మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
“ శిక్షా సప్తాహ్” పేరుతో, జాతీయ విద్యావిధానం 2020 నాలుగవ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న కేంద్రవిద్యా మంత్రిత్వశాఖ..
దేశవ్యాప్తంగా గల పాఠశాలలు 7వ రోజు శిక్షాసప్తాహ్ ఉత్సవాలను, విద్యాంజలి, తిథిభోజన్ ద్వారా కమ్యూనిటి భాగస్వామ్యంతో జరుపుకుంటున్నాయి.
Posted On:
28 JUL 2024 10:37AM by PIB Hyderabad
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ జాతీయ విద్యావిధానం 2020 కింద నాలుగవ వార్షికోత్సవాన్ని, వారం రోజుల శిక్షా సప్తాహ్ ప్రచార కార్యక్రమంతో నిర్వహిస్తున్నది. ఏడవ రోజైన జూలై 28న దేశవ్యాప్తంగా గల పాఠశాలలు, విద్యాంజలి, తిథిభోజన్ కార్యక్రమాల ద్వారా విద్యలో కమ్యూనిటీ భాగస్వామ్య ప్రాధాన్యతను ప్రముఖంగా తెలియజేస్తున్నాయి.
విద్యాంజలి అనేది పాఠశాల వాలంటీర్ మేనేజ్మెంట్ కార్యక్రమం. దీనిని కేంద్ర విద్యాశాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం నిర్వహిస్తున్నది. దీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 7న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా,కమ్యూనిటీ భాగస్వామ్యం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్), ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో పాఠశాలలను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా, పాఠశాల విద్య , అక్షరాస్యతా విభాగం, పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాల జాబితాను సూచించింది. పాఠశాలలు విద్యాంజలి పోర్టల్లో తమ పాఠశాలను చేర్చడంపై దృష్టిపెట్టడమే కాక, తమకు మద్దుతనిచ్చే వలంటీర్లను గుర్తించే పనిలో ఉన్నాయి. క్రియాశీల కార్యకర్తల పేర్లను, పాఠశాలలోని వాల్ ఆఫ్ ఫేమ్ లేదా నోటీస్ బోర్డుపై రాయించనున్నారు.. దీనికితోడు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ క్రియాశీల వలంటీర్లకు తమ కృతజ్ఞత తెలియజేస్తూ ఉత్తరాలు రాయనున్నారు.
వలంటీర్ కార్యకలాపాలపై, ర్యాలీలు, వీధి నాటకాలు,పోస్టర్, చార్ట్ తయారీ వంటి వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, జిల్లా , రాష్ట్రస్థాయి అధికారులు ఇందులో క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఈ చర్యలు, నూతన విద్యావిధానం –2020 లక్ష్యమైన విద్యలో కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడానికి ఉపకరిస్తాయి.
విద్యాంజలి పోర్టల్ ద్వారా (https://vidyanjali.education.gov.in/) పాఠశాలు, వలంటీర్లు, కమ్యూనిటీని ఒక చోటకు తెచ్చి మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం ద్వారా విద్యార్ధులు, టీచర్లకు మద్దతుగా ఒక బలమైన వ్యవస్థను నిర్మించేందుకు ఈ కార్యక్రమాలను నిర్దేశించారు.
పోస్టర్.......
పాఠశాలల్లో శిక్షా సప్తాహ్
నూతన విద్యావిధానం –2020 నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా జూలై 22,2024 నుంచి జూలై 28 వరకు కార్యక్రమలు.
–––
1 వరోజు 22 జూలై 2024 బోధన, అభ్యసన మెటీరియల్ దినోత్సవం
2వ రోజు 23 జూలై 2024 పునాది విద్య, అంకెల దినోత్సవం
3వ రోజు 24 జూలై 2024 క్రీడల దినోత్సవం
4వ రోజు 25జూలై 2024 సాంస్కృతిక దినోత్సవం
5వ రోజు 26 జూలై 2024 నైపుణ్యాల దినోత్సవం, విద్యలో సాంకేతికత దినోత్సవం
6వ రోజు 27 జూలై 2024 పర్యావరణ క్లబ్బుల, మిషన్ లైఫ్ దినోత్సవం
7వ రోజు 28 జూలై 2024 కమ్యూనిటీ భాగస్వామ్య దినోత్సవం
***
(Release ID: 2038812)
Visitor Counter : 65