ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీ పారిశుద్ధ్య కార్యక్రమం: యువతతో ప్రధానమంత్రి సంభాషణ

Posted On: 02 OCT 2024 9:22PM by PIB Hyderabad

ప్రధానమంత్రి: పరిశుభ్రత పాటించడం వల్ల ఉపయోగాలేమిటో మీకు తెలుసా?

విద్యార్థి: సర్పరిశుభ్రత పాటించడం వల్ల వ్యాధులు దగ్గరికే రావుపైగా ఎప్పుడూ శుభ్రంగా ఉండగలందేశాన్ని శుభ్రంగా ఉంచినప్పుడుపర్యావరణ పరిశుభ్రత కూడా ఎంత ముఖ్యమో ప్రజలకు అర్ధమవుతుంది.

ప్రధానమంత్రి: మరిటాయిలెట్లు లేనప్పుడు ఏమౌతుందీ?

విద్యార్థి: సర్జబ్బులు విజృంభిస్తాయి.

ప్రధానమంత్రి: నిజమేవ్యాధులు ప్రబలుతాయిఇదివరకూ టాయిలెట్లు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు, 100 ఇళ్ళలో కనీసం 60 ఇళ్ళకి కూడా ఆ సౌకర్యం  ఉండేది కాదుదాంతో అటువంటి ఇళ్ళలో నివసించేవారు బహిర్భూమిని వాడేవారువ్యాధులకి అదే పెద్ద కారణమైపోయిందిపాపంఆడవారుఅంటే మన తల్లులుఅక్కలుకూతుర్లు ఎన్నో  ఇబ్బందులు పడేవారుఅయితేస్వచ్ఛ భారత్ అభియాన్ మొదలయ్యాకబాలికలకి ప్రత్యేక వసతులతోస్కూళ్ళలో టాయిలెట్లు నిర్మించేలా మేం చర్యలు తీసుకున్నాందాంతో బడి మానేసే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయివాళ్ళు తమ చదువును కొనసాగించే వీలు కలిగిందిఏమంటారు మరిపరిశుభ్రత లాభం కలిగించిందా లేదా?

విద్యార్థి: తప్పక కలిగించింది సర్!

ప్రధానమంత్రి: ఇవ్వాళ మనం ఏ పెద్దవారి జయంతులను జరుపుకుంటున్నాం?

విద్యార్థి: సర్గాంధీజీలాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సర్ ఇవ్వాళ.

ప్రధానమంత్రి: సరే.. మీలో ఎంతమంది యోగాభ్యాసం చేస్తారు.. చాలా మందే చేస్తున్నారేఆసనాలు వేయడం వల్ల కలిగే లాభాలేమిటో చెప్పండి మరి!

విద్యార్థి: సర్యోగా వల్ల శరీరాన్ని సులభంగా వంచగలుగుతాం.

ప్రధానమంత్రి: సరే.. ఇంకా?

విద్యార్థి: యోగా జబ్బులు రాకుండా కాపుకాయడమే కాకుండాఒంట్లో రక్త ప్రసరణ సరిగ్గా అయ్యేలా చూస్తుంది సర్!

ప్రధానమంత్రి: భలేఇంతకీ నువ్వు ఇంట్లో ఏది ఇష్టంగా తింటావుఅమ్మగారు కూరలు తినమనిపాలు తాగమని చెప్పినప్పుడుమీలో ఎంతమంది గొడవ చేసి వద్దూ అంటారు?

విద్యార్థి: మేమంతా కూరగాయలు తింటాం సర్..

ప్రధానమంత్రి: నిజమే!?  సరేమీలో ఎంతమందికాకరకాయతో సహాఅన్ని కూరలనీ తింటారు?

విద్యార్థి: .. కాకరకాయ తప్పఅన్నీ తింటాం సర్..!

ప్రధానమంత్రి: అలాగా.. కాకరకాయ తప్ప!   

ప్రధానమంత్రి: మీలో ఎంతమందికి ‘సుకన్యా సమృద్ధి యోజన’ గురించి తెలుసు?

విద్యార్థిసర్.. తెలుసండీ!

ప్రధానమంత్రి: ఐతే ఆ పథకం గురించి చెప్పు మరి!

