ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన... ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 09 OCT 2024 3:36PM by PIB Hyderabad

నమస్కారం!

హారాష్ట్ర గవర్నర్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ షిండేకేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు సహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్శ్రీ అజిత్ పవార్ఇతర ప్రముఖులునా ప్రియ సోదర సోదరీమణులారా...

ముందుగా శివభక్తులైన మహారాష్ట్ర సోదర సోదరీమణులందరికీ నా శుభాభినందనలు.

   మహారాష్ట్రకు ఈ రోజున 10 కొత్త వైద్య కళాశాలల కానుక లభించిందిఅలాగే రెండు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులునాగ్‌పూర్ విమానాశ్రయ ఆధునికీకరణ-విస్తరణసహా షిర్డీ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాంఈ అభివృద్ధి కార్యక్రమాలకు గాను రాష్ట్ర ప్రజలకు నా అభినందనలుగత వారమే థానేముంబయి నగరాల్లో నేను పర్యటించానుఆ సందర్భంగా మెట్రో లైన్ ప్రాజెక్టుతోపాటు రూ.30,000 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించే అవకాశం నాకు దక్కిందిఅంతకుముందు వివిధ జిల్లాల్లో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించానుఅనేక నగరాల్లో మెట్రో విస్తరణ కొనసాగుతోందికొన్ని విమానాశ్రయాల ఆధునికీకరణ పనులు సాగుతుండగారహదారులుహైవే ప్రాజెక్టులు వేగంగా పురోగమిస్తున్నాయిమౌలిక సదుపాయాలుసౌరశక్తిజౌళి పార్కుల సంబంధిత ప్రాజెక్టులు ప్రారంభించాంరైతులుపశుపోషకుల ప్రయోజనం దిశగా కొత్త కార్యక్రమాలు చేపట్టాంమహారాష్ట్రలో దేశంలోనే అతిపెద్ద కంటైనర్ రేవు వడవాన్ పోర్టుకు శంకుస్థాపన చేశాంవివిధ రంగాల్లో ఇంత వేగంతోఇంత భారీగా ప్రగతి కార్యక్రమాలు కొనసాగడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేదుకాంగ్రెస్ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి రాజ్యమేలిందన్నది వేరే విషయం.

సోదర సోదరీమణులారా!

   కొద్ది రోజుల కిందటే ‘మరాఠీ’కి ప్రాచీన భాష హోదా కల్పించాంఒక భాషకు సముచిత గౌరవం లభిస్తేఅది ఆ భాషకు మాత్రమేగాక ఆ తరానికంతటికీ గళమిచ్చినట్లు కాగలదుఈ గుర్తింపుతో కోట్లాది మరాఠీ సోదరుల స్వప్నం సాకారమైందిరాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సంబరాలు చేసుకున్నారుమరోవైపు మరాఠీని ప్రాచీన భాషగా ప్రకటించడంపై అనేక గ్రామాల ప్రజల నుంచి హర్షామోదాలతో నాకు కృతజ్ఞతా సందేశాలు వెల్లువలా వస్తున్నాయిఅయితేఇది కేవలం నా ఒక్కడి ఘనత కాదు... ఇదంతా మీ ఆశీస్సులతోనే సాధ్యమైందిఛత్రపతి శివాజీ మహారాజ్బాబా సాహెబ్ అంబేద్కర్జ్యోతిబా ఫూలేసావిత్రీబాయి ఫూలే వంటి మహనీయుల దీవెనలతోనే మహారాష్ట్రలో ప్రగతి సంకల్పం నెరవేరుతోంది.

మిత్రులారా!

   హర్యానాజమ్ముకశ్మీర్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు నిన్ననే వెలువడ్డాయిహర్యానా ఓటర్లు తమ మనోభావన ఏమిటో దేశానికి ప్రస్ఫుటం చేశారుఒక ప్రభుత్వం వరుసగా రెండుసార్లు పదవీకాలం పూర్తిచేయడంమూడోసారి విజయం సాధించడం చరిత్రాత్మకంకాంగ్రెస్ పార్టీదాని అనుబంధ విభాగాలు సహా పట్టణ నక్సలైట్ల సమూహం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎంతో ప్రయత్నించిందికానీఆ కుట్రలన్నింటినీ ప్రజలు దీటుగా తిప్పికొట్టారుదళితుల విషయంలో అసత్యాల వ్యాప్తికి వాళ్లు ఎన్నో కుయుక్తులు పన్నారుఅయినావారి ప్రమాదకర ఆలోచనలను దళిత సమాజం పసిగట్టిందితమ రిజర్వేషన్లను హరించిఇతరులకు కేటాయించడం ద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలనే కాంగ్రెస్ కుట్రను వారు గ్రహించారుఈ నేపథ్యంలో హర్యానాలోని దళిత సమాజం బీజేపీ అభ్యర్థులకు రికార్డు స్థాయిలో అండగా నిలిచిందిఅలాగే మా అభివృద్ధి కార్యక్రమాలను గుర్తిస్తూ ‘ఒబిసి’ వర్గం కూడా మా వెంటనే నడిచిందిరైతులను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినాతమ పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చిందెవరో వారు గుర్తించారుఅలాగే బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై హర్యానా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారుమరోవైపు యువతను తప్పుదారిలోకి మళ్లించాలని కాంగ్రెస్ శతవిధాలా యత్నించిందికానీతమ ఉజ్వల భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర యువతరంమహిళలుకుమార్తెలు,  విశ్వసించారుమొత్తం మీద ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నమంటూ లేదుఅయినప్పటికీ ఆ వ్యూహాలన్నిటినీ తిప్పికొడుతూ ఇకపై కాంగ్రెస్అర్బన్ నక్సలైట్ల కుట్రలకు తాము బలి కాబోమని హర్యానా ప్రజలు తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు.

మిత్రులారా!

   ‘విభజించి పాలించు’ అన్నదే కాంగ్రెస్ సదా అనుసరించే సూత్రంఆ పార్టీ తన బాధ్యతారాహిత్యాన్ని పలుమార్లు రుజువు చేసుకుందిదేశాన్ని చీల్చేందుకు కొత్త కథలు అల్లుతూనే ఉందిఓటర్లను తప్పుదోవ పట్టించే కుయుక్తులను ఎన్నడూ మానదువారి సిద్ధాంతం చాలా స్పష్టం... ముస్లింలను ఎప్పుడూ భయాందోళనల్లో ఉంచడంవారిని ఓటు బ్యాంకుగా మార్చుకోవడం-బలోపేతం చేసుకోవడమే వారి విధానంముస్లింలలో కుల విభేదాల గురించి కాంగ్రెస్‌ నేతలెవరూ నోరెత్తరుఆ ప్రస్తావన రాగానే మౌనవ్రతం పూనుతారుఅయితేహిందూ సమాజంపై చర్చలో మాత్రమే మేమూ ఉన్నామంటూ కులాల ప్రస్తావనతో ముసుగులు తొలగించి బయటకొస్తారుహిందువుల్లో ఒక కులాన్ని మరో కులానికి పోటీగా నిలపాలన్నది కాంగ్రెస్ వ్యూహంహిందువులు ఎంతగా చీలిపోతే తమకు అంత ప్రయోజనమని వారు భావిస్తారుఏతావాతా రాజకీయ లబ్ధి కోసం హిందూ సమాజాన్ని అయోమయంలో పడేయాలన్నది ఆ పార్టీ వ్యూహందేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఇదే వారి పద్ధతితమ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా సమాజంలో విద్వేష వ్యాప్తికి అన్ని మాయోపాయాలనూ ప్రయోగిస్తుందికులమత ప్రాతిపదిక రాజకీయాల్లో కాంగ్రెస్ తలమునకలుగా ఉందిఎన్నికల్లో విజయం కోసం హిందూ సమాజ విభజనే కాంగ్రెస్ రాజకీయాలకు పునాదిగా మారింది. ‘సర్వజన హితాయ... సర్వజన సుఖాయ’ (అందరి హితం.. అందరి సుఖంఅనే ఆదర్శాన్నిసనాతన సంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందిఎన్నో ఏళ్లపాటు దేశాన్నేలిన ఆ పార్టీ ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలనే తపనతో రోజుకో విద్వేష రాజకీయ కుట్ర చేస్తోందిసీనియర్ నాయకులు కూడా తమ పార్టీ పరిస్థితి చూసి నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారుకాంగ్రెస్ పార్టీ ద్వేషానికి అతిపెద్ద కర్మాగారంలా తయారైందిఈ పరిస్థితిని మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే గ్రహించారుఅందుకే కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆయన ప్రతిపాదించారుఆ పార్టీ రద్దు కాలేదుగానీనేడు దేశాన్ని నాశనం చేయడానికి వెనుకడటం లేదుఅందువల్ల మనమంతా  మరింత జాగరూకతతోఅప్రమత్తంగా మెలగాలి.

మిత్రులారా!

   సమాజ విచ్ఛిన్నం దిశగా కాంగ్రెస్ కుయుక్తులను మహారాష్ట్ర ప్రజలు తిప్పికొట్టగలరని నేను దృఢంగా విశ్వసిస్తున్నానుదేశ ప్రగతికి అగ్ర ప్రాధాన్యంతో మహారాష్ట్ర ఒక్కతాటిపై నిలిచి బీజేపీకిమహాయుతి కూటమికి ఓటు వేయాలని పిలుపునిస్తున్నానుహర్యానాలో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలు అంతకన్నా భారీ విజయం ప్రసాదించాలని ప్రజలను అభ్యర్థించారు.

మిత్రులారా!

   దేశాభివృద్ధికి అవిరళ కృషిలో భాగంగా గ‌డచిన పదేళ్లలో ప్ర‌భుత్వం అత్యాధునిక మౌలిక స‌దుపాయాల‌ కల్పన ‘మ‌హా యజ్ఞం’ ప్రారంభించిందిమేమివాళ కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన ఒక్కటే కాదు... ఆరోగ్యకరసుసంపన్న మహారాష్ట్రకూ పునాది వేస్తున్నాంనేడు ఒకేసారి 10 వైద్య కళాశాలలను ప్రారంభించడమంటే కేవలం కొత్త విద్యా సంస్థల ఏర్పాటుకు పరిమితం కాదులక్షలాది ప్రజల జీవితాలు మెరుగుపరచే మరో ‘మహా యజ్ఞం.’ ఈ మేరకు థానేఅంబర్‌నాథ్ముంబయినాసిక్జల్నాబుల్దానాహింగోలివాషిమ్అమరావతిభంక్‌దారాగడ్చిరోలి జిల్లాల్లో ఈ వైద్య కళాశాలలు ఆయా జిల్లాలతోపాటు పరిసర ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు సేవా కేంద్రాలుగా మారుతాయన్నారురాష్ట్రంలో వైద్య విద్యకు నేడు 6,000 సీట్లు అందుబాటులో ఉండగా ఈ కళాశాలలతో అదనంగా 900 సీట్లు వస్తాయివైద్య విద్యలో 75,000 సీట్లను అదనంగా చేర్చాలన్న దేశ సంకల్పం నెరవేరడంలో నేటి కార్యక్రమం ఓ కీలక ముందడుగు.

మిత్రులారా!

   వైద్య విద్యాభ్యాసాన్ని విద్యార్థులకు మరింత చేరువ చేశాంమహారాష్ట్ర యువతకు దీంతో కొత్త అవకాశాలు అందివచ్చాయిపేదమధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు కావాలన్నదే ప్రభుత్వ ప్రాథమ్యంఆ మేరకు వారి కలలు సాకారం కావాలిఇటువంటి విశిష్ట విద్యకు ఒకనాడు మాతృభాషలో పాఠ్య పుస్తకాలు లభ్యం కాకపోవడం పెద్ద సమస్యగా ఉండేదిరాష్ట్ర యువత ప్రయోజనాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఈ వివక్షకు స్వస్తి పలికిందిఇక మహారాష్ట్ర యువతరం తమ మాతృభాషలో వైద్య విద్యాభ్యాసం చేయగలదుతద్వారా వైద్యులు కావాలనే సంకల్పాన్ని వారు సాకారం చేసుకోగలుగుతారు.

మిత్రులారా!

