ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జార్ఖండ్- టాటానగర్ లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

జార్ఖండ్- టాటానగర్ లో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన,

ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 15 SEP 2024 1:21PM by PIB Hyderabad

జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ జీ

నా మంత్రిమండ‌లి సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్ జీఅన్నపూర్ణా దేవి జీ సంజయ్ సేథ్ జీ.. 

ఎంపీ విద్యుత్ మహతో జీరాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ జీ

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ జీఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహతో జీ

ఎమ్మెల్యేలుఇతర విశిష్ట అతిథులుసోద‌ర సోద‌రీమ‌ణులారా...

 

బాబా బైద్యనాథ్బాబా బసుకినాథ్ పాదాల‌కు నా ప్ర‌ణామాలు అర్పిస్తున్నానుగిరిజ‌న వీరుడు బిర్సా ముండాకు జ‌న్మ‌నిచ్చిన మాతృభూమికి నా వంద‌నాలుఈ రోజు చాలా శుభప్రదమైన రోజు.

జార్ఖండ్ రాష్ట్రం  ప్రస్తుతం ప్రకృతి ఆరాధనతో కూడిన కర్మ పండుగను జరుపుకుంటోంది

ఈ రోజు ఉదయం నేను రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడుకర్మ పండుగకు చిహ్నం అయిన జావాతో ఒక సోదరి నాకు స్వాగ‌తం ప‌లికారుఈ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారుకర్మ పండుగ సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఈ పవిత్రమైన రోజునజార్ఖండ్ రాష్ట్రానికి కొన్ని అభివృద్ధి పనులు అందివచ్చాయిఆరు కొత్త వందే భారత్ రైళ్లు, 650 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులుఅనుసందధాన ప్రయాణ సౌకర్యాల విస్తరణవీటితో పాటుజార్ఖండ్‌లోని వేలాది మంది ప్రజలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత పక్కాఇళ్లను పొంద‌బోతున్నారుఈ అభివృద్ధి పనులన్నింటి సంద‌ర్భంగా జార్ఖండ్ ప్రజలకు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నానుఈ వందే భారత్ రైళ్లతో అనుసంధానం కాబోతున్న రాష్ట్రాల‌న్నిటికి  కూడా నా అభినంద‌న‌లు

 

స్నేహితులారా

ఒక‌ప్పుడు ఆధునిక సౌకర్యాలుఅభివృద్ధి దేశంలోని కొన్ని నగరాలకే పరిమితంజార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఆధునిక మౌలిక సదుపాయాలు,  అభివృద్ధికి నోచుకునేవి కావుఅయితే, 'సబ్కా సాథ్సబ్కా వికాస్మంత్రం దేశ ప్ర‌జ‌ల‌ ఆలోచనా విధానాన్నీదేశ ప్రాధాన్యతలనీ మార్చిందిఇప్పుడు దేశానికి ప్రాధాన్యం పేదలుఇప్పుడు దేశానికి ప్రాధాన్యం ఆదివాసీలుదళితులుఅణగారిన వ‌ర్గాలుసమాజంలోని వెనుకబ‌డిన‌ వర్గాలేఇప్పుడుకేంద్ర‌ ప్ర‌భుత్వ  ప్రాధాన్యత మహిళలుయువతరైతులుఅందుకేజార్ఖండ్ఇతర రాష్ట్రాల మాదిరిగానే వందే భారత్ వంటి హైటెక్ రైళ్లను ఆధునిక మౌలిక సదుపాయాలను పొందుతోంది.

స్నేహితులారా 

నేడుప్రతి రాష్ట్రంనగరం వేగవంతమైన అభివృద్ధిని ఆశిస్తూ  వందే భారత్ వంటి అత్య‌ధిక వేగంతో ప్రయాణించే రైళ్లు త‌మ‌కు కూడా కావాలని కోరుకుంటున్నాయికొద్ది రోజుల కిందట ఉత్తరదక్షిణాది రాష్ట్రాల్లో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాను.

నేడువందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు టాటానగర్ నుండి పాట్నాకుటాటానగర్ నుండి ఒడిశాలోని బ్రహ్మపూర్ కురూర్కెలా నుండి టాటానగర్ మీదుగా హౌరాకు ప్రారంభ‌మ‌య్యాయిఅంతే కాదు భాగల్పూర్ నుండి దుమ్కా ద్వారా  హౌరాకుదేవ్ డ్ నుండి గయా ద్వారా వారణాసికిగయా నుండి కోడెర్మా-పరస్నాథ్ధన్‌బాద్ ద్వారా హౌరా వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి

ఈ వేదికపై గృహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగానేనేను ఈ వందే భారత్ రైళ్లకు ప‌చ్చ జెండా ఊపానుఅవి వాటి గమ్యస్థానాలకు బయలుదేరాయితూర్పు భారతదేశంలో రైల్వేల విస్తరణ ఈ మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందిఈ రైళ్ల వల్ల వ్యాపారులకువిద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందిఇది ఇక్కడ ఆర్థికసాంస్కృతిక కార్యకలాపాలను కూడా వేగవంతం చేస్తుందిమీ అంద‌రికీ తెలిసిందేదేశ‌వ్యాప్తంగానే కాకుండాప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు కాశీకి వస్తుంటారువందే భారత్ రైళ్లు కాశీ నుండి దేవ్ ఘడ్ వరకు ప్రయాణాన్ని సులభతరం చేయడంతోభ‌క్తుల్లో  చాలా మంది బాబా బైద్యనాథ్‌ను కూడా దర్శించుకుంటారుఅంతే కాదు ఇదిక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుందిటాటానగర్ దేశంలోనే ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంమంచి రవాణా సౌకర్యాలవ‌ల్ల దాని పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంత‌మ‌వుతుందిపర్యాటకపరిశ్రమల రంగాల‌కు ల‌భించే ప్రోత్సాహం కార‌ణంగా జార్ఖండ్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

 

స్నేహితులారా

అభివృద్ధి వేగవంతంకావాలంటే ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలనేవి కీలకంఅందుకే ఈ రోజు ఇక్కడ అనేక కొత్త ప్రాజెక్టులను  ప్రారంభించాంమధుపూర్ బైపాస్ లైన్‌కు శంకుస్థాపన చేశాంఇది  పూర్తయిన తర్వాతహౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్లను ఆపాల్సిన అవసరం ఉండదుబైపాస్ లైన్ అనేది గిరిడిహ్,  జసిదిహ్ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుందిఈ రోజు హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోకు శంకుస్థాపన చేశాంఇది కొత్త‌గా ప‌లు రైలు సేవలకు దోహ‌దం చేస్తుందికుర్కురియా నుండి కనారోన్ వరకు రైలు మార్గాన్ని డ‌బ్లింగ్‌ చేయడంవల్ల  జార్ఖండ్‌లో రైలు అనుసంధానం బలోపేతమ‌వుతుందిఈ  డ‌బ్లింగ్ ప‌ని పూర్తయితే ఉక్కు పరిశ్రమకు చెందిన వస్తువుల రవాణా సులువుగా సాగుతుంది

 

స్నేహితులారా

 

జార్ఖండ్ అభివృద్ధి కోసం కేంద్ర‌ప్ర‌భుత్వం త‌న‌పెట్టుబడులను పెంచింది.  పనులను వేగవంతం చేసిందిఈ ఏడాది జార్ఖండ్‌లో రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్టులో రూ.7,000 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. 10 ఏళ్ల కిందట కేటాయించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువపెరిగిన రైలు బడ్జెట్ ప్రభావాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చునేడుకొత్త రైలు మార్గాలను వేయడంఇప్పటికే ఉన్న మార్గాలను రెట్టింపు (డ‌బ్లింగ్చేయడంజార్ఖండ్ రాష్ట్ర స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.  రైల్వే మార్గాలు వంద‌ శాతం విద్యుదీకర‌ణ అయిన‌ రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఉందిఅమృత్ భారత్ స్టేషన్ పథకం కిందజార్ఖండ్‌లోని 50కి పైగా రైల్వే స్టేషన్ల‌ను పున‌రుద్ద‌రిస్తున్నాం

 

స్నేహితులారా,

ప‌క్కా గృహాల నిర్మాణం కోసం జార్ఖండ్‌లోని వేలాది మంది లబ్ధిదారులకు మొదటి విడత నిధులు విడుదల చేశాంప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేలాది మందికి పక్కా గృహాలు కూడా అందించాం.. ఇళ్లతో పాటు మరుగుదొడ్లునీరువిద్యుత్గ్యాస్ కనెక్షన్లు వంటి సౌకర్యాలు కల్పించాంఒక కుటుంబానికి సొంత ఇల్లు ల‌భిస్తేఅది వారి ఆత్మగౌరవాన్ని పెంచుతుంద‌నే విష‌యాన్ని మ‌నం గుర్తు పెట్టుకోవాలిత‌ద్వారా వారు తమ ప్ర‌స్తుత స్థితిగ‌తుల‌ను మెరుగుపరచుకోవడమే కాకుండా మంచి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారుఎలాంటి సంక్షోభం వచ్చినా స‌రే  తమకంటూ సొంత ఇల్లు ఉందని వారు భావిస్తారుప్రధానమంత్రి ఆవాస్ యోజనతోజార్ఖండ్ ప్రజలు శాశ్వత గృహాలను పొందుతున్నారుఅంతే కాకుండా ఈ ప‌థ‌కంద్వారా  గ్రామాలు,  నగరాల్లో అనేక ఉపాధి అవకాశాల క‌ల్ప‌న జ‌రుగుతోంది

 

స్నేహితులారా

2014 నుండిదేశంలోని పేదలుదళితులునిరుపేదలు,  గిరిజన కుటుంబాల సాధికారత కోసం అనేక కీల‌క‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకున్నాంజార్ఖండ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సోద‌ర సోదరీమణుల కోసం పీఎం జ‌న్ మ‌న్ ( PM JANMAN ) పథకం అమలు చేస్తున్నాంఅత్యంత వెనుకబడిన గిరిజనుల సంక్షేమ‌మే ఈ పథకం లక్ష్యంఈ కుటుంబాలకు ఇళ్లురోడ్లుకరెంటుమంచినీరువిద్య అందించడానికి అధికారులు స్వయంగా అక్కడికి చేరుకుంటున్నారుఈ ప్రయత్నాలు ‘విక‌సిత్ జార్ఖండ్సాధ‌న‌ కోసం మేం క‌న‌బ‌రుస్తున్న‌ నిబద్ధతలో భాగంఅందరి దీవెనలతో ఖచ్చితంగా ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌నిజార్ఖండ్ కలలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నానుఈ కార్యక్రమం తరువాతనేను మరొక భారీ బహిరంగ సభకు వెళ్తున్నానునేను 5-10 నిమిషాలలో అక్కడికి చేరుకుంటానుఅక్కడ నా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారుజార్ఖండ్‌కు సంబంధించిన ఇతర అంశాలను అక్కడ వివరంగా చర్చిస్తానుకానీజార్ఖండ్ ప్రజల నుండి క్షమాపణలు కోరుతున్నానుఎందుకంటే నేను రాంచీకి చేరుకున్నప్పటికీ ప్రకృతి సహకరించలేదుఅందువల్ల నేను ఇక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరలేక పోతున్నానుదాంతో నేను అక్కడికి చేరుకోలేకపోతున్నానుఅందుకే ఈ కార్యక్రమాలన్నింటిని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నానునేను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ సభలో ప్రసంగిస్తానుమరోసారి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలునమస్కారం.

 

***



(Release ID: 2055308) Visitor Counter : 30