ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ పారాలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన శీతల్ దేవి, రాకేశ్ కుమార్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
प्रविष्टि तिथि:
02 SEP 2024 11:40PM by PIB Hyderabad
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని క్రీడాకారులు శీతల్ దేవి గారు, రాకేశ్ కుమార్ లు సంఘటిత స్ఫూర్తిని చాటిచెప్పారంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘సంఘటిత శ్రమ జయించింది.
మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ ఆర్చరీ పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భంగా శీతల్ దేవికి, రాకేశ్ కుమార్ కు ఇవే అభినందనలు. వారు ప్రశంసనీయ కౌశలాన్ని, దృఢసంకల్పాన్ని కనబరిచారు. ఈ అసాధారణ కార్యసాధనను చూసి భారతదేశం సంతోషిస్తోంది.
చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat).’’
(रिलीज़ आईडी: 2051245)
आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam