ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

చెస్ ఒలింపియాడ్ విజేతలతో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 26 SEP 2024 4:30PM by PIB Hyderabad

 ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీన్యూఢిల్లీలోని తమ నివాసంలో ఈ రోజుచెస్ ఒలింపియాడ్ విజేతలతో  సంభాషించారుఈ పోటీలలో భారతదేశం తొలిసారిగా స్వర్ణపతకాలు సాధించిన విషయాన్ని షెఫ్ డి మిషన్దివ్యేందు బారువా ప్రధానమంత్రి దృష్టికి తెచ్చారుతొలిసారిగా బాలుర జట్టు 22 పాయింట్లకు 21 పాయింట్లుబాలికల జట్టు 22 పాయింట్లకు 19 పాయింట్లు సాధించాయనిరెండు జట్లూ కలసి మొత్తం 44 పాయింట్లలో 40 పాయింట్లు సాధించాయని ఆయన ప్రధానమంత్రికి తెలిపారు.

ఆట సమయంలో అక్కడి పరిస్థితి గురించి ప్రధానమంత్రి క్రీడాకారులను అడిగి తెలుసుకున్నారుభారత జట్లు విజయం సాధించడం పట్ల చెస్ క్రీడాకారిణి హారికా ద్రోణవల్లి సంతోషం వ్యక్తం చేశారుతమ ప్రత్యర్థులు కూడా విజయోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె ప్రధానమంత్రికి తెలిపారుభారత దేశంలో చెస్ ఆటకు నానాటికీ పెరుగుతున్న ఆదరణను విదిత్ గుజరాతి ప్రస్తావించారుతమ జట్టుకు అద్భుతమైన మద్దతు లభించడం ఆనందంగా ఉందన్నారు. 180 దేశాలు ఈ పోటీలో పాల్గొన్నట్టు తానియా సచ్ దేవ్  ప్రధానమంత్రికి తెలిపారుగత చెస్ ఒలింపియాడ్ పోటీలు చెన్నైలో జరిగిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారుఆ పోటీలలో మన దేశానికి చెందిన రెండు జట్లూ కాంస్య పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చిందని తెలిపారుఅమెరికా జట్టుపై బాలికల జట్టు  ఓడిపోవడంతో అప్పట్లో స్వర్ణపతకం చేజారిపోయిందని, అయితే ఈసారి పోటీలలో అమెరికాతో ఆడడం మంచి ప్రేరణనిచ్చిందని అన్నారుమ్యాచ్ పోటా పోటీగా సాగి డ్రా అయినప్పటికీ స్వర్ణపతకం సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పోటీలలో విజయం సాధించి తీరాలన్న క్రీడాకారుల పట్టుదల గర్వకారణమంటూ ప్రధానమంత్రి వారిని  ప్రశంసలతో ముంచెత్తారుబాలుర జట్టు 21 పాయింట్లుబాలికల జట్టు 19 పాయింట్లు సాధించడం పట్ల చెస్ పోటీ నిర్వాహకుల స్పందన గురించి ప్రదానమంత్రి వారిని అడిగి తెలుసుకున్నారుతమ జట్టు సంతృప్తికరమైన విజయాన్ని సాధించిందనిప్రత్యేకించిప్రారంభ టీమ్ విషయంలో ప్రత్యర్ధులు తమకు కనీసం దగ్గరగా కూడా రాలేకపోయారని తానియా తెలిపారుతొలి ఏడు మ్యాచ్  ల  విజయం గురించి వివరిస్తూ ఆమెమధ్యలో చిన్న ఎదురుదెబ్బ  తగిలినా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి పుంజుకున్నామని తెలిపారుఈ పాటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారుడుక్రీడాకారిణి అద్భుతమైన ప్రతిభ కనబరచిసమష్టి జట్టు స్ఫూర్తితో ఆడారని గుకేశ్ దొమ్మరాజు కొనియాడారు. 2022 ఒలింపియాడ్  లో స్వల్ప తేడాతో స్వర్ణం చేజారడం నుంచి క్రీడాకారులు గట్టి స్ఫూర్తి పొందారని  ఆయన అన్నారుటోర్నమెంట్ ప్రారంభం నుంచీ జట్టు సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఆడారని అన్నారు.

ఆటలో పొరపాట్లను సరిదిద్దడంలోలేదా ప్రత్యర్థుల ఎత్తుగడలను అర్ధం చేసుకోవడంలో కృత్రిమ మే ఉపయోగం గురించి ప్రధానమంత్రి వారిని అడిగి తెలుసుకున్నారుఇందుకు సమాధానమిస్తూ రమేష్ ప్రజ్ఞానంద... కృత్రిమ మేతో చెస్ ఆట గురించి చెబుతూనూతన సాంకేతికతలుమెరుగైన కంప్యూటర్లుచెస్ లో ఎన్నో కొత్త ఆలోచనలకు అవకాశం కల్పిస్తాయని అన్నారునానాటికీ అభివృద్ధి  చెందుతున్న నూతన సాంకతికత నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారుపోటీకి సన్నద్ధం కావడానికి కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నారనిఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు.

తుది దశ పోటీకి చేరడానికి జట్టు సభ్యులందరి అంకిత భావంశ్రమ అద్భుతమని దివ్య దేశ్ ముఖ్  తెలిపారుఅనంతరం సంభాషణ క్రీడాకారుల కుటుంబ నేపథ్యంపైకి మళ్లిందిచాలామంది క్రీడాకారుల తల్లిదండ్రులు డాక్టర్లు కదా అంటూ ప్రధానమంత్రి గుర్తుచేశారుతమ సోదరి కూడా డాక్టర్ అని విదిత్ గుజరాతి అన్నారుదేశంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడికి అందిస్తున్న అద్భుత మద్దతుకు తానియా సచ్ దేవ్  ప్రధానమంత్రి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారుక్రీడలతో తన అనుబంధం గురించి చెప్పాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారుక్రీడల విషయంలో తన అభిప్రాయం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  కేవలం సంపదపరిశ్రమలు,జిడిపితో మాత్రమే దేశంఅభివృద్ధి చెందిన దేశంగా మారదనిప్రతి ఒక్క రంగంలో అంటే  సినిమా లేదా శాస్త్ర సాంకేతికరంగంక్రీడల వంటి వాటన్నింటిలో ప్రావీణ్యం అవసరమని ఆయన అన్నారుగుజరాత్ ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రిక్రీడా మహా కుంభ్  ను నిర్వహిస్తూ వచ్చాననిఇందులో లక్షలాది మంది పిల్లలు పాల్గొనేవారని  ఆయన అన్నారుఆ పిల్లలలోని ప్రతిభ వెలికి వస్తున్నందుకు  సంతోషంగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు.

మన దేశ యువతకు అపారమైన సామర్ధ్యం ఉందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారుక్రీడాస్ఫూర్తిని కేవలం క్రీడలలోనే కాకుండాసామాజిక జీవనంలోనూ దీనిని ఒక సంస్కృతిగా అలవరచుకునితద్వారా దేశ సామాజిక జీవనం బాగుండేట్టు చూడాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుండడం  అదే సమయంలోఒత్తిడిని జయించడం గురించి విదిత్ గుజరాతితానియా సచ్ దేవ్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ప్రధానమంత్రిశారీరకంగా దృఢంగా ఉండడంతోపాటు పనితీరును మెరుగు పరుచుకునేందుకు ఉపయోగపడే అలవాట్లు చేసుకోవాలని అన్నారు. ‘మంచి నిర్ణయాలు తీసుకోవడానికి,

ఆ అంశం పై అనుకూలవ్యతిరేకతలకు సంబంధించి ఎంతో సమాచారం అవసరంకానీ మనకు సంతోషం కలిగించేది మాత్రమే వినాలనకోవడం మానవ నైజంఇది తప్పడు నిర్ణయాలకు దారితీస్తుంది” అని ఆయన అన్నారుఅన్ని రకాల సమాచారాన్ని విశ్లేషించిదానికి గల వివిధ దృష్టికోణాలను అవగాహన చేసుకునినిపుణులతో సంప్రదించి తొందరపాటు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.

మీరు సవాళ్లను ఎదుర్కోవడం సులభంకొన్ని అనుభవాలనిస్తాయినేను ఇంతకు ముందే చెప్పిన్టటు యోగాధ్యానం రెండింటికీ అపారమైన శక్తి ఉంది’’ అని ఆయన అన్నారుఒక వ్యక్తి ఎప్పుడూ దేనితోనూ సంతృప్తి చెందకూడదనిఅది ఆత్మసంతృప్తికి దారితీస్తుందని అన్నారు. "ఏదైనా కొత్తది చేయాలన్న,  మరింత ఎక్కువగా చేయాలన్న తపనమనలో ఎప్పుడూ ఉండాలని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన మద్దతుకుమనదేశం రెండు చారిత్రిక స్వర్ణపతకాలు సాధించినట్టు ప్రకటించినందుకు దివ్యేందు బారువా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారుతాము బస్సులో తిరిగివస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని చూసినట్టు ఆయన తెలిపారు. 1998లో జరిగిన తొలి చెస్ ఒలింపియాడ్ ను గుర్తు చేసుకుంటూ ఆయనగ్యారీ కాస్పరోవ్కార్పోవ్ ఆటోగ్రాఫ్స్ కోసం ఎదురుచూశారనిఇప్పుడు గుకేశ్బ్రహ్మానందఅర్జున్,దివ్‌యహారికఇతరులు ఈ ఎడిషన్ ఆటోగ్రాఫ్స్ ఇస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారుకొత్త తరం క్రీడాకారుల విశ్వాసం పెంపొందడానికి ప్రధానమంత్రి దార్శనికత కారణమని ఆయన అన్నారు.

ప్రతి క్రీడాకారుడికి తాను విలువ ఇస్తాననివీరు ఇతర చెస్ క్రీడాకారులకు గొప్ప ప్రేరణగా నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారుతాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ చెస్ ఈవెంట్లను నిర్వహించాననిఅందులో 20 వేల మంది చెస్ టగాళ్లు పాల్గొన్నారని ఆయన తెలిపారుఒక్కోసారి ఇతరుల విజయం కూడా ప్రేరణగా నిలుస్తుందన్నారుచెస్ క్రీడాకారిణి వంటికా అగర్వాల్ మాట్లాడుతూ... ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోత్సాహం ఇండియాకు మరిన్ని పతకాలు సాధించడానికి దోహదపడిందన్నారుఆమె ప్రధానమంత్రికి ఒక ఫోటో బహుకరించారుఅందులో ప్రధానమంత్రి తనకు బహుమతి ప్రదానం చేస్తున్న దృశ్యం ఉందిచివరగాఅందరికీ ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి క్రీడాకారులతో తన సంభాషణ కార్యక్రమాన్ని ముగించారు.

 

***



(Release ID: 2059943) Visitor Counter : 7