హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో రేపు పీహెచ్ డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 119వ వార్షిక సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
వార్షిక సదస్సు ఇతివృత్తం 'వికసిత భారత్ @ 2047: ప్రగతి శిఖరం వైపు పయనం'
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం వైపు ముందుకు సాగుతున్న యావత్ దేశం
ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్
Posted On:
09 OCT 2024 4:54PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో పీహెచ్ డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ 119వ వార్షిక సదస్సులో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. 'వికసిత భారత్ @ 2047: ప్రగతి శిఖరం వైపు పయనించడం'ఇతివృత్తంతో వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.
2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం సాకారం అవుతోంది. యావత్ దేశం అంకితభావంతో ఆ దిశగా వేగంగా పయనిస్తోంది.
భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చేరింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ అడుగులు వేస్తోంది.
పరిశ్రమకు చెందిన దాదాపు 1500 మంది వ్యాపారవేత్తలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బ్యాంకర్లు, న్యాయవాదులు తదితరులు ఈ 119వ సెషన్‌లో పాల్గొంటారు.
*****
(Release ID: 2063614)
Visitor Counter : 36