సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇ-సినీప్రమాణ్ లో ‘‘ఏక్సెసిబులిటి స్టాండర్డ్స్’’ మాడ్యూల్


వినికిడి శక్తి లోపించిన వ్యక్తులకు, దృష్టి బాధిత వ్యక్తులకు ఇకపై కనీసం ఒక సులభ విశేషాంశాన్ని అందించేటట్టుగా చలనచిత్రాలు*

Posted On: 16 SEP 2024 1:28PM by PIB Hyderabad

ముందుగా సూచించిన ప్రకారం అంటే నిన్నటి నుంచి  ఇ-సినీప్రమాణ్ లో ‘‘సౌలభ్య ప్రమాణాల’’ మాడ్యూల్  విజయవంతంగా అమలులోకి వచ్చింది. దరఖాస్తుదారులు ఇకపై వారి చలనచిత్రాలను, మార్గదర్శకాలలో వివరించిన ప్రకారం వినికిడి శక్తి లోపించిన, కంటిచూపు లేని వ్యక్తుల కోసం అవసరమైన సౌలభ్య విశేషాంశాలతో దరఖాస్తు చేయవచ్చును. ఈ మార్గదర్శక సూత్రాలు సెప్టెంబరు 15 నుంచి అమలు లోకి తీసుకు వస్తామని సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ ఈ సరికే పేర్కొంది.

నూతన మార్గదర్శక సూత్రాలు , మెరుగుపరచిన సులభతా ప్రమాణాలు -

సినిమా ను చూసే అనుభూతి ని మరింత మంది దివ్యాంగులకు చేరువగా తీసుకు పోయేందుకు, వారు ఆ అనుభవాన్ని ఇంకా సులభమైన రీతి లో పొందేందుకు ఉద్దేశించిన బాటలో సమాచార-ప్రసార శాఖ ఒక  ముందడుగు వేసింది. వినికిడి శక్తి కి నోచుకోని వ్యక్తులకు, దృశ్య జ్ఞానం లోపించిన వ్యక్తులకు సినిమా హాళ్లలో చలనచిత్రాలను ఇప్పటికన్నా మెరుగైన విధంగా ప్రదర్శించాలనే ఉద్దేశంతో తత్సంబంధిత సులభతా ప్రమాణాలను పెంచుతూ కొత్త మార్గదర్శకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్చి 15 న తన ఆఫీస్ మెమోరాండం లోజారీ చేసింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్ సి) ధ్రువీకరించే వాణిజ్య ప్రయోజనాలు కలిగిన సినిమాలు అన్నిటికీ ఈ మార్గదర్శక సూత్రాలు  వర్తిస్తాయి.  ఒకటి కన్నా ఎక్కువ భాషలలో ధ్రువీకరణ అవసరమ్యే  అన్ని చలనచిత్రాలు* శ్రవణ శక్తి కి నోచుకోనటువంటి వ్యక్తులను,దృష్టి జ్ఞానం లోపించినటువంటి వ్యక్తుల ను లెక్కలోకి తీసుకొని వారికి కనీసం ఒక సులభతా విశేషాంశాన్ని (ఏక్సెసిబులిటి ఫీచర్ ను) అయినా అందించే విధంగా, అంటే క్లోజ్డ్ కేప్షనింగ్/ఓపెన్ కేప్షనింగ్ ను గాని, శ్రవణ సంబంధి వర్ణనను గాని జత పరచవలసి ఉంటుందన్న మాట.


 

***


(Release ID: 2055423) Visitor Counter : 92