ప్రధాన మంత్రి కార్యాలయం
థాయిలాండ్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
Posted On:
11 OCT 2024 12:41PM by PIB Hyderabad
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియాంటియాన్‌లో ఈరోజు థాయ్‌లాండ్ ప్రధాని శ్రీమతి పేటోంగ్‌టర్న్ చినావత్రాతో సమావేశమయ్యారు. ఈ ఇరువురు ప్రధాన మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి.
థాయ్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చరిత్రాత్మకంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా శ్రీ నరేంద్ర మోదీకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నేతలు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. వారు ఉప-ప్రాంతీయ, ప్రాంతీయ, బహుపాక్షిక వేదికల్లో సన్నిహిత సహకారాన్ని పెంపొందించే మార్గాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో బీఐఎమ్ఎస్‌టీఈసీ ద్వారా ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి ఇరువురు ప్రధానులు చర్చించారు.
ఈ ఏడాది దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న భారతదేశ 'యాక్ట్ ఈస్ట్' విధానం కోసం, ఇండో-పసిఫిక్ విషయంలో భారత దార్శనికత కోసం థాయ్‌లాండ్‌తో భారత్ చేసుకునే ఒప్పందాలు కీలకమైనవి.
(Release ID: 2064142)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam