ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధికారిక పర్యటన నిమిత్తం బ్రూనై చేరుకున్న ప్రధాని

प्रविष्टि तिथि: 03 SEP 2024 3:46PM by PIB Hyderabad

బ్రూనై రాజు సుల్తాన్ హజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు  బందార్ సేరి బెగావన్ చేరుకున్నారు.

భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి పర్యటన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది.

బందార్ సేరి బెగావన్‌ చేరుకున్న ప్రధానమంత్రికి బ్రూనై యువరాజు, సీనియర్ మంత్రి  ప్రిన్స్ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు.

భారత్ ‘యాక్ట్ ఈస్ట్’ విధానం, ఇండో-పసిఫిక్ విజన్‌లో బ్రూనై కీలక భాగస్వామి. ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలను పరస్పర గౌరవం, అవగాహనతో భారత్, బ్రూనై స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నాయి. శతాబ్దాలుగా రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయ సంబంధాలున్నాయి.


(रिलीज़ आईडी: 2051364) आगंतुक पटल : 106
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam