ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

బ్రూనై సుల్తానుతో సమావేశం సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఆంగ్ల పాఠానికి అనువాదం

Posted On: 04 SEP 2024 3:18PM by PIB Hyderabad

రాజు గారు,

సాదర వచనాలతో స్వాగతించి, ఘనంగా ఆతిథ్యమిచ్చిన మీకు, రాజ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.

 

ముందుగా, 40వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీకుబ్రూనై ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

రాజు గారు,

మన దేశాల మధ్య శతాబ్ధాలుగా సాంస్కృతిక సంబంధాలున్నాయి. ఈ ఉన్నతమైన సాంస్కృతిక సంప్రదాయాలే మన స్నేహానికి పునాది. మీ నాయకత్వంలో మన సంబంధాలు దినదిన ప్రవర్ధమానమవుతున్నాయి. 2018 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా మీ భారత సందర్శనను దేశ ప్రజలు ఇప్పటికీ ప్రేమాభిమానాలతో గుర్తుంచుకున్నారు.

రాజు గారు,

నా పదవీకాలం మూడో దఫా ప్రారంభంలో బ్రూనైని సందర్శించి, భవిష్యత్తు విషయాలను మీతో చర్చించడానికి నాకు అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకోవడం శుభపరిణామం. భారత యాక్ట్ ఈస్ట్ విధానంఇండో పసిఫిక్ దార్శనికతలో బ్రూనై ముఖ్య భాగస్వామి కావడం ఉజ్వల భవిష్యత్తుకు హామీగా భావిస్తున్నాంమన మనోభావాలను పరస్పరం గౌరవించుకుంటాం. ఈ పర్యటన, మన చర్చలు భవిష్యత్తులో మన సంబంధాలను వ్యూహాత్మకంగా నిర్దేశిస్తాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ సందర్భంగా మరోసారి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

***



(Release ID: 2051978) Visitor Counter : 28