హోం మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా దేశంలో సురక్షిత సైబర్ ప్రపంచాన్ని ఆవిష్కరించడానికి కట్టుబడి ఉన్నాం: కేంద్ర హోం - సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు అనేక చర్యలను తీసుకున్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి)
‘సైబర్ - సెక్యూర్ భారత్’ ను ఆవిష్కరించే ఉద్యమాన్ని వేగవంతం చేయడంలో చురుకైన పాత్రను పోషిస్తున్నందుకు ప్రముఖ నటుడు శ్రీ అమితాబ్ బచ్చన్ కు కేంద్ర హోం మంత్రి కృతజ్ఞతలు
దేశంలో సైబర్ క్రైమ్ ను అరికట్టడానికి ఐ4సి పట్టువిడవక శ్రమిస్తోందని వీడియో సందేశంలో తెలిపిన శ్రీ అమితాబ్ బచ్చన్
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఈ ఉద్యమంలో చేరాను: శ్రీ అమితాబ్ బచ్చన్
Posted On:
11 SEP 2024 3:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణానికి అనుగుణంగా, దేశంలో ఒక భద్రమైన సైబర్ జగతిని ఆవిష్కరించడానికి కేంద్ర హోం శాఖ శ్రమిస్తోందని హోం - సహకార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు.
ఈ దిశలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) అనేక చర్యలను చేపట్టిందని సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో శ్రీ అమిత్ షా తెలిపారు. సురక్షితమైన సైబర్ భారత్ ను నిర్మించే ఉద్యమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకుపోవడంలో చురుకైన పాత్రను పోషిస్తున్నందుకు ప్రముఖ నటుడు శ్రీ అమితాభ్ బచ్చన్ కు ధన్యవాదాలను కేంద్ర హోం మంత్రి తెలియజేశారు.
మెగాస్టార్ శ్రీ అమితాబ్ బచ్చన్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, దేశంలో సైబర్ సంబంధిత అపరాధాలు అంతకంతకు పెరిగి పోతున్నాయని, సైబర్ లోకం స్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. సైబర్ సంబంధిత నేరాలను అడ్డుకోవడానికి హోం శాఖ ఆధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పట్టు విడువక పాటుపడుతోందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా విజ్ఞప్తి చేసినందువల్ల ఈ ఉద్యమంలో తాను చేరినట్లు శ్రీ అమితాభ్ బచ్చన్ వెల్లడించారు. దేశాన్ని ఈ సమస్య బారి నుండి విముక్తం చేయడానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అని ఆయన అన్నారు. మనం కాస్తంత అప్రమత్తత తోను, ముందు జాగ్రత ధోరణి తోను వ్యవహరించామంటే గనక సైబర్ క్రిమినల్స్ వల లో చిక్కుకోకుండా మనను మనం కాపాడుకోవచ్చు అని శ్రీ అమితాభ్ బచ్చన్ అన్నారు.
***
(Release ID: 2053999)
Visitor Counter : 63
Read this release in:
Khasi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam