సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ‘అప్‌నా రేడియో 90.0 ఎఫ్ఎమ్’ ను ఐఐఎమ్‌సి ఐజోల్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్


పదో జాతీయ కమ్యూనిటీ రేడియో పురస్కారాల విజేతలను ప్రకటించిన శ్రీ అశ్వనీ వైష్ణవ్

ఐఐఎమ్‌సి అప్‌నా రేడియో స్టేషన్ ప్రారంభం భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ విధానం’లో ఒక ముఖ్యమైన ఘట్టం: శ్రీ అశ్వనీ వైష్ణవ్

Posted On: 25 JUL 2024 1:03PM by PIB Hyderabad

పదో జాతీయ కమ్యూనిటీ రేడియో పురస్కారాల విజేతలను కేంద్ర సమాచార - ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఈ రోజు ప్రకటించారు.   కేంద్ర సమాచార - ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్,  మిజోరమ్ ముఖ్యమంత్రి శ్రీ లాల్ దుహోమా ల సమక్షంలో కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ భారతదేశంలోని 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ను ప్రారంభించారు.  అప్‌నా రేడియో 90.0 ఎఫ్ఎమ్’ అనే పేరుతో ఏర్పాటైన ఈ స్టేషన్ ఐజోల్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్‌సి ) నిర్వహణలో ఉంది.

 

 

భారతదేశ కమ్యూనిటీ రేడియో ప్రస్థానంలో ఈ మైలురాయి అనదగ్గ ఈ ఘటనను గురించి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఒక ప్రకటన చేస్తూఈ కార్యక్రమం అప్‌నా రేడియో కేంద్రం ప్రసారాలు లభ్యమయ్యే ప్రాంతాల ప్రజల జీవనాలలో చెప్పుకోదగిన మార్పును తీసుకు వస్తుందన్నారు.  ఈ ప్రారంభ కార్యక్రమం ప్రభుత్వం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్ విధానం’లో ఒక ముఖ్య ఘట్టమని కూడా ఆయన అన్నారు.

 

 

రైల్వే బడ్జెట్ లో భాగంగా ఈశాన్య ప్రాంతానికి రికార్డు స్థాయిలో కేటాయింపును కేంద్ర బడ్జెట్ ప్రకటించిందని మిజోరమ్ ముఖ్యమంత్రి దృష్టికి కేంద్ర మంత్రి తీసుకు వచ్చారు.  ఇది చక్కని రైలు మార్గ సంధానాన్ని అందుకోవాలని ఎంతో కాలంగా మిజోరమ్ కంటున్న కలలను నెరవేర్చుతుందని ఆయన అన్నారు.

 

 

ముఖ్యమంత్రి శ్రీ లాల్ దుహోమా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఐఐఎమ్‌సి ఐజోల్ లో ఏర్పాటైన అప్‌నా రేడియో కేంద్రం రాష్ట్ర సమాచార చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందనన్నారు.  మిజోరమ్ తనకు ఉన్న వ్యవసాయరంగ సంబంధ శక్తి సామర్థ్యాల కారణంగా ప్రధానంగా ఒక వ్యావసాయిక రాష్ట్రంగా పేరు తెచ్చుకొంది.  కర్షక సముదాయం కోసం ఒక కమ్యూనిటీ రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందివారికి నిత్యం వాతావరణ సంబంధ తాజా సమాచారాన్ని అందించడంప్రభుత్వ పథకాలను గురించివ్యవసాయ రంగ సంబంధ సామాచారాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది.  ఈ ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చడంలో అచంచలమైన మద్దతునుఅంకిత భావాన్ని కనబరచినందుకు సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కుఇతర సంబంధిత వర్గాలన్నింటికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

 

కేంద్ర సమాచార - ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ మాట్లాడుతూ, ఆ తరహా కేంద్రాలకున్న సామాజిక ప్రయోజన ప్రధాన స్వభావాన్ని గురించి వివరించారు. ప్రైవేటు రేడియో చానల్స్ కు ఉన్న వాణిజ్యపరమైన స్వభావానికి భిన్నంగా, సమాచార వ్యవస్థ సమాజంలో చివరి అంచె వరకు చేరుకోవాలన్న నిబద్ధతను చాటి చెప్పడానికే కమ్యూనిటీ రేడియో స్టేషన్ లను ఏర్పాటు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.  ప్రకృతి విపత్తులు సంభవించే కాలాల్లో ఈ స్టేషన్ ల పాత్రకు న్న ప్రాధాన్యం అమాంతం పెరిగిపోతుందని ఆయన అన్నారు.  

 

 

సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు  ఈ కార్యక్రమంలో మాట్లాడుతూవ్యవసాయానికిరైతుల సంక్షేమానికి ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలువాతావరణ సంబంధ సమాచారం వగైరా వివరాలను అందించడంలో కమ్యూనిటీ రేడియో కేంద్రాలు ఒక కీలక పాత్రను పోషిస్తాయన్నారు.  అవి ప్రత్యామ్నాయ స్వరాలను వినగలిగే ఒక అధ్వితీయ వేదికను అందిస్తాయనివిషయాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన భాషలలోను, యాసలలోను అందించడం జరుగుతుందని ఆయన అన్నారు.  ఈ కమ్యూనిటీ రేడియోలు మరీ ముఖ్యంగా సమాజంలో ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలకు నోచుకోని పేదలకునిరాదరణకు గురైన వర్గాల వారికి  ఉద్దేశించినవి అని ఆయన వివరించారు.

 

 

దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియో కేంద్రాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి తమ మంత్రిత్వ శాఖ స్థిరంగా కట్టుబడి ఉందని కూడా శ్రీ సంజయ్ జాజు స్పష్టం చేశారు.

 

 

ఐఐఎమ్‌సి వైస్ చాన్సలర్ డాక్టర్ అనుపమ భట్నాగర్ మాట్లాడుతూమిజోరమ్ చరిత్రలో అప్‌నా రేడియో 90.0 ఎఫ్ఎమ్’ ప్రారంభోత్సవం ఒక కొత్త అధ్యాయం;  ఇది చర్చల నిర్వహణస్థానిక సంస్కృతిని కళ్ళకు కట్టడంపౌరుల సాధికారిత కల్పనకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా వివిధ సముదాయాలను ఒక చోటు తీసుకు వస్తుందన్నారు.

 

పదో జాతీయ కమ్యూనిటీ రేడియో పురస్కారాల విజేతలు:

 

 

శ్రేణి: ఇతివృత్త ప్రధాన పురస్కారం

  • ప్రథమ బహుమతి: ‘టెక్ సఖి’ కార్యక్రమానికి గాను బిహార్ లోని సారణ్ జిల్లాకు చెందిన ‘రేడియో మయూర్’ కు.

 

·         ద్వితీయ బహుమతి:  ‘నిరంగళ్’ కార్యక్రమానికి గాను కేరళలోని ‘రేడియో  కోచి’ కి.

  • తృతీయ బహుమతి: ‘మేరీ బాత్’ కార్యక్రమానికి గాను ఉత్తరాఖండ్ లోని దెహ్‌రాదూన్ కు చెందిన ‘హెలో దూన్’ కు.

 

శ్రేణి: అత్యధిక నవీన సాముదాయిక సంబంధాలకు ఇచ్చే పురస్కారం

 

  • ప్రథమ బహుమతి: ‘కహానీ సునందాచీ’ కార్యక్రమానికి గాను మహారాష్ట్రలోని ‘యర్ లావానీ సాంగ్‌లీ’ కి.

 

  • ద్వితీయ బహుమతి: ‘రండి, ఒక కొత్త కొలమానాన్ని మనం రూపొందించుదాం’ (‘లెట్ అజ్ బిల్డ్ ఎ న్యూ నార్మ్’) కార్యక్రమానికి గాను  తమిళ నాడు లోని మదురై కు చెందిన ‘వాయ్ లాగా వనోలీ’ కి.

 

  • తృతీయ బహుమతి: ‘పనిమనిషి దీదీ’ కార్యక్రమానికి గాను ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ‘సలామ్ నమస్తే నోయెడా’ కు.

 

శ్రేణి:  స్థానిక సంస్కృతిని ప్రోత్సహించినందుకు ఇచ్చే పురస్కారం

  • ప్రథమ బహుమతి:  ఇగారేకున్ కార్యక్రమానికి గాను అసోమ్ లోని డిబ్రూ గఢ్ కు చెందిన ‘రేడియో బ్రహ్మపుత్ర’ కు.

 

  • ద్వితీయ బహుమతి: ఎన్ మక్కళుడన్ ఒరు పయనమ్  కార్యక్రమానికి గాను  తమిళ నాడు లోని నీలగిరీస్ కు చెందిన ‘రేడియో కోటగిరి’ కి.

 

  • తృతీయ బహుమతి: అంగ్ ప్రదేశ్ కీ అద్ భుత్ ధరోహర్  కార్యక్రమానికి గాను బిహార్ కు చెందిన భాగల్ పుర్ లోని ‘రేడియో యాక్టివ్’ కు.

 

 

శ్రేణి: సస్‌టేనబిలిటీ మాడల్ కు ఇచ్చే పురస్కారం

 

  • ప్రథమ బహుమతి:  కేరళలోని కొల్లమ్ లో పని చేస్తున్న బిషప్ బేంజిగర్ హాస్పిటల్ సొసైటీ నిర్వహిస్తున్న ‘రేడియో బేంజిగర్’ కు.

 

  • ద్వితీయ బహుమతి: యంగ్ ఇండియా నిర్వహణలో ఉన్న ఒడిషా లోని కోణార్క్ కు చెందిన ‘రేడియో నమస్కార్’ కు.

 

  • తృతీయ బహుమతి:  శరణబసవేశ్వర విద్య వర్ధక్ సంఘ్ ఆధ్వర్యంలో నడుస్తున్న కర్నాటక లోని గుల్‌బర్గా కు చెందిన ‘రేడియో అంతర్వాణి’ కి.

 

 

కమ్యూనిటీ రేడియో స్టేషన్స్ (సిఆర్ఎస్) ల మధ్య నూతన ఆవిష్కరణలనుఆరోగ్యదాయకమైన పోటీని ప్రోత్సహించడానికి జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ 2011-12 లో మొదలుపెట్టింది.

 

 జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను సాధారణంగా ప్రతి ఏటా ప్రదానం చేయడం జరుగుతుంది.  ఇదే వరుసలో క్రింద తెలిపిన నాలుగు కేటగిరీలలో పదో జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది.

 

1.   ఇతివృత్త ప్రధాన పురస్కారం

2.   అత్యధిక వినూత్న సాముదాయిక సంబంధాలు ప్రధానమైన పురస్కారం

3.   స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఇచ్చే పురస్కారం

4.   స్థిరత్వానకి నమూనా కు ఇచ్చే పురస్కారం

 

ప్రతి కేటగిరీలో లక్ష రూపాయల ప్రథమ బహుమతి, 75,000 రూపాయల ద్వితీయ బహుమతి, 50,000 రూపాయల తృతీయ బహుమతి ఉన్నాయి.

  

*****


(Release ID: 2037085) Visitor Counter : 68