హోం మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో రెండేళ్లపాటు సర్ధార్ పటేల్ 150వ జయంతి
ఆయన సేవలకు గుర్తింపుగా 2024 నుంచి 2026 వరకు దేశవ్యాప్త సంబరాలు
సర్ధార్ పటేల్ సాధించిన విజయాలకూ, ప్రతిష్ఠించిన ఏకతా స్ఫూర్తికీ ధీటుగా సంబరాలు: హోం శాఖా మంత్రి శ్రీ అమిత్ షా
ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో తిరుగులేని శక్తిగా భారతదేశాన్ని
ఏర్పాటు చేయడంలో ఆయన అందించిన మార్గదర్శకత్వం ఎప్పటికీ కొనసాగుతుంది...
కాశ్మీర్ నుంచి లక్షద్వీప్ వరకూ దేశాన్ని ఐక్యం చేయడంలో చెరిగిపోని ముద్ర
Posted On:
23 OCT 2024 3:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం 2024 నుంచి 2026 వరకు.. రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించి సర్దార్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోనుంది. ఈ సంగతిని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రకటించారు.
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక ప్రచార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఈ కింది విధంగా ఒక పోస్టును పెడుతూ... ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
‘‘ప్రపంచంలో అత్యంత దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థలలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావం వెనుక ఉన్న దార్శనికునిగా సర్దార్ పటేల్ జీ వారసత్వం శాశ్వతమైంది. కాశ్మీర్ మొదలుకొని లక్షద్వీప్ వరకు భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ పటేల్ గారు పోషించిన ప్రధాన పాత్ర చెరిపి వేయడానికి వీలు లేనటువంటిది. అది కలకాలం నిలిచిపోతుంది. ఆయన సుప్రతిష్ఠిత తోడ్పాటులను సమాదరించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం సర్దార్ పటేల్ 150వ జయంతిని స్మరించుకొంటూ.. 2024 నుంచి 2026 వరకు రెండు సంవత్సరాల పాటు దేశమంతటా ఉత్సవాన్ని నిర్వహించనుంది. ఈ ఉత్సవం సర్దార్ పటేల్ జీ ప్రశంసనీయ కార్యసాధనలతో పాటు ఆయన ప్రతీకగా నిలిచినటువంటి ఏకతా స్ఫూర్తికి నిదర్శనంగా ఉంటుంది’’
(Release ID: 2067363)
Visitor Counter : 70
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam