ప్రధాన మంత్రి కార్యాలయం
పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు
Posted On:
01 AUG 2024 2:38PM by PIB Hyderabad
ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని శ్రీ స్వప్నిల్ కుసాలే గెలిచిన సందర్భంగా ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:
‘‘శ్రీ స్వప్నిల్ కుసాలే అసామాన్య ప్రదర్శన ఇది! పారిస్ ఒలింపిక్స్ 2024 లో పురుషుల 50 మీటర్ ల రైఫిల్ మూడు పొజిషన్ లలో కాంస్య పతకాన్ని గెలిచినందుకు ఆయనకు అభినందనలు.
ఆయన ప్రదర్శన అద్వితీయంగా ఉంది. ఎందుకంటే ఆయన అద్భుత రీతిన ముందడుగు వేసి, మంచి ఆటతీరును కనబరచారు. ఈ శ్రేణిలో పతకాన్ని గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు కూడా ఆయనే.
ఈ విజయాన్ని చూసి భారతదేశంలో ప్రతి ఒక్కరు సంతోషం తో ఉప్పొంగిపోతున్నారు.’
***
DS/TS
(Release ID: 2040198)
Visitor Counter : 68
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam