ఆర్థిక మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి ప్యాకేజీ కింద నైపుణ్య శిక్షణ కోసం నాల్గవ పథకంగా ఓ కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం


ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ

1,000 పారిశ్రామిక శిక్షణా సంస్థలు నవీకరించబడతాయి

రూ.7.5 లక్షల వరకు రుణాలు పొందేలా మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ ను సవరించనున్నారు. దీని వల్ల ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులకు సహాయం అందుతుందని అంచనా

Posted On: 23 JUL 2024 1:06PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రధాన మంత్రి ప్యాకేజీ కింద నాల్గవ పథకంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఫలితాల ఆధారిత విధానంతో తగిన ఏర్పాట్లలో నవీకరిస్తామని చెప్పారు. పరిశ్రమ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల విషయాలు, డిజైన్ ను రూపొందిస్తామని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు.


నైపుణ్య రుణాలకు సంబంధించి, మెరుగైన ఫండ్ గ్యారెంటీతో రూ.7.5 లక్షల వరకు రుణ సౌకర్యాన్ని అందించడానికి ప్రభుత్వం మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను సవరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని వల్ల ఏటా 25,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా.

 

***



(Release ID: 2035817) Visitor Counter : 17