పర్యటక మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        అత్యుత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024 విజేతలను ప్రకటించిన కేంద్ర పర్యాటక  శాఖ
                    
                    
                        
మొత్తం 8 విభాగాల్లో విజేతలుగా నిలిచిన 36 గ్రామాలు
                    
                
                
                    Posted On:
                27 SEP 2024 2:38PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ఇవాళ (2024 సెప్టెంబర్ 27) కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన అత్యుత్తమ పర్యాటక గ్రామాల పోటీ-2024 విజేతలను ప్రకటించింది.
   భారతీయ ఆత్మకు ప్రతీకలైన గ్రామాల సందర్శనకు పర్యాటకులను ప్రోత్సహించే కృషిలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ 2023లో అత్యుత్తమ పర్యాటక గ్రామాల పోటీని ప్రారంభించింది. సామాజిక ఆధారిత విలువల పాటింపు సహా సాంస్కృతిక, ప్రకృతి సహజ సంపద పరిరక్షణలో  స్థిరమైన నిబద్ధతగల గ్రామాలను గుర్తించి, ప్రోత్సహించడం ఈ పోటీ ధ్యేయం.
   ఈ మేరకు 2023లో తొలిసారి నిర్వహించిన పోటీలో భాగంగా 795 గ్రామాలు దరఖాస్తులు పంపాయి. అయితే, ఈ దఫా (2024)లో 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఏకంగా 991 గ్రామాలు ఇందులో పోటీపడటం విశేషం. వీటినుంచి మొత్తం 8 విభాగాలలో 36 గ్రామాలను అత్యుత్తమ పర్యాటక గ్రామాలుగా మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది.
ఆ గ్రామాల వివరాలను కింది పట్టికలో చూడవచ్చు:
	
		
			| వ.సం. | గ్రామం పేరు | రాష్ట్రం | విభాగం | 
		
			| 1 | ధూద్మరాలు | ఛత్తీస్‌గఢ్ | సాహస పర్యాటకం | 
		
			| 2 | అరు | జమ్ముకశ్మీర్ | సాహస పర్యాటకం | 
		
			| 3 | కుత్లూర్ | కర్ణాటక | సాహస పర్యాటకం | 
		
			| 4 | జాఖోల్ | ఉత్తరాఖండ్ | సాహస పర్యాటకం | 
		
			| 5 | కుమరకోమ్ | కేరళ | వ్యవసాయ పర్యాటకం | 
		
			| 6 | కర్డే | మహారాష్ట్ర | వ్యవసాయ పర్యాటకం | 
		
			| 7 | హంసాలి | పంజాబ్ | వ్యవసాయ పర్యాటకం | 
		
			| 8 | సూపి | ఉత్తరాఖండ్ | వ్యవసాయ పర్యాటకం | 
		
			| 9 | బరానగర్ | పశ్చిమ బెంగాల్ | వ్యవసాయ పర్యాటకం | 
		
			| 10 | చిత్రకోటే | ఛత్తీస్‌గఢ్ | సామాజిక ఆధారిత పర్యాటకం | 
		
			| 11 | మినీకాయ్ ద్వీపం | లక్షద్వీప్ | సామాజిక ఆధారిత పర్యాటకం | 
		
			| 12 | సియాల్సుక్ | మిజోరం | సామాజిక ఆధారిత పర్యాటకం | 
		
			| 13 | డియోమాలి | రాజస్థాన్ | సామాజిక ఆధారిత పర్యాటకం | 
		
			| 14 | అల్పనా గ్రామ్ | త్రిపుర | సామాజిక ఆధారిత పర్యాటకం | 
		
			| 15 | సుల్కుచి | అస్సాం | కళలు | 
		
			| 16 | ప్రాణపూర్ | మధ్యప్రదేశ్ | కళలు | 
		
			| 17 | ఉమ్డెన్ | మేఘాలయ | కళలు | 
		
			| 18 | మానియాబంధ | ఒడిశా | కళలు | 
		
			| 19 | నిర్మల్ | తెలంగాణ | కళలు | 
		
			| 20 | హఫేశ్వర్ | గుజరాత్ | వారసత్వం | 
		
			| 21 | ఆండ్రో | మణిపూర్ | వారసత్వం | 
		
			| 22 | మాఫ్లాంగ్ | మేఘాలయ | వారసత్వం | 
		
			| 23 | కీలాడి | తమిళనాడు | వారసత్వం | 
		
			| 24 | పురా మహాదేవ్ | ఉత్తర ప్రదేశ్ | వారసత్వం | 
		
			| 25 | దుధాని | దాద్రా-నాగర్ హవేలీ; దమన్-దియ్యు | బాధ్యతాయుత పర్యాటకం | 
		
			| 26 | కదలుండి | కేరళ | బాధ్యతాయుత పర్యాటకం | 
		
			| 27 | తార్ గ్రామం | లడఖ్ | బాధ్యతాయుత పర్యాటకం | 
		
			| 28 | సబర్వాణి | మధ్యప్రదేశ్ | బాధ్యతాయుత పర్యాటకం | 
		
			| 29 | లాడ్‌పురా ఖాస్ | మధ్యప్రదేశ్ | బాధ్యతాయుత పర్యాటకం | 
		
			| 30 | అహోబిలం | ఆంధ్ర ప్రదేశ్ | ఆధ్యాత్మికం-ఆరోగ్యం | 
		
			| 31 | బండోరా | గోవా | ఆధ్యాత్మికం-ఆరోగ్యం | 
		
			| 32 | రిఖియాపీఠ్ | జార్ఖండ్ | ఆధ్యాత్మికం-ఆరోగ్యం | 
		
			| 33 | మేల్కలింగం పట్టి | తమిళనాడు | ఆధ్యాత్మికం-ఆరోగ్యం | 
		
			| 34 | సోమశిల | ఆంధ్ర ప్రదేశ్ | ఆధ్యాత్మికం-ఆరోగ్యం | 
		
			| 35 | హర్సిల్ | ఉత్తరాఖండ్ | ఉత్తేజపూరిత గ్రామం | 
		
			| 36 | గుంజి | ఉత్తరాఖండ్ | ఉత్తేజపూరిత గ్రామం | 
	
 
***
                
                
                
                
                
                (Release ID: 2059717)
                Visitor Counter : 135