ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2024 లో భారత్ కు 39వ స్థానం: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస
प्रविष्टि तिथि:
27 SEP 2024 10:50PM by PIB Hyderabad
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ - 2024 లో 133 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 39వ స్థానాన్ని పొందడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ర్యాంకును "అద్భుతమైన విజయం"గా ప్రధానమంత్రి అభివర్ణించారు. దేశ యువతకు అద్భుత అవకాశాలను అందించగల శక్తిమంతమైన ఆవిష్కరణల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని తెలిపారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఎక్స్ పోస్టును పంచుకుంటూ ప్రధాన మంత్రి ఇలా అన్నారు;
'ఇది అద్భుతమైన విజయం! యువత జీవితాలను మార్చగల శక్తిమంతమైన ఆవిష్కరణల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.'
***
(रिलीज़ आईडी: 2059949)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam