హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

ఛత్తీస్‌గఢ్ లో నక్సలైట్ల హింసకు గురైన బాధితులతో న్యూఢిల్లీ లోని తన నివాసంలో సమావేశమైన కేంద్ర హోం, సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా

నక్సలిజంతో మానవత్వానికి, దేశ ఆంతరంగిక భద్రతకు ముప్పు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి నెలకల్లా నక్సలిజాన్ని రూపుమాపుతాం


నక్సలైట్ల హక్కుల కోసం వకాల్తా పుచ్చుకునే వారు,

తీవ్రవాద బాధితుల హక్కుల గురించి ఆలోచించాలి


వామపక్ష ఉగ్రవాద ప్రాంతాల్లో ప్రజల సమగ్రాభివృద్ధికి ఒక సంపూర్ణ పథకాన్ని మోదీ ప్రభుత్వంతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మూడు నెలల లోపలే తీసుకువస్తుంది

మోదీ ప్రభుత్వ విధానాలతో వామపక్ష తీవ్రవాదం

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో కొన్ని జిల్లాలకు పరిమితం అయింది


వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించిన తరువాత, బస్తర్ మళ్ళీ సుందర, శాంతియుత, ప్రగతిశీల ప్రాంతంగా మారుతుంది

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం చేపట్టి, ‘హత్యలు చేసే వారి కన్నా ప్రాణాలను కాపాడే వారే మిన్న’ అనే సందేశాన్ని తీవ్రవాదులకు పంపిస్తోంది

హింసను విడచిపెట్టి, జనజీవన స్రవంతిలో చేరవలసిందంటూ వామపక్ష తీవ్రవాదులకు కేంద్ర హోం మంత్రి వినతి

Posted On: 20 SEP 2024 12:30PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్ నుంచి తరలి వచ్చిన వామపక్ష తీవ్రవాద బాధితులతో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు.  ఛత్తీస్‌గఢ్ లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి తీవ్రవాదుల హింసకు గురైన 55 మంది బాధితులు బస్తర్ శాంతి సంఘం ఆధ్వర్యంలో మంత్రిని కలుసుకొన్నారు.

నక్సలిజం బారిన పడిన ఛత్తీస్‌గఢ్ ప్రజల దురవస్థల గురించి ప్రముఖంగా చాటిచెప్పిన ఒక డాక్యుమెంటరీని ఈ సందర్భంగా బస్తర్ శాంతి సంఘం ప్రదర్శించింది.  బాధితులలో కొందరు వారి గోడును హోం మంత్రితో చెప్పుకున్నారు.

నక్సలైట్ల హింసాకాండకు గురైన వారితో కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ... 2026 మార్చి నెల కల్లా నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు వామపక్ష తీవ్రవాదాన్ని ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లో కొన్ని జిల్లాలకు పరిమితం చేయగలిగినట్లు మంత్రి తెలిపారునక్సలిజమ్ ఇటు మానవజాతికీఅటు దేశ ఆంతరంగిక భద్రతకూ ముప్పుగా పరిణమించిందని శ్రీ అమిత్ షా అన్నారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మూడు నెలల లోపల ఒక సమగ్ర పథకాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వంఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కలిసికట్టుగా తీసుకు వస్తాయని కూడా శ్రీ అమిత్ షా తెలిపారు.  దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాద బాధిత ప్రజలు ఈ ప్రణాళిక ద్వారా ఆరోగ్య సంరక్షణ సదుపాయాలుఉద్యోగ అవకాశాలతో పాటు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా అందుకోనున్నారని ఆయన అన్నారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం ద్వారా ఒక సందేశాన్ని ఉగ్రవాదులకు ఇచ్చిందని అన్నారు.  ప్రాణాలు తీసే వారి కన్నా ప్రాణాలను రక్షించే వారే గొప్ప వారన్నదే ఆ సందేశమని కేంద్ర హోం మంత్రి అన్నారు. నక్సలైట్ల మానవ హక్కుల సంగతేమిటంటూ వారి పక్షాన వకాల్తా పుచ్చుకొనే వ్యక్తులునక్సలిజం కారణంగా యాతన పడే వారి మానవ హక్కులను గురించి కూడా ఆలోచించాలని కేంద్ర హోం మంత్రి అన్నారు.

వామపక్ష తీవ్రవాదులు హింసామార్గంలో నడవకుండాసమాజ జనజీవన స్రవంతిలో చేరాల్సిందిగా హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.  2026 మార్చి నెల కల్లా వామపక్ష తీవ్రవాదం పూర్తిగా అంతం అవుతుందనిబస్తర్ మళ్ళీ సుందరమైందిగానుశాంతియుతమైందిగానుఅభివృద్ధి ప్రధానమైందిగాను మారగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 2057299) Visitor Counter : 24