ప్రధాన మంత్రి కార్యాలయం
సేంద్రీయ రైతు శ్రీమతి పప్పమ్మల్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
28 SEP 2024 7:35AM by PIB Hyderabad
పద్మశ్రీ అవార్డు గ్రహీత, సేంద్రీయ రైతు శ్రీమతి పప్పమ్మల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయంలో, ప్రత్యేకించి సేంద్రీయ వ్యవసాయంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. వినయం, దయాగుణంతో ఆమె ప్రజల ప్రశంసలను అందుకున్నారని అన్నారు.
ఈ మేరకు 'ఎక్స్' మాధ్యమంలో ప్రధానమంత్రి ఇలా పోస్ట్ చేశారు:
“పప్పమ్మల్ గారి మరణం తీవ్రంగా బాధిస్తోంది. వ్యవసాయంలో, ప్రత్యేకించి సేంద్రీయ వ్యవసాయంలో ఆమె తనదైన ముద్రను వేసుకున్నారు. వినయం, దయాగుణంతో ఆమె ప్రజల ప్రశంసలను అందుకున్నారు. ఆమె కుటుంబం, శ్రేయోభిలాషులతో నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి” అని పేర్కొన్నారు.
***********
MJPS/ST
(Release ID: 2059975)
Visitor Counter : 63
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam