ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారత్,రష్యాల ప్రత్యేక, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచడానికి తీసుకోదగ్గ చర్యలపై ఇద్దరు నేతల చర్చలు

ఉక్రెయిన్ లో తన పర్యటన విశేషాలను వెల్లడించిన ప్రధాన మంత్రి; రష్యా, ఉక్రెయిన్ ల సమస్యకు చర్చలు, దౌత్యాలే సరైన పరిష్కారం

Posted On: 27 AUG 2024 3:13PM by PIB Hyderabad

రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.

 

భారత్- రష్యా 22వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా కిందటి నెలలో తాను చేపట్టిన రష్యా పర్యటన విజయవంతం అయిన సంగతిని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చారు.

అనేక ద్వైపాక్షిక అంశాలలో చోటు చేసుకొన్న పురోగతిని నేతలు ఇద్దరూ సమీక్షించారు. భారత్ రష్యాల మధ్య అమలవుతున్న ప్రత్యేక, విశేషాధికారాలతో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి చేపట్టదగ్గ చర్యలపైన కూడా వారు చర్చించారు.

పరస్పర ప్రయోజనం ఉన్న అనేక ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపై కూడా వారివురూ మాట్లాడుకున్నారు.

ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న రష్యా-ఉక్రెయిన్ ఘర్షణపై నేతలిద్దరూ తమ అభిప్రాయాలను ఒకరితోనొకరు పంచుకున్నారు. ఉక్రెయిన్ ను ఇటీవల తాను సందర్శించినప్పటి విషయాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఘర్షణకు స్వస్తి పలికేందుకు- చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ప్రాధాన్యతను వివరిస్తూనే, అన్నిభాగస్వామ్య పక్షాలూ, కట్టుబాటుతో కూడిన శాంతియుత పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. తరచూ మాట్లాడుకునేందుకు కూడా ఉభయులూ అంగీకరించారు.

 

***



(Release ID: 2049172) Visitor Counter : 14