ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ‘ఒకే ఉపాయం అందరికీ సరైంది’ అనే వైఖరిని అవలంబించడానికి బదులుగా, వాతావరణ మార్పును ‘స్థానిక దృష్టి కోణం’లో నుంచి చూడవలసిన అవసరం భారతదేశానికి ఉంది


ప్రపంచ వాతావరణ మార్పు సంబంధ సమస్యలకు మూలకారణంగా ఉన్న మితిమీరిన వినియోగాని కన్నా మానవులకు - ప్రకృతికి మధ్య సద్భావన పై దృష్టి సారిస్తూ వివేచనతో కూడిన వినియోగంపైన మిషన్ లైఫ్ శ్రద్ధ వహిస్తోంది

Posted On: 22 JUL 2024 2:17PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వే 2023-24 పత్రాన్ని ప్రవేశపెట్టారు.  వాతావరణ మార్పు ప్రభావాన్ని పరిష్కరించడానికి పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆర్థిక సర్వే  2023-24 విమర్శనాత్మక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  వాతావరణ మార్పు సంబంధ సమస్యను స్థానిక దృష్టికోణం’ పరిశీలించాలంటూ అభివృద్ధి చెందుతున్న దేశాలకన్నింటికీ ఆర్థిక సర్వే పిలుపునిచ్చింది.  ఒకే ఉపాయం అందరికి సరైంది’ అనే ధోరణితో ఆశించిన ఫలితాలు రావని చెప్తూఅభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక పక్క అర్థవంతమైన వాతావరణ సంబంధ కార్యాచరణకు నడుం కడుతూమరో పక్క అభివృద్ధి ప్రధానమైన లక్ష్యాల సాధనకు కృషి చేస్తూ ఈ సమతుల్యతతో వాటి వాటి సొంత పంథాలను ఎంచుకొనేందుకు స్వేచ్ఛగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.

 

 

వాతావరణ మార్పు విషయంలో ప్రస్తుతం అమలవుతున్న ప్రపంచ వ్యూహాలు లోపభూయిష్టంగానుసర్వత్రా వర్తించేవిగాను లేవు అని  కేంద్ర ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే పత్రం విస్పష్టంగా పేర్కొంది.  భారతదేశంలో సంస్కృతిఆర్థిక వ్యవస్థసామాజిక నియమాలు ఇప్పటికే పర్యావరణంతో పెనవేసుకొని ఉన్న కారణంగా పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న విధానాలు భారతదేశానికి వినాశకారిగా పరిణమించవచ్చని ఆర్థిక సర్వే తెలిపింది.

 

భారతదేశం వాతావరణ సంబంధ కార్యాచరణలో చెప్పుకోదగిన ముందంజలను వేస్తూ ఉన్నప్పటికీపశ్చిమ దేశాలు అవలంభిస్తున్న పరిష్కార మార్గాలతో అవి సరితూగడం లేదన్న విమర్శను భారత్ తరచుగా ఎదుర్కొంటోందని ఆర్థిక సర్వే పత్రం ప్రముఖంగా పేర్కొంది.  ఈ విమర్శలు ఇప్పటికే సుస్థిరాభివృద్ధి సంబంధ ఉపాయాలు దండిగా ఉన్న భారతదేశ అద్వితీయ సామాజికసాంస్కృతిక ముఖచిత్రం ప్రశంసలకు నోచుకోని స్థితి నుంచి జనిస్తున్నాయి. వాతావరణ మార్పును ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందిన దేశాల నుంచి వస్తున్న తరణోపాయాల లోటుపాటులను గురించి కూడా ఈ పత్రం ప్రస్తావించింది;  ఆ తరణోపాయాలు ప్రపంచ దేశాలన్నింటికీ సరిపడేవిగా లేవు అని పేర్కొంది.   లోటుపాటులు ఏవేవంటే..

 

o     పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న విధానం సమస్య మూలకారణాన్ని కొలిక్కి తేవడం లేదు;  అంతకన్నా, మితిమీరిన వినియోగానికి దారితీసే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడాన్నేఆ విధానం సూచిస్తోంది.

o    ప్రపంచ వ్యాప్తంగా కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఇంధనాన్ని ఎక్కువగా ఉపయోగించుకొనే తరహా  సాంకేతిక పరిజ్ఞానాల పట్ల, పెద్ద ఎత్తున లభించనటువంటి ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్ ) త్రవ్వకం పట్ల దృష్టిని సారిస్తూ ఉండడం తో, శిలాజ జనిత ఇంధనాల వినియోగం పెచ్చుపెరిగింది.  ఇది వాతావరణ మార్పులను తగ్గించేందుకు చెప్పుకొన్న సంకల్పాలకు ఎంతమాత్రం సరిపోలడం లేదు.

o     

ప్రకృతితోనుసాటి ప్రజలతోనువస్తువాదంతోనుమానవులు తమతో తాము సైతం ఏర్పరచుకొన్న సంబంధాలను అభివృద్ధి చెందిన దేశాల జీవనశైలులు ఉపేక్షిస్తున్నాయి.

 

 

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో అతి వినియోగం సంస్కృతి వేళ్ళూనుకొని ఉందనిదీనికి పూర్తి భిన్నంగా ప్రకృతితో సద్భావన యుక్త సంబంధాన్ని నెలకొల్పుకోవడం ఎంతైనా ముఖ్యమని భారతదేశ సభ్యత నొక్కి చెప్తోందని ఆర్థిక సర్వే 2023-24 తెలిపింది.  ఈ ప్రకారంగా భారతదేశం పశ్చిమ దేశాలను పట్టి పీడిస్తున్న సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను సూచిస్తోందని సర్వే పత్రం పేర్కొంది.   ఉదాహరణకు :

 

 

·            అభివృద్ధి చెందిన దేశాలలో మాంసం ఉత్పత్తికి అవలంబించే ప్రక్రియ ఆహార భద్రతకు చిక్కులను సృష్టించేదిగానుభూమినీరుమానవ జాతి మనుగడకు కీలకమైన ప్రాకృతిక వనరుల శాశ్వత క్షీణత తాలూకు ముప్పును కలుగుజేస్తున్నాయి.   పశుగణానికి పోషణ నిమిత్తం మనుషులు వాడుకొనే పంటల మీద ఆధారపడే తీరు ఆహారానికి - దాణాకు మధ్య పోటీ’ అనే చక్రభ్రమణం ముప్పు ను కొనితెస్తుంది.  ఎందుకంటే, పండే సగానికంటే తక్కువ తృణధాన్యాలు ప్రస్తుతం నేరుగా మానవ వినియోగానికి పనికి వస్తున్నాయి.  అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్యలు మరింత తక్కువగా ఉన్నాయి.

 

అభివృద్ధి చెందుతున్న దేశాలలో చాలావరకు వ్యవసాయం తాలూకు సాంప్రదాయిక కార్యకలాపాలు పశుపాలనతో మమేకం అయ్యాయిఅవి సమస్యకు ఒక పరిష్కారాన్ని అందిస్తున్నాయి.  పంట వ్యర్థాల పునర్వినియోగం, వ్యవసాయేతర కార్యకలాపాలతో లభించే ఉప ఉత్పత్తులను పశుగణానికి మేతగా వాడటమనేవి మాంసం ఉత్పత్తి తాలూకు ఆర్థిక, పర్యావరణ వ్యయాన్ని తగ్గించడం ఒక్కటే కాకుండా ప్రాకృతిక సమతుల్యతను కూడా ప్రసాదిస్తుంది.  మనుషులు వాడుకోని పంటలను పశుగణానికి అందిస్తే ప్రపంచంలో ఆకలి సమస్య ను పరిష్కరించడం కోసం ప్రపంచ స్థాయిలో సాగు చేయదగ్గ భూమిలో గణనీయమైన భాగాన్ని విముక్తం చేయడానికి వీలు ఏర్పడుతుందని సర్వే వివరించింది.

 

 

 

·         ఇదే విధంగాపశ్చిమ దేశాలలో అనుసరించే మాదిరి చిన్న చిన్నవైన ఒకే కుటుంబాల విధానాన్ని అనుసరించడం వల్ల తగినంత భూమి అవసరం పడుతుందిపర్యావరణం కోసం వనరుల లోటు సంకటమూ తలెత్తుతుంది. అదే, ఒకే కుటుంబాల జీవన విధానాచరణ తో పట్టణ ప్రాంతాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇంతేకాకుండా, పట్టణ ఆవాసాలలో సౌకర్యాల లేమి తో పాటే పెద్ద మోతాదులో కాంక్రీటు ను ఉపయోగించడం, స్థలాన్ని మూసివేయవలసిరావడం, గాలి ఆడడం తక్కువైపోవడం,   ఎండ కాలాల్లో ఇంధనానికి ఎక్కువ వ్యయపరచవలసి రావడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. 

 

ఆర్థిక సర్వే చెప్పిన దానిని బట్టి చూస్తే, బహుళ తరాల సాంప్రదాయిక కుటుంబాల’ పద్ధతికి మొగ్గు చూపడం వల్ల మన్నికైన గృహ నిర్మాణానికి బాట సుగమం కాగలదు.  ఒక సంప్రదాయిక భారతీయ ఆవాసాన్ని నిర్మించడం అవసరమైన సామగ్రినిశ్రమ శక్తిని స్థానికంగా సమకూర్చుకొనేగాలివెలుతురులు ధారాళంగా లోపలకు వచ్చేందుకు వీలైన మధ్య ఖాళీ ప్రదేశం తో  ఆవాసాలను ఏర్పరచేఅటు వనరులుఇంధన అవసరాల మోతాదును తగ్గించడంతో పాటు అటు పర్యావరణం పరంగా ఒక సానుకూల పరిస్థితిని కల్పించేది అని వివరించింది.  అటువంటి కుటుంబం వయస్సు మళ్ళిన వారికి కూడా ఎంతో మేలు కలిగించేదిగా ఉండేదని వివరించింది.

 

ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని తెలియజేసే క్రమంలో ఆర్థిక సర్వే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన మిషన్ లైఫ్ (Mission LiFE) దృష్టికోణాన్ని గురించి ప్రస్తావించింది.  దీనిలో ప్రకృతిని నాశనం చేయకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ పర్యావఃరణం కోసం జీవనశైలి (లైఫ్ స్టయిల్ ఫర్ ఎన్ వైరన్ మెంట్) ను గురించి స్పష్టం చేయడమైంది. ఈ దృష్టికోణం వాతావరణ మార్పునకు వ్యతిరేకంగా చేసే సమరంలో వ్యక్తిగత బాధ్యతను ముందు వరుసలోకి తీసుకు వచ్చి నిలబెట్టాలని సూచిస్తున్నది.  ఇది భారతీయ సభ్యత మౌలిక విషయాల్లో కీలకంగా ఉంది.  

 

మరింత మన్నికైన జీవనాన్ని గడపడం కోసం వ్యక్తులు అనుసరించవలసిన ఒక విస్తృత జాబితాను ఈ మిషన్ లో పేర్కొనడమైంది.  దీనిలో 75 లైఫ్ (75 LiFE) కార్యాలను చేర్చడమైంది.  ఈ జాబితా ఇక్కడితోనే సమాప్తం కాలేదు; దీనిలో మరిన్ని అంశాలను చేర్చడానికి కూడా అవకాశం  ఉంది.  ఇది ముఖ్యంగా అత్యధిక వినియోగానికి బదులు విచక్షణయుక్త వినియోగాన్ని పాటించాలనిచక్రీయ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనివ్యర్థ ఉత్పాదనలను తిరిగి ఉపయోగంలోకి తీసుకు వచ్చే ప్రక్రియలను చేపట్టాలనితక్కువ పర్యావరణ పాదముద్ర కలిగిన స్థానిక మొక్కలను వాడుకొని  వండుకొనే వంటకాలను భుజించాలని. జలాన్నిఇంధనాన్ని ఆదా చేసుకోవడాన్ని ప్రోత్సహించాలని చెబుతోందని సర్వే పేర్కొంది.

 

అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) కథనాన్ని ఆర్థిక సర్వే పత్రం ఉదాహరిస్తూ, లైఫ్ (LiFE) కార్యక్రమం బోధిస్తున్న వివిధ కార్యాలనుచర్యలను ప్రపంచ స్థాయిలో ఆచరణలోకి తీసుకు వస్తే 2030 లో బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలలో ఏటా బిలియన్ టన్నుల కన్నా మించిన క్షీణత నమోదు కాగలదు (ఉద్గారాలు 2030 నాటికి 20 శాతం వరకు తగ్గాలి)అంతేకాక వినియోగదారులకు సుమారు 440 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు పొదుపు సాధ్యపడుతుందని పేర్కొంది.

 

మిషన్ లైఫ్’ (Mission ‘LiFE’) యొక్క ఉద్దేశ్యాలను సర్వే పత్రం సమర్ధిస్తూ, వాతావరణ మార్పు తో ముడిపడ్డ ప్రపంచ ఉద్యమం సంబంధిత దేశాల ఇష్టాలకు, ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని, అదే సమయంలో దాని కేంద్ర స్థానంలో వ్యక్తిగత నడవడికకు పెద్దపీటను వేయాలని పేర్కొంది.  ఇది సమదృష్టితో సమాజాలను పునర్ నిర్మించవలసిన తరుణం అని కూడా ఆర్థిక సర్వే తెలిపింది.

 

***


(Release ID: 2035244) Visitor Counter : 357