ప్రధాన మంత్రి కార్యాలయం
బందర్ శేరి బెగావన్ లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించిన ప్రధాని
Posted On:
03 SEP 2024 8:07PM by PIB Hyderabad
బందర్ శేరి బెగావన్ లోని ప్రసిద్ధ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. బ్రూనై ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హాజీ మహమ్మద్ ఇషామ్ తో కలిసి ఆ దేశ మత వ్యవహారాల మంత్రి హెచ్‌ఈ పెహిన్ దాటో ఉస్తాజ్ హాజీ అవాంగ్ బదరుద్దీన్ ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి భారతీయులు కూడా వచ్చి ప్రధానిని కలిశారు.
ఈ మసీదుకు బ్రూనై 28వ సుల్తాన్ (ఈ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రస్తుత సుల్తాన్ తండ్రి) మూడో ఒమర్ అలీ సైఫుద్దీన్ పేరు పెట్టారు. ఇది 1958 లో పూర్తయింది.
(Release ID: 2051553)
Visitor Counter : 92
Read this release in:
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Malayalam