ప్రధాన మంత్రి కార్యాలయం
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాన మంత్రి
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు: ప్రధానమంత్రి
Posted On:
17 SEP 2024 8:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రపతికి ఇచ్చిన సమాధానంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"గౌరవ @rashtrapatibhvn గారూ, మీ శుభాకాంక్షలకు హృదయపూర్వక ధన్యవాదాలు! ఆత్మ నిర్భర్, వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో మీ స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దేశం పట్ల, దేశ ప్రజల పట్ల మా కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టేది లేదు’’
ఉపరాష్ట్రపతికి సమాధానమిస్తూ ప్రధాని ఇలా అన్నారు;
''ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు, మీరందించిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. వివిధ అంశాలపై మీ లోతైన అవగాహననూ, మీ మార్గదర్శకత్వాన్నీ నేను గౌరవిస్తాను."
ప్రధాని తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 'నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై చూపుతున్న ఈ అభిమానం ప్రజల కోసం మరింత కష్టపడేందుకు నాకు అపారమైన శక్తినిస్తుంది.' అని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి 'ఎక్స్' పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు.
‘‘ప్రజల నుంచి ఇంత ఆత్మీయతను అందుకోవడం గర్వంగా, గౌరవంగా ఉంది.
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ అభిమానం ప్రజల కోసం మరింత కష్టపడేందుకు నాకు అపారమైన శక్తిని ఇస్తుంది’’
మా మూడో విడత పాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సమయం కూడా ఇదే. గత 100 రోజులుగా ప్రజానుకూల, అభివృద్ధి ఆధారిత నిర్ణయాల పరంపర కొనసాగడం నాకు సంతోషంగా ఉంది. వికసిత్ భారత్‌ను నిర్మించాలనే మా ప్రయత్నానికి ఇది బలాన్ని చేకూరుస్తుంది.
నేడు పలువురు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి స్ఫూర్తికి వందనాలు. ఈ ప్రయత్నాలకు అభినందనలు తెలుపుతున్నాను."
(Release ID: 2056246)
Visitor Counter : 32
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam