ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆదివాసీ సముదాయాలకు సామాజిక, ఆర్థిక స్థితి లో మెరుగుదల కోసం ‘ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ ను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
ఆదివాసీలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో, మహత్వాకాంక్షయుక్త జిల్లాలలో ఆదివాసీ కుటుంబాలన్నింటికీ ఈ పథకం ప్రయోజనాలను అందిస్తుంది
అయిదు కోట్ల మంది ఆదివాసీ ప్రజలకు ప్రయోజనాలను అందించాలన్నఉద్యేశ్యంతో 63,000 గ్రామాలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది
Posted On:
23 JUL 2024 12:48PM by PIB Hyderabad
ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ను ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు ‘కేంద్ర బడ్జెటు 2024-25’ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు.
ఈ అభియాన్ ఆదివాసీ సముదాయాల సామాజిక, ఆర్థిక స్థితిలో మెరుగుదలను తీసుకు రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం ధ్యేయాలుగా ‘అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలని’ ఈ పథకంలో ప్రతిపాదించడమైందని మంత్రి అన్నారు. ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్న గ్రామాలలోను, మహత్వాకాంక్షయుక్త జిల్లాలలోను ఆదివాసీ కుటుంబాలన్నీ సంపూర్ణ ప్రయోజనాలను అందుకొనే విధంగా ఈ పథకాన్ని లక్షించినట్లు ఆమె చెప్పారు.
‘ప్రధాన మంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ లో 63,000 గ్రామాలు చేరుతాయి. దేశంలో 5 కోట్ల మంది ఆదివాసీ సముదాయానికి లాభాన్ని చేకూర్చాలన్నదే ఈ పథకం లక్ష్యం.
***
(Release ID: 2036140)
Visitor Counter : 174
Read this release in:
Assamese
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam