పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

నేషనల్ రెస్పాన్సిబుల్ టూరిజం ఇనిషియేటివ్ ప్రారంభం


పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ పేరుతో ప్రారంభించిన పర్యాటక శాఖ

Posted On: 27 SEP 2024 2:03PM by PIB Hyderabad
‘పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ’ పేరుతో నేషనల్ రెస్పాన్సిబుల్ టూరిజం ఇనిషియేటివ్‌ను  పర్యాటక  శాఖ ప్రారంభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పర్యాటకాన్ని సామాజిక సమ్మేళనం, ఉపాధి కల్పన, ఆర్థిక పురోగతి కోసం చోదకశక్తిగా ఉపయోగించాలనే ప్రధాన మంత్రి దార్శనికత మేరకు పర్యాటక  శాఖ భారత్ లోని 6 పర్యాటక కేంద్రాల్లో పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పర్యాటక కేంద్రాలు ఓర్చా (మధ్య ప్రదేశ్), గండికోట (ఆంధ్ర ప్రదేశ్), బోధ్ గయ (బిహార్), ఐజ్వాల్ (మిజోరం), జోధ్‌పూర్ (రాజస్థాన్), శ్రీ విజయ పురం(అండమాన్-నికోబార్).

ఈ కార్యక్రమం ద్వారా, పర్యాటక  శాఖ ఆయా పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు మంచి అనుభవాన్ని అందించే లక్ష్యంతో, ఆ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రాయబారులు, కథకుల వంటి 'పర్యాటక-హితమైన' వ్యక్తులు పర్యాటకులతో మమేకమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులతో మాట్లాడుతూ, వారితో నిమగ్నమయ్యే వ్యక్తులందరికీ పర్యాటక సంబంధిత శిక్షణను, అవగాహనను అందించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.

'అతిథి దేవో భవ' స్ఫూర్తితో, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, రైల్వే స్టేషన్‌లలో సిబ్బంది, విమానాశ్రయాలు, బస్ స్టేషన్లు, హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, హోమ్‌స్టే యజమానులు, టూర్ గైడ్‌లు, పోలీసు సిబ్బంది, వీధి వ్యాపారులు, దుకాణదారులు, విద్యార్థులు సహా మరెంతో మందికి శిక్షణ అందించి, అవగాహన కల్పించారు. పర్యాటకం ప్రాముఖ్యతను, సాధారణ శుభ్రత, భద్రత, సుస్థిరత, పర్యాటకులకు ఆతిథ్యం, సంరక్షణ విషయంలో అత్యున్నత ప్రమాణాలను అనుసరించాల్సిన ప్రాముఖ్యత గురించి వారికి అవగాన కల్పించారు.

ఈ వ్యక్తులకు ఆ పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన స్థానిక కథనాలతో పాటు, అంతగా ప్రచారంలో లేని పర్యాటక అద్భుతాలను గురించి కూడా అవగాహన కల్పించారు. అందువల్ల పర్యాటకులతో సంభాషించే వీరు స్థానిక రాయబారులుగా, కథకులుగా పర్యాటకులకు అన్ని విధాలుగా సానుకూల అనుభవాన్ని కలిగించేందుకు కృషి చేస్తారు.


పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ కార్యక్రమం ద్వారా, వారసత్వ ప్రదేశాలను చూపించడం, విభిన్న ఆహార పదార్థాలను రుచి చూపించే  పర్యటనలు, హస్తకళా ప్రదర్శనలు, పర్వతారోహణలు, మంచి గృహ వసతి వంటి కొత్త పర్యాటక అంశాలు, అనుభవాలను అభివృద్ధి చేసేందుకు స్థానిక మహిళలు, యువతకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. దీని ద్వారా గృహ వసతి కల్పిస్తూ ఇంటి యజమానులుగా, వివిధ ఆహార, వంటకాల రుచుల అనుభవాలను అందించే వారిగా, సాంస్కృతి గైడ్, ప్రకృతి సంబంధ గైడ్, సాహసోపేత కార్యక్రమాల గైడ్ వంటి వివిధ పర్యాటక సంబంధ రంగాల్లో లాభదాయక ఉపాధి పొందడం కోసం స్థానికులు ఈ అవకాశాలను వినియోగించుకోవచ్చు.

దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షించేందుకు వారికి మరపురాని అనుభవాలను అందించం కోసం స్థానికులకు డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సాధనాల్లో సాధారణ శిక్షణతో పాటు ఈ పర్యాటక సంబంధ శిక్షణ కూడా అందించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రయోగాత్మకంగా ఆరు పర్యాటక ప్రదేశాల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే సుమారు 3000 మంది పర్యాటన్ మిత్రలు పర్యాటకులకు సానుకూల అనుభవాలను అందించడంలో  శిక్షణ పొందారు.

ప్రభావం

పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీల కృషి కారణంగా, పర్యాటక శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడానికి, పర్యాటక రంగంలో భాగస్వాములయ్యేందుకు  స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.

పర్యాటన్ మిత్రల ద్వారా పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులు సానుకూల అనుభవాన్ని పొందేలా చేయడం కోసం ఆయా పర్యాటక ప్రదేశాల పర్యాటన్ మిత్ర, దీదీలకు రాబోయే కాలంలో పర్యాటక శాఖ ప్రత్యేక బ్యాడ్జ్, గుర్తింపును అందించనుంది.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నేడు పర్యాటక మంత్రిత్వ శాఖ దేశంలోని కింది 50 పర్యాటక ప్రదేశాల్లో పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ కార్యక్రమం ప్రారంభించింది:
 

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

పర్యాటక ప్రదేశం 1  

పర్యాటక ప్రదేశం 2

అండమాన్-నికోబార్

శ్రీ విజయ పురం

 

ఆంధ్ర ప్రదేశ్

గండికోట

తిరుపతి

అరుణాచల్ ప్రదేశ్

తవాంగ్

 

అస్సాం

గౌహతి

 

బిహార్

బోధ్‌గయ

నలంద

చండీగఢ్

చండీగఢ్

 

ఛత్తీస్‌గఢ్

రాయ్‌పూర్

 

దాద్రా-నాగర్ హవేలీడామన్ డయ్యూ

దమన్

 

ఢిల్లీ

ఢిల్లీ

 

గోవా

గోవా

 

గుజరాత్

అహ్మదాబాద్

కెవాడియా

హర్యానా

కురుక్షేత్ర

 

హిమాచల్ ప్రదేశ్

సిమ్లా

 

జమ్మూ & కాశ్మీర్

శ్రీనగర్

 

జార్ఖండ్

రాంచీ

 

కర్ణాటక

హంపి

మైసూర్

కేరళ

తిరువనంతపురం

కొచ్చి

లదాఖ్

లేహ్

 

లక్షద్వీప్

కవరత్తి

 

మధ్య ప్రదేశ్

ఓర్చా

ఉజ్జయిని

మహారాష్ట్ర

ఔరంగాబాద్

నాసిక్

మణిపూర్

ఇంఫాల్

 

మేఘాలయ

షిల్లాంగ్

 

మిజోరం

ఐజ్వాల్

 

నాగాలాండ్

దిమాపూర్

 

ఒడిశా

పూరి

 

పుదుచ్చేరి

పుదుచ్చేరి

 

పంజాబ్

అమృత్‌సర్

పటియాల

రాజస్థాన్

జోధ్‌పూర్

జైపూర్

సిక్కిం

గ్యాంగ్టక్

 

తమిళనాడు

మహాబలిపురం

తంజావూర్

త్రిపుర

అగర్తలా

 

తెలంగాణ

హైదరాబాద్

 

ఉత్తర ప్రదేశ్ 

వారణాసి

ఆగ్రా

ఉత్తర ప్రదేశ్ 

అయోధ్య

 

ఉత్తరాఖండ్

హరిద్వార్

రిషికేశ్

పశ్చిమ బెంగాల్

డార్జిలింగ్

కోల్‌కతా

 

అద్భుత ప్రగతి తో దూసుకెళ్తున్న భారతావనిలో ఆత్మీయులైన భారతీయుల ద్వారా మంచి పర్యాటక అనుభూతిని అందించే ఉద్దేశంతో పర్యాటన్ మిత్ర, పర్యాటన్ దీదీ కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. తద్వారా  పర్యాటకులకు మంచి ఆతిథ్యాన్ని మరపురాని అనుభవాలను అందిస్తుంది. 
 
 
***


(Release ID: 2059714) Visitor Counter : 20