రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఐసిఎఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ శత వార్షికోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్రపతి

Posted On: 20 SEP 2024 2:32PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఝార్ఖండ్ లోని రాంచీ లో ఈ రోజు జరిగిన ఐసిఎఆర్-నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ (ఎన్ఐఎస్ఎశత వార్షికోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూసాగును ఒక లాభదాయకమైన వ్యాపకంగా తీర్చిదిద్దడంతో పాటుగా 21వ శతాబ్దంలో వ్యవసాయ రంగం ముంగిట ఆహార భద్రతవనరులను దీర్ఘకాలం పాటు ఉపయోగించుకోగలగడంవాతావరణ మార్పు అనే మూడు ప్రధాన సవాళ్ళు ఉన్నాయన్నారుద్వితీయ వ్యవసాయం ఈ సవాళ్ళను తట్టుకోవడంలో సహాయకారిగా ఉంటుందని తెలిపారు. ద్వితీయ వ్యవసాయం అంటే దీనిలో ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించడంఇంకా తేనెటీగల పెంపకంకోళ్ళ పెంపకంవ్యవసాయ ప్రధాన పర్యటనల వంటి ఇతరత్రా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలేనని వివరించారు.  ద్వితీయ వ్యవసాయ కార్యకలాపాలను అమలుపరచడం ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉచిత రీతిన వినియోగించుకోవచ్చునని రాష్ట్రపతి అన్నారు. వాటిని శుద్ధి చేసి ఉపయోగకరమైనవిలువైన వస్తువులను తయారు చేసుకోవచ్చన్నారుఈ మార్గాన్ని అనుసరించిన పక్షంలోపర్యావరణాన్ని పరిరక్షించవచ్చురైతుల ఆదాయం పెరుగుతుందని ఆమె అన్నారు

భారతదేశంలో లక్కను ప్రధానంగా ఆదివాసీలు ప్రాంతాల నుంచి వస్తున్నట్లు రాష్ట్రపతి చెప్పారుఅది గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉందని ఆమె అన్నారు. పరిశోధనకుఅభివృద్ధికి సంబంధించిన అనేక చర్యలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెంకడరీ అగ్రికల్చర్ తీసుకోవడంతో పాటుగా లక్కబంకజిగురు వంటి వాటిని వాణిజ్య సరళిలో తయారు చేస్తోందని తెలిసి తాను సంతోషిస్తున్నట్లు ఆమె చెప్పారుఈ తరహా కార్యకలాపాలలో చిన్న తరహా లక్క ప్రాసెసింగ్ యూనిట్ అభివృద్ధిఇంటిగ్రేటెడ్ లక్క శుద్ధి విభాగం, లక్క ఆధారిత స్వాభావిక రంగులువార్నిషులుసౌందర్య వర్థక ఉత్పత్తుల తయారీ, ఫలాలుకాయగూరలుమసాలా దినుసులను ఎక్కువ కాలం పాటు భద్రపరిచేందుకు ఉద్దేశించిన లక్క ఆధారిత కోటింగును అభివృద్ధిపరచడం వంటివి సైతం వీటిలో భాగంగా ఉన్నాయని ఆమె అన్నారుఈ విధమైన చర్యలన్నీ కలసి ఆదివాసీ సోదరులుసోదరీమణుల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో దోహదం చేయగలవన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

ఒక టెక్నాలజీ మరో టెక్నాలజీని అత్యంత వేగంగా మింగేస్తున్న కాలమని రాష్ట్రపతి అన్నారుమనం ఈ సాంకేతికతల తాలూకు ప్రయోజనాలను తప్పక అందిపుచ్చుకోవాలి అని ఆమె అన్నారు. అదే కాలంలోమనం వాటి తాలూకు దుష్ఫలితాల బారిన పడకుండా చర్యలను తీసుకొని తీరాలని ఆమె అన్నారు. ఎన్ఐఎస్ఎలో ఆటోమేషన్ప్లాంట్ ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటైందనిరోబోటిక్స్ఇంటర్‌నెట్ కార్యకలాపాలతో పాటు కృత్రిమ మేథను ఉపయోగించుకొని విధులను నిర్వర్తించే సామగ్రిని అభివృద్ధి పరచడంపైన ఈ విభాగం శ్రద్ధ వహిస్తోందని గమనించినప్పుడు తనకు సంతోషం కలిగిందని ఆమె అన్నారు.

 

లక్కను సాగు చేయడంలో ఎన్ఐఎస్ఎ చక్కని ఫలితాలను సాధించింది అని రాష్ట్రపతి అన్నారు.  అయితేఇప్పటికీ మనం మరింత ముందుకు సాగిపోగలిగిన రంగాలు అనేకం ఉన్నాయి అని ఆమె చెప్పారు.  ఉదాహరణకు ఔషధ రంగంతో పాటు సౌందర్య వర్థక సాధనాల ఉత్పత్తి పరిశ్రమలో కూడా అధిక నాణ్యతతో కూడిన లక్క ఉపయోగానికి గిరాకీ ఉంది అని ఆమె వివరించారుభారతదేశంలో లక్క నాణ్యతనుసరఫరా వ్యవస్థనూ, విక్రయాలను మెరుగుపరచినట్లయితే మన రైతులు లక్కను దేశవిదేశాలకు కూడా పంపగలుగుతారనీఅంతేకాక మంచి ధరలను కూడా పొందగలుగుతారని ఆమె అన్నారు.  

 

***


(Release ID: 2057301) Visitor Counter : 52