ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంజనీర్ల దినోత్సవం నేపథ్యంలో సర్ ఎం.విశ్వేశ్వరాయకు ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 15 SEP 2024 8:34AM by PIB Hyderabad

   ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సర్ ఎం.విశ్వేశ్వరాయ దేశానికి చేసిన సేవలను స్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. అలాగే దేశవ్యాప్తంగాగల ఇంజనీర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా పంపిన సందేశంలో:

‘‘ఇంజనీర్ల దినోత్సవం నేపథ్యంలో ప్రతి రంగంలోనూ ఆవిష్కరణల ద్వారా సంక్లిష్ట సవాళ్లను పరిష్కరిస్తూ దేశ ప్రగతికి సారథ్యం వహిస్తున్న ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ రంగంలో దేశానికి అమూల్య సేవలతో జగమెరిగిన సర్ ఎం.విశ్వేశ్వరాయను గౌరవ పురస్సరంగా సర్మించుకుంటున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

MJPS/TS


(रिलीज़ आईडी: 2055103) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam