ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అబుధాబి యువరాజుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం


భారత్-యూఏఈ సంబంధాల బలోపేతానికి ఇరు నేతల చర్చలు

प्रविष्टि तिथि: 09 SEP 2024 8:40PM by PIB Hyderabad


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపారు.

భారత్-యూఏఈ మైత్రిని పెంపొందించేందుకు షేక్ ఖలీద్ చూపిన కృషిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు.

ప్రధానమంత్రి ఎక్స్ పోస్టులో;

'అబుధాబి యువరాజు హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. భారత్-యూఏఈ మధ్య బలమైన స్నేహం పట్ల ఆయనకున్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది.'


(रिलीज़ आईडी: 2053407) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam