మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

రాంచీలో జరిగిన ఏడో ‘రాష్ట్రీయ పోషణ్ మాహ్’ ముగింపు ఉత్సవంలో 20 రాష్టాల్లో 11 వేలకు పైగా ‘సక్షమ్ అంగన్వాడీ కేంద్రాలు’ ప్రారంభం


సక్షమ్ అంగన్వాడీల ద్వారా బహుముఖ అభివృద్ధి సాధ్యం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతాయి, పోషన్ 2.0 దన్నుగా నిలుస్తాయి. సపోషిత రాష్ట్రాన్ని సుసాధ్యం చేస్తాయి: కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి

పోషణ్ మాహ్ లో భాగంగా వివిధ పోషణ అంశాలపై 13.95 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో 12 కోట్లకు పైగా అవగాహనా కార్యక్రమాలు
‘పోషణ్ మాహ్’ లో చేపట్టిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ద్వారా పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు

Posted On: 30 SEP 2024 3:32PM by PIB Hyderabad

జార్ఖండ్ రాజధాని రాంచీలో ఈరోజు 7వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర గవర్నర్ శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

పోషణ్ మాహ్ లో భాగంగా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపట్టిన వివిధ అవగాహనా కార్యక్రమాల గురించి తయారు చేసిన చిత్రాన్ని ప్రదర్శించారు. తదనంతరం పసిబిడ్డలకు అన్నప్రాశన, గర్భిణులకు శ్రీమంతం వేడుకలను నిర్వహించారు.

అనంతరం, చిన్న పిల్లలు, యుక్తవయస్సు బాలికలు, బాలింతల్లో మెరుగైన పోషణ కోసం జార్ఖండ్ అనుసరిస్తున్న జీవిత చక్రం వ్యూహాన్ని ప్రతిబింబించే ఆవో తోడే, కుపోషణ్ చక్ర” అనే స్ఫూర్తిదాయక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. 20 రాష్టాల్లో 11 వేలకు పైగా సక్షమ్ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం నేటి కార్యక్రమంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. మెరుగైన పోషకాహారం, పసి వయసు బాలల సంరక్షణకు సంబంధించిన అవగాహనను అందించే ‘ఈసీసీఈ’ కార్యక్రమ వ్యాప్తిలో సక్షమ్ అంగన్వాడీ’ల పాత్రను, ప్రభావాన్ని చూపే మరో లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించారు.

అటుపై, రాష్ట్ర గవర్నర్ శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, బీహార్ లోని జమూయీ, ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నందగావ్ జిల్లాల్లోని సక్షమ్ అంగన్వాడీ’ కేంద్రాల కార్యకర్తలతో వీడియో మాథ్యమం ద్వారా సంభాషించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి ప్రసంగిస్తూ... “పోషణ్ మాహ్ లో భాగస్వాములైన వారు, పెద్ద సంఖ్యలో, ఉత్సాహంగా పాల్గొనడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. వివిధ ఇతివృత్తాలు గల పోషణ అంశాలపై 13.95 లక్షల అంగన్వాడీ కేంద్రాల్లో 12.86 కోట్లకు పైగా అవగాహనా కార్యక్రమాలు జరిగాయి.
మొత్తం దేశానికి అవగాహన కల్పించిన పోషణాంశాల ‘జన్ ఆందోళనే’ కాక, ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ద్వారా పర్యావరణ పరిరక్షణ అంశాలపై ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు కూడా జరిగాయి. పోషణ్ మాహ్ లో మొత్తం 86 లక్షల ‘ఏక్ పేడ్ మా కే నామ్’ సంబంధిత కార్యక్రమాలు పూర్తయ్యాయి” అని చెప్పారు. లబ్ధిదారులకు, సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు పోషణ మాసంలో విలక్షణ కార్యక్రమాలను రూపొందించాయి. అస్సాం రాష్ట్రంలో- రక్తంలో హిమోగ్లోబిన్’ ఆశించిన స్థాయిలో గల యువతులను హిమోగ్లోబిన్ క్వీన్స్’ అనే ప్రత్యేక పేరుతో గుర్తించారు. దాంతో యుక్తవయస్సు అమ్మాయిలకే కాక, మొత్తం సమాజానికి ఆ అంశం పట్ల స్ఫూర్తి, అవగాహన కలిగాయి” అని మంత్రి తెలిపారు. ‘సక్షమ్ అంగన్వాడీల’ వల్ల వివిధ అభివృద్ధి పథకాలు వేగం పుంజుకుని, ‘పోషణ్ మాహ్ రెండో ఎడిషన్’ లో ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందనీ
, వారు కార్యక్రమాన్ని సొంతం చేసుకుని ‘సుపోషిత్ రాష్ట్ర ఆశయ సాకారంలో భాగమవుతారు” అని శ్రీమతి అన్నపూర్ణాదేవి అన్నారు.

పోషకాహార లోప రహిత భారతదేశ నిర్మాణంలో విభిన్న విభాగాల, భాగస్వాముల మధ్య సమన్వయం ప్రాముఖ్యతని రాష్ట్ర గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ తమ కీలకోపన్యాసంలో ప్రస్తావించారు. అంగన్వాడీ కార్యకర్తలు పోషించే ముఖ్య పాత్ర గురించి మాట్లాడుతూ, “కార్యక్షేత్రంలోని కార్యకర్తల కృషి వల్ల సక్షమ్ అంగన్వాడీ కేంద్రాలు, ‘పోషణ్ భీ పఢాయీ భీ’  వంటి పథకాలు విజయవంతమై, శక్తిమంతమైన స్వావలంబన సాధించిన దేశంగా మనం రూపుదిద్దుకుంటున్నాం”,  అన్నారు. ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, తృణ ధాన్యాలును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా శ్రీ గంగ్వార్ పిలుపునిచ్చారు. 

‘పోషణ్ భీ పఢాయీ భీ’ ‘ఈసీసీఈ’ కార్యక్రమాలు, ‘పాల్నా గృహ్’ ఇంటికి వెచ్చాలు/ఆహారం-ఆరోగ్యం, ఆరోగ్య శిబిరం-రక్తహీనత పరీక్షలు, బాలల సంరక్షణ, స్వయం సహాయక బృందాలు, సామాజిక సురక్ష పథకాలు, సిఎంఏఎం (సమాజ భాగస్వామ్యం ద్వారా తీవ్రమైన పోషకాహార లోప నివారణ) పేరిట అనేక స్టాళ్ళు ఏర్పాటయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రాన్ని పోషకాహార లోపం లేని రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు పాటించవలసిన విధానాలతో కూడిన ‘పోషణ్ ధారా’ పత్రిక మూడో సంచికను విడుదల చేశారు.

పోషణ్ మాహ్ నెలరోజుల నిర్వహణలో భాగంగా 36 రాష్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 12.86 కోట్ల పోషకాహార సంబంధ అవగాహనా కార్యక్రమాలు జరిగాయి. రక్తహీనత అంశంపై 2.4 కోట్ల కార్యక్రమాలు, బాలల పెరుగుదల అధ్యయనం అంశంపై 2 కోట్ల కార్యక్రమాలను నిర్వహించారు.

సంపూర్ణ పోషణతో కూడిన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి కృషిని పోషణ్ మాహ్ 2024 కార్యక్రమం గుర్తించి, ప్రోత్సహిస్తుంది. కార్యక్రమంలో భాగమైన రాష్ట్రాలను గుర్తించడమే కాక, జన్ ఆందోళన్ (ప్రజల భాగస్వామ్యం) ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారోద్యమ బలోపేతం, ‘సక్షమ్ అంగన్వాడీ’ల ద్వారా అవగాహన పెంపు ప్రాముఖ్యాన్ని పోషణ్ మాహ్ గుర్తిస్తుంది.

 

***



(Release ID: 2060543) Visitor Counter : 12