రాష్ట్రపతి సచివాలయం
అమృత్ ఉద్యాన్‌లోకి రేపు ఉపాధ్యాయులకు ప్రత్యేక ప్రవేశం
Posted On:
04 SEP 2024 5:42PM by PIB Hyderabad
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపు (సెప్టెంబర్ 5న) ఉపాధ్యాయులందరి కోసం కోసం అమృత్ ఉద్యాన్‌లోకి ప్రత్యేక ప్రవేశం ఉంటుంది. నార్త్ అవెన్యూ సమీపంలోని రాష్ట్రపతి భవన్ 35వ ద్వారం నుండి వారికి ప్రవేశం ఉంటుంది. వారి సౌకర్యార్థం కేంద్ర సచివాలయ మెట్రో స్టేషన్ నుండి 35వ ద్వారం వరకు షటిల్ బస్ సర్వీస్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్‌కు సోమవారాలు మినహా ఆగస్టు 16 నుండి ఈనెల 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది.
ప్రవేశం ఉచితం. సందర్శకులు ఆన్లైన్లో రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ (https://visit.rashtrapatibhavan.gov.in/) ద్వారా వారి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. నేరుగా వచ్చే సందర్శకులు 35వ ద్వారం బయట ఏర్పాటు చేసిన స్వయం సేవా కేంద్రాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలి.
ఈ ఏడాది నేటి వరకు 1.5 లక్షల మంది సందర్శకులు అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఎడిషన్‌ను సందర్శించారు. పర్యటన సమయంలో పర్యావరణం పట్ల అవగాహన కోసం సందర్శకులకు సీడ్ పేపర్ అందిస్తారు.
***
(Release ID: 2051953)
Visitor Counter : 52