హోం మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన సఫలమైన సందర్భంగా అభినందనలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
‘మోదీ దౌత్య వ్యూహాన్ని’ బలోపేతం చేసిన అమెరికా పర్యటన
అసలు సిసలు అభివృద్ధికి ఉదాహరణగా నిలవడం ద్వారా
ప్రపంచంలో మార్పు తెచ్చే శక్తిగా భారత్ ను తీర్చిదిద్దింది ఈ వ్యూహమే
క్వాడ్ శిఖరాగ్ర సమావేశ సాఫల్యత, మోదీ- అమెరికా భారీ స్థానిక కార్యక్రమం, ప్రపంచ భవితపై ఐరాస సమావేశం..
ఈ మూడు ఘట్టాలు... ప్రధాని శ్రీ మోదీ ప్రపంచస్థాయి ప్రజాదరణకు అద్దం పట్టాయి
భారత్ ఖ్యాతిని పెంచారు, మనం చెప్పేది అందరూ వినేలా చేశారు...
ప్రపంచ సంక్షేమ కార్యక్రమాల్లో అందరి భాగస్వామి- భారతదేశం
Posted On:
24 SEP 2024 7:53PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు రోజుల అమెరికా పర్యటన ఫలప్రదంగా పూర్తి అయిన సందర్భంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా... ప్రధానికి అభినందనలను తెలియజేశారు.
సామాజిక ప్రసార మాథ్యమవేదిక ‘ఎక్స్’ లో శ్రీ అమిత్ షా ఈ కింది విధంగా ఒక సందేశాన్ని పొందుపరిచారు:
‘‘అమెరికా మూడు రోజుల పర్యటన ఫలప్రదమైనందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు. మోదీ దౌత్య వ్యూహం ఈ పర్యటన ద్వారా మరింతగా బలపడింది. అసలైన అభివృద్ధికి నిర్వచనంగా నిలుస్తూ...ప్రపంచంలో మార్పులు తెచ్చే దిశగా భారత్ పాత్రను తీర్చిదిద్డడానికి ఇది ఉపయోగపడింది. విజయవంతమైన క్వాడ్ సదస్సుగానీ, మోదీ-అమెరికా స్థానికులతో నిర్వహించిన సమావేశంగానీ, ప్రపంచ భవిష్యత్తుపై ఐరాస నిర్వహించిన సమావేశంగానీ- అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనకు లభించిన ప్రజాదరణను ప్రతిఫలిస్తున్నాయి. మోదీజీ నాయత్వం- భారతదేశపు ఖ్యాతిని పెంచడంతోపాటు, ఇపుడు మనం ఏం చెప్పినా ప్రపంచం ఆలకించేలా, ప్రపంచ సంక్షేమ కార్యక్రమాల్లో భారతదేశాన్ని తప్పనిసరి భాగస్వామిగా చేసింది’’ అని అమిత్ షా పేర్కొన్నారు.
(Release ID: 2058464)
Visitor Counter : 52