ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తూ లగ్జెంబర్గ్ ప్రధాని ఫోన్ కాల్
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకొనే దిశలో నిబద్ధతను పునరుద్ఘాటించిన ఇద్దరు నేతలు
ఉక్రెయిన్ సంఘర్షణను త్వరితగతిన సమాప్తం చేసే దిశలో భారతదేశం పోషిస్తున్న పాత్రను ప్రశంసించిన ప్రధాని శ్రీ ఫ్రీడెన్
గ్రాండ్ డ్యూక్ శ్రీ హెన్రీ , ప్రధాని శ్రీ ఫ్రీడెన్ లను భారత్ కు ఆహ్వానించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
22 JUL 2024 10:04PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లగ్జెంబర్గ్ గ్రాండ్ డచీ ప్రధాన మంత్రి శ్రీ ల్యూక్ ఫ్రీడెన్ సోమవారం టెలిఫోన్ లో మాట్లాడుతూ, వరుసగా మూడో సారి ప్రధానిగా ఎన్నికైన శ్రీ నరేంద్ర మోదీ ని అభినందించారు.
దీనికి స్పందిస్తూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ సహకారానికి మరింత శక్తి, మరింత జోరు తోడవుతుందన్న ఆశాభావాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
వాణిజ్యం, పెట్టుబడి, స్థిరమైన ఆర్థిక సాయం, తయారీ, ఆరోగ్యం, అంతరిక్షం, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా విభిన్న రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరచే దిశలో పని చేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ లో సంఘర్షణ సహా ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. ఉక్రెయిన్ సంఘర్షణను సమాప్తం చేసే, శాంతి, స్థిరత్వాలను త్వరితగతిన పునరుద్ధరించే దిశలో భారతదేశం పోషిస్తున్న పాత్రను ప్రధాని శ్రీ ఫ్రీడెన్ ప్రశంసించారు.
గ్రాండ్ డ్యూక్ శ్రీ హెన్రీ, ప్రధాన మంత్రి శ్రీ ఫ్రీడెన్ లను భారతదేశంలో పర్యటించవలసిందిగా ప్రధాన మంత్రి ఆహ్వానించారు
తరచూ సంప్రదింపులు జరుపుతుండాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.
***
(Release ID: 2035551)
Visitor Counter : 83
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam