మంత్రిమండలి
azadi ka amrit mahotsav

మరింత పర్యావరణ అనుకూల భారత్‌... 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం


రెండేళ్లలో రూ.2,000 కోట్లతో ఈ పథకం అమలు

తీవ్రమైన వాతావరణ అంశాలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో
మరింత ఊతమివ్వనున్న మిషన్

ఆధునిక సెన్సార్‌లు, అధిక-పనితీరు ప్రదర్శించ గల సూపర్ కంప్యూటర్‌లతో అత్యాధునిక
రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థల ఏర్పాటు

Posted On: 11 SEP 2024 8:18PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానంగా అమలు చేసే ఈ మిషన్ మౌసమ్, దేశ వాతావరణ సంబంధిత శాస్త్ర, పరిశోధన, సేవలను అద్భుతంగా పెంచడానికి బహుముఖ, పరివర్తనాత్మక చొరవగా ఉంటుంది. తీవ్రమైన వాతావరణ ఘటనలు, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడంలో పౌరులు, చిట్ట చివరి వినియోగదారులతో సహా వాటాదారులను మరింత సన్నద్ధం చేయడానికి ఇది సహాయపడుతుంది. దీర్ఘకాలంలో ప్రజా సమూహాలు, సంబంధిత రంగాలు, అనుబంధ వ్యవస్థలూ తమ సామర్ధ్యాన్ని పెంచుకునేందుకూ, ప్రతికూలతలను తట్టుకునేందుకు అవసరమైన సానుకూల ఫలితాలను అందించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుంది.

మిషన్ మౌసమ్ లో భాగంగా దేశం, వాతావరణ శాస్త్రాలలో ముఖ్యంగా వాతావరణ నిఘా, మోడలింగ్, ముందస్తు హెచ్చరిక, నిర్వహణలో పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యాన్ని విశేషంగా వివరిస్తుంది. అధునాతన అబ్జర్వేషన్ సిస్టమ్స్, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఏకీకృతం చేయడం ద్వారా, మిషన్ మౌసమ్ వాతావరణాన్ని అధిక కచ్చితత్వంతో అంచనా వేయడానికి కొత్త ప్రమాణాలను నిర్ధారిస్తుంది.

రుతుపవనాల అంచనాలు, గాలి నాణ్యతకు సంబంధించిన హెచ్చరికలు, విపరీత వాతావరణ సంఘటనలు, తుఫానులు, పొగమంచు, వడగళ్ళు గురించి కచ్చితత్వంతో పరిశీలనలు జరుపుతుంది. వర్షం అంచనాలను వాతావరణ జోక్యాలతో సహా అత్యంత కచ్చితమైన, సమయానుకూల వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. ఇందుకు పరిశీలనలు, అవగాహనను మెరుగుపరచడంపై ఈ మిషన్ దృష్టి పెడుతుంది. మిషన్ మౌసమ్ కీలకమైన అంశాలలో...  ఆధునిక సెన్సార్‌లు, అధిక-పనితీరు గల సూపర్‌కంప్యూటర్‌లతో తదుపరి తరం రాడార్లు, ఉపగ్రహ వ్యవస్థల విస్తరణ ఉన్నాయి. అలాగే మెరుగైన భూ విజ్ఞాన శాస్త్ర నమూనాల అభివృద్ధి, రియల్ టైం డేటా వ్యాప్తి కోసం జిఐఎస్-ఆధారిత ఆటోమేటెడ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఈ మిషన్ లో పొందుపరిచారు.

మిషన్ మౌసమ్... వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ, పర్యావరణం, విమానయానం, నీటి వనరులు, విద్యుత్తు, పర్యాటకం, షిప్పింగ్, రవాణా, ఇంధనం, ఆరోగ్యం వంటి అనేక రంగాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది పట్టణ ప్రణాళిక, రోడ్డు, రైలు రవాణా, ఆఫ్‌షోర్ కార్యకలాపాలు, పర్యావరణ పర్యవేక్షణ వంటి అంశాలలో డేటా ఆధారిత నిర్ణయాలను మెరుగుపరుస్తుంది.

భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన మూడు సంస్థలు:

ప్రధానంగా భారత వాతావరణ విభాగం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్, మిషన్ మౌసమ్‌ను అమలు చేస్తాయి. ఈ సంస్థలకు ఇతర ఎంఓఈఎస్ సంస్థలు (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ) సహకరిస్తాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, అకాడెమియా, పరిశ్రమల సహకారంతో క్లైమేట్ సైన్సెస్, సర్వీసులు దేశ ప్రాబల్యాన్ని చాటి చెబుతాయి.

 

*****


(Release ID: 2054001) Visitor Counter : 202