విద్యార్థి: సర్ఇది చాలా మంది అమ్మాయిలకి ఎంతో లాభం కలిగిస్తున్న పథకంమీరు ప్రవేశపెట్టిందే సర్ఈ పథకం కింద, 10 ఏళ్ల లోపు పిల్లలు ఖాతా తెరవచ్చుమాకు 18 ఏళ్లు వచ్చేప్పటికిజమ అయిన సొమ్ము మాకు పెద్ద చదువులకి ఎంతో ఉపయోగిస్తుందిఅప్పుడు మేము ఆ ఖాతా నించీ డబ్బు విత్ డ్రా చేసుకోగలుగుతాం.

ప్రధానమంత్రిశభాష్అమ్మాయి పుట్టగానే సుకన్యా సమృద్ధి యోజన కింద ఖాతా తెరవవచ్చుతల్లితండ్రులు ఖాతాలో  ఏడాదికి వెయ్యి రూపాయలు చొప్పున జమ చేయచ్చు – అంటేనెలకి 80-90 రూపాయల ఖర్చు అనుకోవచ్చుఅమ్మాయికి 18 ఏళ్ళ వయసు వచ్చాకపై చదువులకి డబ్బు అవసరం పడితేఖాతాలో జమ అయిన సొమ్ములో సగం విత్ డ్రా చేసుకోవచ్చుఅదే, 21 సంవత్సరాల వయసులో పెళ్ళికి సిద్ధమైతేఆ అవసరానికి కూడా ఈ డబ్బు వాడుకోవచ్చుప్రతి ఏడాదిక్రమం తప్పకుండా వెయ్యి రూపాయలు జమ చేసిన పక్షంలోసొమ్ము వాపసు తీసుకునే సమయానికి 50,000 రూపాయలు జమ అవుతాయిఇందులో 30,000-35,000 రూపాయలు వడ్డీ సోమ్మేసాధారణ వడ్డీ కన్నా అధికంగాఅంటే 8.2 % చొప్పున మన అమ్మాయిలకి వడ్డీ లభిస్తుంది.

విద్యార్థి: సర్ఇక్కడ ఈ చార్ట్ చూడండిస్కూల్ ని పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తోంది ఇదిఆ పనిలో  ఉన్న విద్యార్థుల ఫోటోలు కూడా ఇందులో ఉన్నాయి సర్!

ప్రధానమంత్రి: నేను గుజరాత్ లో ఉన్న సమయంలో జరిగిన సంఘటన చెబుతానువినండిగుజరాత్ తీర ప్రాంతంలోని ఓ  స్కూల్లో ఒక టీచర్ అద్భుతమైన ఘనత సాధించారుసముద్ర తీర ప్రాంతం కావడంతోఅక్కడి నీరు ఉప్పుమయంగా ఉంటుంది. దాంతో అక్కడి నేలలో మొక్కలు పెరగడం కష్టమయ్యేదిఏ చెట్టూ లేని ఆ నేలని ఆ టీచర్ ఎలా మార్చారుఆయన తన విద్యార్థులకు తలా ఒక ఖాళీ బిస్లరీ బాటిల్ నోవాడేసిన ఖాళీ ఆయిల్ క్యాన్లనో ఇచ్చి,  వాళ్ళ ఇళ్ళలో అంట్లు తోమిన నీళ్ళు జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ఖాళీ బాటిళ్ళలో ఆ నీటిని నింపి బడికి తీసుకురమ్మన్నారుప్రతి విద్యార్థికీ ఆయన ఒక్కో చెట్టు అప్పగించారుఇంటినించీ తెచ్చిన నీటితో ఆ చెట్టు సంరక్షణ చేయాలన్నమాటఈ విషయం జరిగి 5-6 ఏళ్ళ తర్వాత నేను ఆ స్కూల్ కి వెళ్ళినప్పుడుఅక్కడ చూసిన దృశ్యం అద్భుతంగా అనిపించిందినమ్మశక్యం కానంత పచ్చదనంతో ఆ స్కూల్ కళకళలాడుతోంది మరి!  

విద్యార్థి: సర్ఇది పొడి చెత్తతడి/పొడి చెత్తలని వేరు చేస్తేజీవ ఎరువు తయారు చేయడం సులభం.

ప్రధానమంత్రి: మరిమీరు ఇంట్లో వ్యర్ధాలను ఇలా వేరు చేస్తారా?

