ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పద్మ శ్రీ పురస్కార గ్రహీత కమల పూజారి మృతి కి ప్రధాన మంత్రి సంతాపం

प्रविष्टि तिथि: 20 JUL 2024 4:45PM by PIB Hyderabad

పద్మ శ్రీ పురస్కార సమ్మానాన్ని పొందిన కమల పూజారి మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

వ్యవసాయ రంగానికి మరీ ముఖ్యంగా సేంద్రియ వ్యావసాయిక విధానాలను ప్రోత్సహించడానికి, దేశవాళీ విత్తనాలను సంరక్షించడానికి ఆమె మహత్తరమైన తోడ్పాటును అందించారని ప్రధాన మంత్రి  అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

శ్రీమతి కమల పూజారి గారి కన్నుమూత వార్త దు:ఖాన్ని కలిగించింది. ఆమె వ్యవసాయ రంగానికి, మరీ ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయ విధానాలను పెంపొందింపచేయడానికి, దేశవాళీ విత్తనాలను సంరక్షించడానికి చెప్పుకోదగ్గ రీతిలో తోడ్పడ్డారు. స్థిరత్వానికి సంపన్నతను చేకూర్చడంలో, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో ఆమె చేసిన ప్రయత్నాలను ఏళ్ల తరబడి స్మరించుకోవడం జరుగుతుంది. ఆదివాసి సముదాయాలకు సాధికారితను కల్పించే కృషిలో కూడా ఆమె మార్గదర్శిగా నడుచుకొన్నారు. ఆమె కుటుంబానికి, ఆమె ప్రశంసకులకు ఇదే సంతాపం. ఓం శాంతి.

 

 

 

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2034825) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam