హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పోలీసు, అగ్నిమాప‌క‌, హోంగార్డు, సివిల్ డిఫెన్స్‌, క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీసెస్‌కు చెందిన 1037 మందికి శౌర్య‌/సేవా ప‌త‌కాలు

Posted On: 14 AUG 2024 9:25AM by PIB Hyderabad

పోలీసు, అగ్నిమాప‌క‌, హోంగార్డు, సివిల్ డిఫెన్స్‌(హెచ్‌జీ ఆండ్ సీడీ), క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీసుల‌కు చెందిన 1037 మంది సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా శౌర్య‌, సేవా ప‌త‌కాలు ల‌భించాయి. వివ‌రాలు ఇలా ఉన్నాయి:-

 

1. శౌర్య‌ ప‌త‌కాలు

 

ప‌త‌కాల పేరు

 

ఇచ్చిన ప‌త‌కాల సంఖ్య‌

రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌తకం(పీఎంజీ)

01

శౌర్య ప‌త‌కం(జీఎం)

213*

 

*పోలీసు సేవలు - 208, అగ్నిమాప‌క సేవ‌లు - 04, హోంగార్డు, సివిల్ డిఫెన్స్‌-01

ప్రాణాలు, ఆస్తుల‌ను కాపాడ‌టంలో, నేరాల‌ను నిరోధించ‌డంలో లేదా నేర‌స్తుల‌ను అరెస్టు చేయ‌డానికి విధి నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌ద‌ర్శించిన శౌర్యం, తెగువ ఆధారంగా రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం(పీఎంజీ), శౌర్య ప‌త‌కం(జీఎం) అందిస్తారు.

రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం(పీఎంజీ)

తెలంగాణ పోలీసు శాఖ‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ చ‌దువు యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం ల‌భించింది. 25.07.2022 నాడు జ‌రిగిన‌ ఓ దోపిడీ కేసులో ఆయ‌న అరుదైన శౌర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. గొలుసు దొంగ‌త‌నాలు, అక్ర‌మ ఆయుధాల వ్యాపారానికి పాల్ప‌డిన ఇషాన్ నిరంజ‌న్ నీలంన‌ల్లి, రాహుల్ అనే ఇద్ద‌రు పేరుమోసిన దుండ‌గుల‌ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, 26.07.2022 నాడు ఈ నేర‌స్థులు క‌త్తితో శ్రీ చ‌దువు యాద‌య్య‌పై దాడికి పాల్ప‌డి, ఛాతి, వీపు, క‌డుపు, ఎడ‌మ చేతిపై పొడిచారు. దీంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలై ర‌క్త‌స్రావం అయ్యింది. తీవ్ర గాయాలు అయిన‌ప్ప‌టికీ ఆయ‌న దుండ‌గుల‌ను ప‌ట్టుకొనే ఉండ‌టం వ‌ల్ల వీరిని అరెస్టు చేయ‌డం సాధ్య‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో శ్రీ యాద‌య్య 17 రోజుల పాటు ఆసుప‌త్రి పాల‌య్యారు.

 

తెలంగాణ పోలీసు శాఖ‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీ చ‌దువు యాద‌య్య‌కు రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌త‌కం ల‌భించింది. 25.07.2022 న  జ‌రిగిన‌ ఓ దోపిడీ కేసులో ఆయ‌న అరుదైన శౌర్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. గొలుసు దొంగ‌త‌నాలు, అక్ర‌మ ఆయుధాల వ్యాపారానికి పాల్ప‌డిన ఇషాన్ నిరంజ‌న్ నీలంన‌ల్లి, రాహుల్ అనే ఇద్ద‌రు పేరుమోసిన దుండ‌గుల‌ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, 26.07.2022 న  ఈ నేర‌స్థులు క‌త్తితో శ్రీ చ‌దువు యాద‌య్య‌పై దాడికి పాల్ప‌డి, ఛాతి, వీపు, క‌డుపు, ఎడ‌మ చేతిపై పొడిచారు. దీంతో ఆయ‌న‌కు తీవ్ర గాయాలై ర‌క్త‌స్రావం అయ్యింది. తీవ్ర గాయాలు అయిన‌ప్ప‌టికీ ఆయ‌న దుండ‌గుల‌ను ప‌ట్టుకొనే ఉండ‌టం వ‌ల్ల వీరిని అరెస్టు చేయ‌డం సాధ్య‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో శ్రీ యాద‌య్య 17 రోజుల పాటు ఆసుప‌త్రి పాల‌య్యారు.

 

213 శౌర్య ప‌త‌కాల(జీఎం)లో పోలీసు సిబ్బందికి 208 ద‌క్కాయి. జ‌మ్ము క‌శ్మీర్ పోలీసు శాఖ‌కు చెందిన 31 మందికి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 17 మందికి, మ‌హారాష్ట్ర‌కు చెందిన 17 మందికి, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన 15 మందికి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన 12 మందికి, జార్ఖండ్‌, పంజాబ్‌, తెలంగాణ నుంచి ఏడుగురికి చొప్పున‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 53 మందికి, ఎస్ఎస్‌బీకి చెందిన 14 మందికి, సీఐఎస్ఎఫ్‌కు చెందిన 10 మందికి, బీఎస్ఎఫ్‌కు చెందిన ఆరుగురికి, మిగ‌తా ప‌త‌కాలు ఇత‌ర రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు, సీఏపీఎఫ్‌ల‌కు చెందిన సిబ్బందికి ద‌క్కాయి. ఢిల్లీ అగ్నిమాప‌క శాఖ సిబ్బందికి మూడు, జార్ఖండ్ వారికి ఒక‌టి, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ హెచ్‌జీ ఆండ్ సీడీ విభాగానికి చెందిన ఒక‌రికి సైతం శౌర్య ప‌త‌కాలు లభించాయి.

సేవా ప‌త‌కాలు

విధి నిర్వ‌హ‌ణ‌లో అందించిన విశిష్ట సేవ‌కు రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా ప‌త‌కం(పీఎస్ఎం), విలువైన సేవ‌కు  ప్ర‌తిభాపూర్వ‌క‌ సేవా ప‌త‌కం(ఎంఎస్ఎం) ఇస్తారు.


94 రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా ప‌తకాల‌లో(పీఎస్ఎం) 75 మంది పోలీసు సేవ‌ల‌కు, ఎనిమిది అగ్నిమాప‌క‌, ఎనిమిది సివిల్ డిఫెన్స్ ఆండ్ హోంగార్డు స‌ర్వీస్‌కు, మూడు క‌రెక్ష‌న‌ల్ స‌ర్వీస్‌కు ద‌క్కాయి. 729 ప్ర‌తిభాపూర్వ‌క‌ సేవా ప‌త‌కాలో(ఎంఎస్ఎం) 624 పోలీసు సేవ‌ల‌కు, 47 అగ్నిమాప‌క‌, 47 సివిల్ డిఫెన్స్ ఆండ్ హోం గార్డు స‌ర్వీస్‌, 11 క‌రెక్ష‌న‌ల్ సేవ‌ల‌కు ద‌క్కాయి.


ప‌త‌కాల గ్ర‌హీత‌ల వివ‌రాల జాబితా కింద ఉంది:


సీరియ‌ల్ నెం.

స‌బ్జెక్ట్‌

 

గ్ర‌హీత‌ల సంఖ్య‌

అనుబంధం

 

1

రాష్ట్ర‌ప‌తి శౌర్య ప‌తకం(పీఎంజీ)

01

జాబితా-I

2

శౌర్య ప‌త‌కం(జీఎం)

213

జాబితా-II

 

3

రాష్ట్ర‌ప‌తి విశిష్ట సేవా ప‌త‌కం(పీఎస్ఎం)

94

జాబితా-III

4

 ప్ర‌తిభాపూర్వ‌క‌ సేవా ప‌త‌కం(ఎంఎస్ఎం)

729

జాబితా-IV

 

5

రాష్ట్రాల‌వారీగా, బ‌ల‌గాల‌వారీగా ప‌త‌కాల గ్ర‌హీత‌ల వివ‌రాలు

జాబితాలో ఉన్న‌ట్టుగా

జాబితా -V

 

****


(Release ID: 2045175) Visitor Counter : 88