదర్శనకు ఎంపికైన ఈ నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు సమకాలీన భారతీయ విలువలను డాక్యుమెంట్ చేయడం, పరిశోధించడం, వినోదించడం, ప్రతిబింబించడంలో వర్ధమాన, పేరొందిన ఫిల్మ్‌మేకర్స్ ప్రతిభను చాటనున్నాయి. నాన్-ఫీచర్ కేటగిరీలో ప్రారంభ చిత్రంగా శ్రీ హర్ష్ సంగాని దర్శకత్వం వహించిన 'ఘర్ జైసా కుచ్ (లదాఖీ)'ని జ్యూరీ ఎంపిక చేసింది.
ప్రముఖ సినీ దర్శకులు, నటులు, సినీ రచయిత డాక్టర్ చంద్ర ప్రకాశ్ ద్వివేది ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రముఖ చిత్రాలకు పనిచేసినవారు, ప్రసిద్ధ సినీరంగ నిపుణులు సహా భారతీయ చలనచిత్ర రంగంలోని వివిధ విభాగాలకు చెందిన 12 మంది ప్రముఖులు ఈ ఫీచర్ ఫిలిం జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు.
ఇండియన్ పనోరమా చలచిత్రాల జ్యూరీ సభ్యులు:
1. శ్రీ మనోజ్ జోషి, నటులు
2. శ్రీమతి సుస్మిత ముఖర్జీ, నటి
3. శ్రీ హిమాన్షు శేఖర్ ఖతువా, సినీ దర్శకులు
4. శ్రీ ఓయినమ్ గౌతమ్ సింగ్, సినీ దర్శకులు
5. శ్రీ అషు త్రిఖా, సినీ దర్శకులు
6. శ్రీ ఎస్. ఎమ్. పాటిల్, సినీ దర్శకులు, రచయిత
7. శ్రీ నీలాభ్ కౌల్, సినీమాటోగ్రాఫర్, సినీ దర్శకులు
8. శ్రీ సుశాంత్ మిశ్రా, సినీ దర్శకులు
9. శ్రీ అరుణ్ కుమార్ బోస్, ప్రసాద్ ఇనిస్టిట్యూట్ మాజీ హెచ్ఓడీ, సౌండ్ ఇంజినీర్
10. శ్రీమతి రత్నోత్తమ సేన్‌గుప్తా, రచయిత్రి, ఎడిటర్
11. శ్రీ సమీర్ హంచాటే, సినీ దర్శకులు
12.శ్రీమతి ప్రియా కృష్ణస్వామి, సినీ దర్శకురాలు
The 25 Feature Films selected in Indian Panorama 2024:
Sr. No.
|
Title of the Film
|
Language
|
Director
|
- 1
|
SWATANTRYA VEER SAVARKAR
|
Hindi
|
Randeep Hooda
|
-
|
KEREBETE
|
Kannada
|
Gururaj B
|
-
|
VENKYA
|
Kannada
|
Sagar Puranik
|
-
|
JUIPHOOL
|
Assamese
|
Jadumoni Dutta
|
-
|
MAHAVATAR NARSIMHA
|
Hindi
|
Ashwin Kumar
|
-
|
JIGARTHANDA DOUBLE X
|
Tamil
|
Karthik Subbaraj
|
-
|
AADUJEEVITHAM
(VIAȚA CAPREI, THE GOATLIFE)
|
Malayalam
|
Blessy
|
-
|
ARTICLE 370
|
Hindi
|
Aditya Suhas Jambhale
|
-
|
GYPSY
|
Marathi
|
Shashi Chandrakant Khandare
|
-
|
SRIKANTH
|
Hindi
|
Tushar Hiranandani
|
-
|
AAMAR BOSS
|
Bengali
|
Nandita Roy,
Shiboprosad Mukherjee
|
-
|
BRAMAYUGAM
|
Malayalam
|
Rahul Sadasivan
|
-
|
35 CHINNA KATHA KAADU
|
Telugu
|
Nanda Kishore Emani
|
-
|
RADOR PAKHI
|
Assamese
|
Dr. Bobby Sarma Baruah
|
-
|
GHARAT GANPATI
|
Marathi
|
Navjyot Narendra Bandiwadekar
|
-
|
RAAVSAAHEB
|
Marathi
|
Nikhil Mahajan
|
-
|
LEVEL CROSS
|
Malayalam
|
Arfaz Ayub
|
-
|
KARKEN
|
Galo
|
Nending Loder
|
-
|
BHOOTPORI
|
Bengali
|
Soukarya Ghosal
|
-
|
ONKO KI KOTHIN
|
Bengali
|
Saurav Palodhi
|
Mainstream Cinema Section:
Sr. No.
|
Title Of The Film
|
Language
|
Director
|
- 1
|
KARKHANU
|
Gujarati
|
Rushabh Thanki
|
-
|
12TH FAIL
|
Hindi
|
Vidhu Vinod Chopra
|
-
|
MANJUMMEL BOYS
|
Malayalam
|
Chidamabram
|
-
|
SWARGARATH
|
Assamese
|
Rajesh Bhuyan
|
-
|
KALKI 2898 AD (3D)
|
Telugu
|
Singireddy Nagaaswin
|
ఆరుగురు సభ్యులు గల నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రముఖ డాక్యుమెంటరీ, వన్యప్రాణుల చిత్రాల దర్శకులు, వి. శాంతారామ్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత అయిన శ్రీ సుబ్బయ్య నల్లముత్తు అధ్యక్షులుగా ఉన్నారు.
ఇండియన్ పనోరమా నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ సభ్యులు:
1. శ్రీ రజనీకాంత్ ఆచార్య, నిర్మాత, సినీ దర్శకులు
2. శ్రీ రోనెల్ హోబమ్, సినీ దర్శకులు
3. శ్రీమతి ఉషా దేశ్‌పాండే, సినీ దర్శకురాలు, నిర్మాత
4. శ్రీమతి వందన కోహ్లి, సినీ దర్శకురాలు, రచయిత
5. శ్రీ మిథున్‌చంద్ర చౌదరి, సినీ దర్శకులు
6. శ్రీమతి షాలిని షా, సినీ దర్శకులు
The 20 Non Feature Films selected in Indian Panorama 2024:
S. No.
|
Title of the film
|
Language
|
Director(s) Name
|
-
|
6-A AKASH GANGA
|
Hindi
|
Nirmal Chander
|
-
|
AMAR AAJ MAREGA
|
Hindi
|
Rajat Kariya
|
-
|
AMMA'S PRIDE
|
Tamil
|
Shiva Krish
|
-
|
BAHI - TRACING MY ANCESTORS
|
Hindi
|
Rachita Gorowala
|
-
|
BALLAD OF THE MOUNTAIN
|
Hindi
|
Tarun Jain
|
-
|
BATTO KA BULBULA
|
Haryanvi
|
Akshay Bhardwaj
|
-
|
CHANCHISOA
|
Garo
|
Elvachisa Ch Sangma,
Dipankar Das
|
-
|
FLANDERS DI ZAMEEN VICH
|
Punjabi
|
Sachin
|
-
|
GHAR JAISA KUCH
|
Ladakhi
|
Harsh Sangani
|
-
|
GHODE KI SAWARI
|
Hindi
|
Debjani Mukherjee
|
-
|
GOOGLE MATRIMONY
|
English
|
Abhinav Athrey
|
-
|
MAIN NIDA
|
Hindi
|
Atul Pandey
|
-
|
MO BOU, MO GAAN
|
Oriya
|
Subash Sahoo
|
-
|
MONIHARA
|
Bengali
|
Subhadeep Biswas
|
-
|
P FOR PAPARAZZI
|
Hindi
|
Divya Kharnare
|
-
|
PILLARS OF PROGRESS: THE EPIC STORY OF DELHI METRO
|
English
|
Satish Pande
|
-
|
PRAAN PRATISHTHA
|
Marathi
|
Pankaj Sonawane
|
-
|
ROTI KOON BANASI?
|
Rajasthani
|
Chandan Singh
|
-
|
SAAVAT
|
Konkani
|
Shivam Harmalkar,
Santosh Shetkar
|
-
|
SIVANTHA MANN
|
Tamil
|
Infant
|
ఇండియన్ పనోరమా గురించి మరింత సమాచారం:
భారతీయ చిత్రాలతో పాటు దేశ ఘన సంస్కృతి, వారసత్వాన్ని చిత్ర కళ ద్వారా ప్రోత్సహించడానికి 1978లో ఐఎఫ్ఎఫ్ఐలో భాగంగా ఇండియన్ పనోరమాను ప్రారంభించారు. ఇండియన్ పనోరమా ప్రారంభమైనప్పటి నుండి ప్రతియేటా ఆ సంవత్సరంలోని అత్యుత్తమ భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తోంది. చలనచిత్ర కళను ప్రోత్సహించే లక్ష్యంతో ఇండియన్ పనోరమా విభాగానికి ఎంపిక చేసిన చలనచిత్రాలను, దేశ విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో, ద్వైపాక్షిక సాంస్కృతిక వినిమయ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే భారతీయ చలనచిత్ర వారోత్సవాల్లో, సాంస్కృతిక వినిమయ ప్రోటోకాల్స్ వెలుపల ప్రత్యేక భారతీయ చలనచిత్రోత్సవాల్లో, భారత్‌లో నిర్వహించే ప్రత్యేక ఇండియన్ పనోరమా ఉత్సవాల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రదర్శిస్తారు.
చలనచిత్రాల ఎంపిక కమిటీలో దేశవ్యాప్త సినీ ప్రముఖులు ఉంటారు. ఫీచర్ ఫిల్మ్‌ల కోసం మొత్తం పన్నెండు మంది జ్యూరీలు, నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల కోసం ఆరుగురు జ్యూరీలు తమ సంబంధిత జ్యూరీ అధ్యక్షుల నేతృత్వంలో 55వ ఐఎఫ్ఎఫ్ఐ కోసం ఇండియన్ పనోరమా చిత్రాలను ఎంపిక చేశారు. ఫీచర్, నాన్-ఫీచర్ కేటగిరీలు రెండింటికీ చెందిన విశిష్ట జ్యూరీ వారి వ్యక్తిగత నైపుణ్యాన్ని ఉపయోగించి ఏకాభిప్రాయం ద్వారా చిత్రాలను ఎంపిక చేసింది.
చలనచిత్ర కళను ప్రోత్సహించడానికి సూచించిన నియమాలు, షరతులు, విధానాలకు అనుగుణంగా సినిమా, నేపథ్య, సౌందర్య శ్రేష్ఠత గల ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపిక చేయడం ఇండియన్ పనోరమా ప్రాథమిక లక్ష్యం.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, గోవా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఐఎఫ్ఎఫ్ఐని గోవాలోని పనాజీలో నవంబర్ 20 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనుంది.
***
(Release ID: 2067936)
Visitor Counter : 83
Read this release in:
Odia
,
Marathi
,
English
,
Hindi
,
Konkani
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Khasi