ప్రధానమంత్రి: ప్రధానమంత్రిమీలో ఎవరి ఇంట్లోనైనామీ అమ్మగారు ఉత్తచేతులతో కూరగాయలు కొనడానికి వెళ్ళికూరలని ప్లాస్టిక్ సంచుల్లో తెచ్చారనుకోండిఅట్లాంటి పరిస్థితుల్లో మీరు, “అమ్మాఇంటినించీ సంచీ తీసుకువెళ్ళవూప్లాస్టిక్ కవర్లు ఎందుకమ్మా మనకి?  ఇంట్లోకి చెత్త తెచ్చినట్టే కదూ..” అంటారా?!

విద్యార్థి: అంటాం సర్గుడ్డ సంచుల్ని తీసుకువెళ్ళమని చెప్తూ ఉంటాం సర్!

ప్రధానమంత్రి: .. మీరు చెబుతారన్నమాట!

విద్యార్థి: ఎస్ సర్!

ప్రధానమంత్రి: భేష్!

ప్రధానమంత్రి: ఇదేమిటో తెలుసుగా మీకుఔను,  గాంధీ తాత కళ్ళజోడు ఇదిమీరు పరిశుభ్రత పాటిస్తున్నారో లేదో ఆయన గమనిస్తూ ఉంటారాగాంధీగారు తమ జీవితం మొత్తం స్వచ్ఛత అంటే ప్రాణం పెట్టేవారుఎవరు శుభ్రతని పాటిస్తున్నారోఎవరు పాటించడం లేదోఆయన గమనిస్తూనే ఉంటారుస్వాతంత్ర్యంపరిశుభ్రతఈ రెండిట్లో ఏది ముఖ్యం అని ఒకానొకప్పుడు ఆయన్ని ఎవరో అడిగితేపరిశుభ్రతకే నా తొలి ప్రాధాన్యం అన్నారాయనఅంటేపరిశుభ్రత అంటే ఆయనకి ఎంత ఇష్టమోస్వాతంత్రం కన్నా మిన్న అని ఆయన భావించేవారని  తెలియడం లేదూమన స్వచ్ఛత ప్రచార ఉద్యమం కొనసాగాలా వద్దమీరే చెప్పండి.

విద్యార్థి: తప్పక ముందుకి తీసుకువెళ్ళాలి సర్!

ప్రధానమంత్రి: ఇప్పుడు చెప్పండి.. పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమమా,  లేక అలవాటుగా మారాలంటారా?

విద్యార్థితప్పకుండా అలవాటుగా మారాలి సర్!

ప్రధానమంత్రి: శభాష్ పిల్లలూ.. కొంతమంది ఈ స్వచ్ఛతా కార్యక్రమమేదో మోదీ గారికి సంబంధించిందీ అనుకుంటూ ఉంటారు.. నిజానికి పరిశుభ్రత అనేది ఏ ఒక్క వ్యక్తికోకుటుంబానికో సంబంధించినది కాదుఅట్లాగేఇది ఒక రోజులో పూర్తయ్యేదీ  కాదుజీవితాంతం పాటించవలసిన ఒక అలవాటు, 365 రోజులూమనం బ్రతికి ఉన్నంత కాలం దృష్టి పెట్టవలసిన అంశం!

మరి ఇందుకోసం మనం ఏం చెయ్యాలీఒకవిధమైన ప్రత్యేక మనస్తత్వాన్ని అలవర్చుకోవాలిమనసుకి హత్తుకునేలా పరిశుభ్రత మంత్రాన్ని పఠించాలిదేశంలో ప్రతి ఒక్కరూ మేము చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయము అనే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి.. అప్పుడేమవుతుంది?   

విద్యార్థి: అప్పుడు అంతటా పరిశుభ్రత ఉంటుంది.

ప్రధానమంత్రి: సరిగ్గా చెప్పారుఇప్పుడు మీరు దేన్ని అలవాటు చేసుకోవాలో చెప్పండిచెత్తనీవ్యర్ధాలనీ ఎక్కడంటే అక్కడ విసిరి వేయకూడదుఅదే మొదటి అడుగుఅర్ధమయ్యిందిగా పిల్లలూ..

విద్యార్థి: ఎస్ సర్అర్ధమయ్యింది సర్!

 

***


(Release ID: 2061700) Visitor Counter : 41