   జనజీవనాన్ని సౌకర్యవంతం చేసేదిశగా ప్రభుత్వ కృషి పేదరిక నిర్మూలనలో గొప్ప ఉపకరణం అవుతుందిఅయితేమునుపట్లో కాంగ్రెస్ వంటి పార్టీలు పేదరికాన్ని తమ రాజకీయ ఇంధనంగా మార్చుకున్నాయిఅందుకే ప్రజలను పేదరికమనే అంధకారంలో ముంచేశాయికానీకేవలం ఒక దశాబ్దంలో మా ప్రభుత్వం 25 కోట్ల మంది ప్రజలను పేదరిక విముక్తులను చేసిందిదేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలలో ప్రగతిశీల మార్పు ఇందుకు దోహదం చేసిందిఈ రోజున ప్రతి నిరుపేదకూ ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ కార్డు చేతిలో ఉందిదీంతోపాటు 70 ఏళ్లు పైబడిన వృద్ధులకూ ఈ సదుపాయం వర్తింపజేశాంఇక జనౌషధి కేంద్రాల్లో అత్యవసర మందులు చాలా తక్కువ ధరకు... హృద్రోగులకు స్టెంట్లు వంటి పరికరాలు కూడా 80-85 శాతం తక్కువకే లభిస్తున్నాయిఅలాగే క్యాన్సర్ చికిత్సలో వాడే అత్యవసర మందుల ధరను కూడా ప్రభుత్వం తగ్గించిందిప్రభుత్వ వైద్య కళాశాలలుఆస్పత్రుల సంఖ్య పెరగడంవల్ల వైద్యం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చిందిదేశంలో మోదీ ప్రభుత్వం వల్ల నిరుపేదలందరికీ ఇప్పుడు బలమైన సామాజిక భద్రత లభించింది.

మిత్రులారా!

   యువతరంలో ఉట్టిపడే ఆత్మవిశ్వాసాన్ని బట్టిఏ దేశాన్నైనా ప్రపంచం విశ్వసిస్తుందిఆ మేరకు నేటి యువభారత్ జాతి భవిష్యత్ ప్రగతి ప్రణాళికను సరికొత్తగా రచిస్తోందివిద్యఆరోగ్య సంరక్షణసాఫ్ట్‌ వేర్ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలున్నాయిఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం భార‌త్‌ను విస్తృత మానవ వనరుల కూడలిగా పరిగణిస్తోందిఅందుకేప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం యువతను తీర్చిదిద్దుతున్నదిమహారాష్ట్రలో విద్యావ్యవస్థను ముందుకు నడిపే పర్యవేక్షణ కేంద్రంతోపాటు ముంబైలో ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ప్రారంభోత్స‌వం వంటివి ఈ రోజున నిర్వహించాంఈ సంస్థలో యువతకు భవిష్యత్ అవకాశాల ప్రాతిపదికన శిక్షణ లభిస్తుందిమార్కెట్ డిమాండుకు తగినట్లు యువ‌తరం ప్ర‌తిభ‌కు మెరుగులు దిద్దుతాంఅంతేకాకుండా నెలవారీ భృతితో అనుభవ శిక్షణ (ఇంటర్న్‌షిప్‌ఇప్పించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాంఇలాంటిది దేశ చరిత్రలోనే ప్రప్రథమదీనికింద వారికి రూ.5,000 దాకా భృతి అందుతుందిఈ కార్యక్రమంలో భాగస్వామ్యానికి వేలాది కంపెనీలు సంసిద్ధత తెలపడం హర్షణీయంతద్వారా యువత విలువైన అనుభవ శిక్షణతోపాటు కొత్త అవకాశాలకు గట్టి పునాది పడుతుంది.

సోదరసోదరీమణులారా!

   యువతరం కోసం భారత్ చేస్తున్న కృషి నిరంతర ఫలితాలిస్తోందిమన విద్యా సంస్థలు ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలకు దీటుగా నిలుస్తున్నాయినిన్ననే ప్రకటించిన ‘అంతర్జాతీయ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌’ ప్రకారం భార‌త్‌లో ఉన్నత విద్య-పరిశోధనల నాణ్యత పెరుగుతున్నదని స్పష్టమైంది.

మిత్రులారా!

   ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందిఈ నేపథ్యంలో యావత్ ప్రపంచం ఇప్పడు మనవైపు దృష్టి సారించిందిప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు నేడు భారత్ ప్రగతితో ముడిపడి ఉందిఒకనాడు నిర్లక్ష్యానికి గురైనవెనుకబడిన అనేక రంగాల్లో ఈ ఆర్థిక పురోగమనం అపార కొత్త అవకాశాలను కల్పించిందిపర్యాటక రంగం ఇందుకు ఒక నిదర్శనంలోగడ ఈ రంగంలో మహారాష్ట్ర ఎన్నో అవకాశాలను కోల్పోయిందిఈ రాష్ట్ర అమూల్య వారసత్వానికి నిలయంఅనేక సుందర ప్రదేశాలుఅధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలంవీటిని సద్వినియోగం చేసుకుని ఉంటేలక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుని ఉండేదికానీవాటికి సముచిత ప్రాధాన్యం లభించకఅటువంటి సువర్ణావకాశం దూరమైందిమునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలకు అటు ‘ప్రగతి’ఇటు ‘వారసత్వం’పైనా ఎలాంటి ఆసక్తి లేదుకానీమా ప్రభుత్వ హయాంలో ప్రగతి-వారసత్వాలకు సమ ప్రాధాన్యమిచ్చాంభారత సుసంపన్న గతం స్ఫూర్తితో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాంషిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనంనాగ్‌పూర్ విమానాశ్రయ ఆధునికీకరణ సహా మహారాష్ట్రలో అనేక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయిషిర్డీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ వల్ల సాయిబాబా భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందిదీనివల్ల దేశవిదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శకుల రాకకు వీలుంటుందికొద్ది రోజుల కిందటే ఆధునికీకరించిన షోలాపూర్ విమానాశ్రయాన్ని నేను ప్రారంభించానుసందర్శకులు ఒక ప్రదేశానికి వెళ్లినపుడుశని షింగనాపూర్తుల్జా భవానీ ఆలయంకైలాస్ టెంపుల్ వంటి సమీప అధ్యాత్మిక ప్రదేశాలను కూడా తిలకించాలని వారు ఆశించడం సహజంతద్వారా మహారాష్ట్ర పర్యాటక ఆర్థిక వ్యవస్థకు ఊపు లభించడమేగాక ప్రజలందరికీ ప్రత్యక్షపరోక్ష ఉపాధి అవకాశాలు కూడా అందివస్తాయి.

మిత్రులారా!

   మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంఅనుసరించే ప్రతి విధానం ‘వికసిత భారత్’ లక్ష్యానికే అంకితంపేదలురైతులుయువతమహిళల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయంఅందుకే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పేద గ్రామీణులుకూలీలురైతులకు అంకితం చేస్తున్నాందేశవిదేశాలకు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి నిమిత్తం షిర్డీ విమానాశ్రయంలో నిర్మించే ప్రత్యేక సరకుల ప్రాంగణం ఎంతగానో తోడ్పడుతుందిషిర్డీలాసల్‌గావ్అహల్యానగర్నాసిక్ ప్రాంతాల రైతులు ఈ ప్రాంగణం ద్వారా ఉల్లిద్రాక్షమునగజామదానిమ్మ వంటి ఉత్పత్తులను సులువుగా రవాణా చేయగలుగుతారుఈ విధంగా వారికి మరింత విస్తృత మార్కెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

సోదరసోదరీమణులారా!

   రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటున్నదిఈ దిశగా బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధర రద్దు చేశాంబాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం తొలగించాంఅంతేగాక ఉప్పుడు బియ్యంపై ఎగుమతి సుంకం సగానికి తగ్గించాంమహారాష్ట్ర రైతుల ఆదాయం పెంపు దిశగా ఉల్లిపై ఎగుమతి పన్నును కూడా ప్రభుత్వం సగానికి తగ్గించిందివంటనూనెల దిగుమతిపై 20 శాతం పన్ను విధించాలని మేము నిర్ణయించాంఅలాగే రిఫైన్డ్ సోయాబీన్పొద్దుతిరుగుడుపామాయిల్‌పై కస్టమ్స్ సుంకం గణనీయంగా పెంచాలని కూడా నిర్ణయించాంవీటన్నిటివల్ల కలిగే ప్రయోజనాలన్నీ దక్కేదెవరికి... మన రైతులకే కదాదీంతోపాటు జౌళి పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్ల  మహారాష్ట్రలోని రైతులు కూడా ఎంతో లబ్ధి పొందుతారు.

మిత్రులారా!

   మీరంతా సదా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశంఅధికారమే పరమావధిగా చహా-అఘాడి (కూటమిమహారాష్ట్రను బలహీనపరచాలని ప్రయత్నిస్తుంటేరాష్ట్రాన్ని మరింత శక్తిమంతం చేయాలని మహాయుతి సంకల్పించిందిఈ నేపథ్యంలో దేశ ప్రగతికి మరోసారి సారథ్యం వహించడానికి మహారాష్ట్ర సిద్ధం కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోందిఅందుకేనేటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిపైనా ఈ రాష్ట్ర ప్రజలకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు!

గమనికప్రధానమంత్రి ప్రసంగం హిందీలో సాగిందిదానికి ఇది తెలుగులో సామీప్య స్వేచ్ఛానువాదం.

 

***


(Release ID: 2064006) Visitor Counter : 37