జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘పదో జాతీయ చేతిమగ్గం దినం’ సందర్భంగా 2024 ఆగస్టు 7న వేడుకలు


న్యూ ఢిల్లీ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సంత్ కబీర్ పురస్కారాలను, జాతీయ చేతిమగ్గం పురస్కారాలను ప్రదానం చేయనున్న ఉప రాష్ట్రపతి

ఈ సందర్భంగా దేశం అంతటా వేడుకల నిర్వహణ

Posted On: 06 AUG 2024 2:05PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో 2024 ఆగస్టు 7వ తేదీన పదో జాతీయ చేతిమగ్గం దినోత్సవా’న్ని పాటించనున్నారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా భారతదేశ మాన్య ఉప రాష్ట్రపతి హాజరు కానున్నారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్విదేశీ వ్యవహారాలుజౌళి శాఖ సహాయ మంత్రి శ్రీ పబిత్ర మార్గెరీటా లు పాల్గొననున్నారు.  పార్లమెంటు సభ్యులుప్రముఖులుడిజైనర్ లుపరిశ్రమ ప్రతినిధులుఎగుమతిదారులుప్రభుత్వ సీనియర్ అధికారులతో పాటు దేశవ్యాప్తంగా సుమారు ఒక వేయి మందికి పైగా నేతకారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.

 

 

 

చేతిమగ్గం రంగానికి విశిష్ట తోడ్పాటును అందించిన చేతిమగ్గం వృత్తిదారులకు సంత్ కబీర్ పురస్కారాలనుజాతీయ చేతిమగ్గం పురస్కారాలను ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదానం చేయనున్నారు.  ‘‘పరంపర - సస్‌టేనబిలిటీ ఇన్ హేండ్లూమ్ ట్రెడిషన్స్  ఆఫ్ ఇండియా’ పేరుతో తీసుకువచ్చిన అవార్డు కేటలాగ్కాఫీ టేబుల్ బుక్ ను భారతదేశం మాన్య ఉప రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు.

 

 

 

గౌరవనీయ ప్రధాన మంత్రి దృష్టికోణానికి అనుగుణంగా ప్రభుత్వం జాతీయ చేతిమగ్గం దినోత్సవాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది.  ఈ దినోత్సవాన్ని మొదటిసారి 2015 ఆగస్టు 7న నిర్వహించారు.  ఈ తేదీని ప్రత్యేకంగా స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకోవడానికి ఎంచుకోవడమైంది. స్వదేశీ ఉద్యమాన్ని 1905 లో ఆగస్టు 7న దేశీయ పరిశ్రమలనుమరీ ముఖ్యంగా చేతినేత మగ్గం వృత్తిదారులను ప్రోత్సహించడం కోసం ఆరంభించడమైంది.    

 

 

 

భారతదేశంలో చేతినేత మగ్గం వృత్తిదారులను సమ్మానించడానికిప్రోత్సహించడానికి జాతీయ చేతినేత మగ్గం దినాన్ని లక్షించారు. దీనితో పాటు చేనేత పరిశ్రమకు ప్రేరణనుగౌరవ భావనను అందించడందేశ సాంస్కృతిక, సాంప్రదాయికఆర్థిక రంగాలకు చేనేతమగ్గం పరిశ్రమ తోడ్పాటును ప్రశంసించడం ఈ దినోత్సవం ధ్యేయం. ఈ వేడుకల కార్యక్రమం ఉద్దేశ్యం చేనేత మగ్గం రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్నిదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఈ రంగం తోడ్పాటును గురించిన చైతన్యాన్ని ప్రోది చేయడం ఈ వేడుకల లక్ష్యం.

 

 

 

పదో జాతీయ చేనేత మగ్గం దినోత్సవాలలో భాగంగా, దేశమంతటా అన్ని రాష్ట్రాలలో/కేంద్ర పాలిత ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది.  ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలుడెవలప్‌మెంట్ కమిషనర్ (హేండ్ లూమ్) కార్యాలయం పర్యవేక్షణలో నడిచే వీవర్ సర్వీస్ సెంటర్ లుచేనేత మగ్గాల సర్వోన్నత సంస్థలునేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్ టి)ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హేండ్ లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టి) వంటి విద్య సంస్థలతో పాటు నేషనల్ హేండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్నేషనల్ క్రాఫ్ట్ స్ మ్యూజియమ్  వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి.  ప్రధాన కార్యక్రమాలలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

 

  • మైగవ్ (My Gov) పోర్టల్ ద్వారా సామాజిక మాధ్యమ ప్రధానమైన ప్రచార ఉద్యమం: దీనిలో భాగంగా ప్రతిజ్ఞసెల్ఫీలుసావనీర్ ను డిజైన్ చేయడంక్విజ్ పోటీ ఉంటాయి.

 

  • విరాసత్: న్యూ ఢిల్లీలోని హేండ్లూమ్ హాట్ లో చేతినేత ఉత్పాదనల ప్రత్యేక ప్రదర్శన- అనేక ఇతివృత్త ప్రధానమైన సామగ్రి ప్రదర్శనతో పాటు లైవ్ డెమాన్‌స్ట్రేషన్ ఉంటుంది (విరాసత్ ఈ నెల 3న మొదలైందిఈ నెల 16వ తేదీ వరకు కొనసాగనుంది)

 

 

·         విరాసత్ - దిల్లీ హాట్- ఐఎన్ఎ  లో ఎక్స్‌క్లూజివ్ ఎగ్జిబిషన్.. (ఇది ఈ నెల 1న మొదలైందిఈ ప్రదర్శన ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది)

 

  • స్పెషల్ సోర్సింగ్ షో (బి2బి): దీనిని హేండ్ లూమ్ ఎక్స్‌ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వారాణసీ లో ఏర్పాటు చేయనుంది.  (ఇది ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొనసాగనుంది)

 

  • క్రాఫ్ట్ స్ మ్యూజియమ్ లో ‘నో యువర్ వీవ్స్ ఈవెంట్ (ఇది ఈ నెల 1న మొదలైందిఈ నెల 14 తేదీ వరకు కొనసాగనుంది) - భారతదేశం చేనేతలను గురించి విద్యార్థులకు న అవగాహన కలిగించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.  ఢిల్లీలో సుమారు 10,000 మంది వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

  • దేశవ్యాప్తంగా వేరు వేరు ప్రాంతాల్లో వీవర్ సర్వీస్ సెంటర్ లు కళాశాలల్లో నిర్వహించే హేండ్ లూమ్ ఎక్స్ పోలు, అవగాహన కార్యక్రమాలు

 

  • ఇతివృత్త ప్రధానమైన ప్రదర్శనలు/నేత నేయడం ఎలాగో వివరించే కార్యక్రమంబృంద చర్చలుచేనేత మగ్గాలను గురించిన ప్రశ్నలు-సమాధానాల కార్యక్రమం, ఎన్ఐఎఫ్‌టిఐఐహెచ్‌టి ల ఆధ్వర్యంలో ఫ్యాషన్ సమర్పణ సహా వివిధ అవగాహన కార్యక్రమాలు ఉంటాయి.

 

***


(Release ID: 2042481) Visitor Counter : 72