హోం మంత్రిత్వ శాఖ
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును
‘‘శ్రీ విజయపురం’’ గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయం.
చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
వలసపాలనకు గుర్తుగా నిలిచిన వాటినుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి పొందిన ప్రేరణతో, పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయ పురం గా మార్చాలని నిర్ణయించాం
ఇంతకుముందున్న పేరు వలసపాలన నుంచి వచ్చింది కాగా, శ్రీ విజయపురం అనేది స్వాతంత్ర్య పోరాటంలో మనం సాధించిన విజయం, ఆ పోరాటంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకు ప్రతిరూపంగా నిలుస్తుంది
మన స్వాతంత్ర్యోద్యమ పోరాటం, చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు తిరుగులేని స్థానం ఉంది
ఒకప్పుడు చోళ సామాజ్యంలో, ఈ దీవులు నౌకా స్థావరంగా ఉండగా ,ఇప్పుడు ఇవి మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకంగా మారాయి
Posted On:
13 SEP 2024 6:18PM by PIB Hyderabad
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించారు. సామాజిక మాధ్యమం– ‘’ఎక్స్’ ‘ వేదికగా ఆయన ఈ విషయం వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ప్రేరణపొంది, వలసపాలన గుర్తులనుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, పోర్ట్ బ్లెయిర్ పేరును “శ్రీ విజయపురం’’గా మార్చేందుకు నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు.
ఇంతకుముందుగల పేరు వలస పాలన నుంచి వచ్చింది కాగా, శ్రీ విజయ పురం అనే పేరు, మనం మన స్వాతంత్ర్యోద్యమంలో సాధించిన విజయానికి, అందులోనూ స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్ నికోబార్ దీవుల ప్రత్యేక పాత్రకూ నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులకు మన స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో తిరుగులేని స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ దీవులు చోళ సామ్రాజ్యంలో నౌకా స్థావరంగా ఉండగా ,ఇప్పుడు ఇవి మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకంగా మారాయని తెలిపారు.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మన త్రివర్ణ పతాకాన్ని తొలిసారిగా ఆవిష్కరించిన ప్రదేశం కూడా ఇదేనని, అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం వీర సావర్కర్జీ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడి సెల్యులార్ జైలులో ఎన్నో కష్టాలు అనుభవించారని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు.
***
(Release ID: 2055132)
Visitor Counter : 81
Read this release in:
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam