ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక అభివృద్ధి లో మహిళల పాత్ర అధికమయ్యే దిశ లో ప్రభుత్వ నిబద్ధత ను సూచించిన కేంద్ర బడ్జెటు


మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాలకు 3 లక్షల కోట్ల రూపాయలకు పైచిలుకు కేటాయింపులు జరపడమైంది

పని చేస్తున్న మహిళలకు వసతిగృహాలను పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది



Posted On: 23 JUL 2024 12:50PM by PIB Hyderabad

కేంద్ర బడ్జెటు 2024-25 ను ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆర్థిక అభివృద్ధి లో మహిళల పాత్ర అధికం అయ్యే దిశలో ప్రభుత్వ నిబద్ధతను బలంగా చాటిచెప్పారు.

 

మహిళలకు, బాలికలకు ప్రయోజనాన్ని చేకూర్చే పథకాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలకు పైచిలుకు కేటాయింపు ను చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధి సాధన ను ప్రోత్సహించేందుకు ఒక ఉపాయం గా ఈ చర్యను  సంకల్పించినట్లుగా ఆమె వివరించారు.

 

తాత్కాలిక బడ్జెటులో ‘మహిళల’కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి గుర్తుకు తీసుకువచ్చారు. మహిళలు నాలుగు ప్రధాన కులాల్లో ఒక భాగం గా ఉన్నారు, మరొక్కసారి కేంద్ర బడ్జెటు 2024-25 లో ‘‘మేం భారతీయులందరికీ, వారు ఏ మతానికి , జాతికి, వయస్సుకు చెందినవారైనప్పటికీ, వారు మహిళలు లేదా పురుషులు అయినప్పటికీ తమ జీవన లక్ష్యాలను మరియు ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి చెప్పుకోదగిన ప్రగతిని సాధించేటట్లుగా చూడాలనే సంకల్పించాం’’ అని మంత్రి పునరుద్ఘాటించారు.

 

పని చేస్తున్న మహిళల కోసం వసతిగృహాలను, శిశు సంరక్షణ నిలయాలను  పరిశ్రమ సహకారంతో ఏర్పాటు చేసి, శ్రమశక్తిలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం లభించడానికి మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. దీనికి అదనంగా, ఈ భాగస్వామ్యంలో విశేషించి మహిళలకు నైపుణ్య శిక్షణ ప్రధాన కార్యక్రమాలను ఏర్పాటు చేసే, మహిళల స్వయం సహాయ సమూహ వ్యాపార సంస్థలకు విపణి లభ్యత ను పెంచే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

***


(Release ID: 2036151) Visitor Counter : 133