ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ లో జావెలిన్ పోటీలో శ్రీ సుమిత్ అంతిల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
03 SEP 2024 12:01AM by PIB Hyderabad
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ సుమిత్ ది అసాధారణ ప్రదర్శన. పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు ఆయనకు ఇవే అభినందనలు. ఆయన అసాధారణ దృఢత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని చాటారు. రానున్న కాలంలో ఆయన పాలుపంచుకొనే పోటీలలో రాణించాలని నేను కోరుకుంటున్నాను.
శ్రీ సుమిత్ అంతిల్, చీర్ ఫర్ భారత్ (@sumit_javelin #Cheer4Bharat).’’
***
MJPS/RT
(రిలీజ్ ఐడి: 2051244)
సందర్శకుల సూచీ సంఖ్య : : 87
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam