ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోని పెద్ద ఏకీకృత గ్రిడ్‌లలో ఒకటిగా రూపుదిద్దుకున్న భారత పవర్ గ్రిడ్ : 2023`24 ఆర్థిక సర్వే
2017 అక్టోబర్‌లో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించిన అనంతరం 2.86 కోట్ల గృహాలకు విద్యుత్ సదుపాయం.
ఇంధన సమ్మిళితత్వంలో శిలాజేతర ఇంధనాల స్థాయిని పెంచేందుకు కృషిని ముమ్మరం చేసిన భారత్.
2024`30 మధ్య కాలంలో దేశ పునరుత్పాదక ఇంధన రంగం 30.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం.
Posted On:
22 JUL 2024 2:23PM by PIB Hyderabad
‘‘దేశంలో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ 1,18,740 మెగావాట్ల అంతర్ ప్రాంతీయ బదిలీ సామర్ధ్యంతో ఒకే గ్రిడ్, ఒకే ఫ్రీక్వెన్సీతో అనుసంధానమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత గ్రిడ్‌గా రూపుదిద్దుకుంటున్నది.’’
అని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్,సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023`24 ఆర్థిక సర్వే పేర్కొనింది. 2024 మార్చి 31 నాటికి ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ 4,85,544 సర్క్యూట్ కిలోమీటర్ ట్రాన్స్‌మిషన్ లైన్లు, 12,51,080 మెగా ఓల్ట్ యాంప్ (ఎం.వి.ఎ) ఇంధన మార్పిడి సామర్ధ్యాన్ని కలిగి ఉన్నట్టుకూడా ఆర్థిక సర్వే తెలిపింది.
దేశంలో నిరంతరాయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేవిధంగా విద్యుత్ రంగ సామర్ధ్యాన్ని మరింత ఉన్నతస్థితికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసిందని పేర్కొనింది. 2024 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 13 శాతం పెరిగి 243 గిగావాట్లకు చేరినట్టు సర్వే తెలిపింది. 2023`2024 ఆర్థిక సంవత్సరాలమధ్య పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో గరిష్ఠ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినట్టు కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొనింది.
2017 అక్టోబర్‌లో సౌభాగ్య పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి 2.86 కోట్ల ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. దీనికితోడు, విద్యుత్ నిబంధనలు 2022 అమలు(ఆలస్య చెల్లింపులపై సర్‌చార్జి, సంబంధిత అంశాలు) డిస్కంలకు, విద్తున వినియోగదారులకు, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఊపశమనం కలిగించాయని తెలిపింది.
పునరుత్పాదక ఇంధన రంగం:
2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ఆధారంగా క్రమంగా 50 శాతం విద్యుచ్ఛక్తి స్థాపిత సామర్ధాన్ని సాధించేందుకు ఇండియా కట్టుబడి ఉంది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ప్రకారం, దీనిని సాధించనున్నారు. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగా వాట్ల (జిడబ్ల్యు) విద్యుత్ స్థాపిత సామర్ధ్యాన్ని సాధించేందుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ కృషిచేస్తోంది. 2024 మార్చి31 నాటికి,దేశంలో 190.57 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్ధ్యాన్ని కల్పించినట్టు కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొనింది. మొత్తం దేశంలోని విద్యుత్ ఉత్పత్తిసామర్ధ్యంలో పునరుత్పాదక ఇంధనం వాటా 43.12 శాతంగా ఉన్నట్టు అది పేర్కొనింది.
ఇండియాలో పరిశుభ్ర ఇంధన రంగంలో 2014 నుంచి 2023 మధ్య 8.5 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు వచ్చినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 నుంచి 2030 మధ్య పునరుత్పాదక ఇంధన రంగం 30.05 లక్షల కోట్ల రూపాయలు ఆకర్షించగలదని, ఇది దేశంలో ఈరంగంలోని వాల్యూచెయిన్‌లో చెప్పుకోదగిన అవకాశాలను కల్పించగలదని ఆర్థిక సర్వే తెలిపింది.
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన జాతీయ విద్యుత్ ప్రణాళిక ప్రకారం, శిలాజేతర ఇంధనం (జల, అణు, సౌర, పవన, బయోమాస్, చిన్న జల విద్యుత్, పంప్ స్టోరేజ్ పంపుల) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్ద్యం 203.4 గిగావాట్లు ఉంటుందని ఆర్థిక సర్వే పేర్కొనింది. 2023`24లోని మొత్తం స్థాపిత సామర్థ్యం 441.9 గిగావాట్లలో ఇది 46 శాతం వాటా కలిగి ఉందని తెలిపింది. ఇది 2026`27 నాటికి 349 గిగావాట్లకు (57.3 శాతానికి), 2029`30 నాటికి 500.6 గిగావాట్లకు (అంటే 64.4 శాతానికి) చేరుకోనున్నదని ఆర్థిక సర్వే తెలిపింది.
***
(Release ID: 2036598)
Visitor Counter : 185
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam