ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ ప్రధానితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంభాషణ
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిణామాలపై ప్రధానికి వివరించిన నెతన్యాహూ
ఉగ్రవాదానికి ఏ రూపంలోనూ స్థానం లేదన్న ప్రధానమంత్రి
ప్రాంతీయ ఉద్రిక్తతలు నిరోధించడం, బందీలను సురక్షితంగా విడిపించాల్సిన అవసరం గురించి ప్రస్తావన
శాంతి, సుస్థిరతను పునరుద్ధరించడానికి భారత్ సిద్ధం
భారత్-ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మెరుగుపరచడంపై చర్చించిన నాయకులు
రోష్ హషానా సందర్భంగా నెతన్యాహూ, యూదులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
30 SEP 2024 11:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఫోన్ చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను వివరించారు.
ఉగ్రవాదానికి ఏ రూపంలోనూ చోటు లేదని పీఎం మోదీ తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను నిరోధించడానికి, బందీలను సురక్షితంగా విడుదల చేయడానికి కృషి చేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత్ సిద్ధంగా ఉంటుందని ప్రధాని తెలిపారు.
భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చే సే దిశగా వివిధ ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించారు.
ప్రధాని నెతన్యాహూతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులందరికీ రోష్ హషానా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తరచూ సంప్రదింపులు కొనసాగించాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
(Release ID: 2060572)
Visitor Counter : 40
Read this release in:
English
,
Urdu
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam